మరికొంతకాలం ఎన్‌బీఎఫ్‌సీలపై ‘నోట్ల రద్దు’ ఎఫెక్ట్: మూడీస్
ముంబై: దేశంలో నోట్ల రద్దు ప్రభావం నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై మరికొంత కాలం కొనసాగుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ– మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ విశ్లేషకులు అల్కా అంబరసు పేర్కొన్నారు. ముఖ్యంగా వాహన విభాగం, ఆస్తుల తనఖా వంటి విభాగాల్లో వసూళ్లపై మరికొన్ని త్రైమాసికాలు ప్రతికూలత పడుతుందని విశ్లేషించారు. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేశారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా రిటైల్ రుణం విషయంలో తన వాటాను ఎన్‌బీఎఫ్‌సీ పెంచుకుంటోందని, ఇదే ధోరణి కొనసాగే వీలుందని నివేదికలో మూడీస్ వివరించింది.