భారత జీడీపీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడిస్(Moody's) అంచనా వేసింది. 2025–26లో 6.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ బలమైన విస్తరణతో బీమా రంగం ప్రయోజనం పొందనున్నట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance)కు పెరుగుతున్న డిమాండ్‌తో బీమా కంపెనీలు ప్రీమియంలో స్థిరమైన వృద్ధిని చూడనున్నాయని వివరించింది. అధిక ప్రీమియం ఆదాయం, పెరుగుతున్న ప్రీమియం ధరలు, ప్రభుత్వ సంస్కరణలతో బీమా రంగం లాభదాయకత మెరుగుపడనున్నట్టు అంచనా వేసింది.
‘భారత ప్రైవేటు బీమా కంపెనీలు తమ వినియోగదారుల బేస్‌ను పటిష్టం చేసుకోవడం కొనసాగనుంది. కాకపోతే అండర్‌రైటింగ్ ఎక్స్‌పోజర్, నియంత్రణపరమైన మార్పులతో వాటి క్యాపిటల్ అడెక్వెసీపై ఒత్తిళ్లు కొనసాగనున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25లో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముందటి సంవత్సరంలో వృద్ధి 8.2 శాతం కంటే కొంత తక్కువ. భారత తలసరి ఆదాయం–కొనుగోలు శక్తి సమానత్వం సైతం వృద్ధి చెందుతోంది. 11 శాతం వృద్ధితో 2024 మార్చి నాటికి ఇది 10,233 డాలర్లకు చేరింది’ అని మూడిస్ పేర్కొంది. భారత జాతీయ గణాంక కార్యాలయం (NSO) 2024–25 సంవత్సరానికి జీడీపీ 6.4 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనా కంటే మూడిస్ అంచనాలు బలంగా ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు
భారీ అవకాశాలు..
అధిక సగటు ఆదాయం, వినియోగదారుల రిస్క్ ధోరణి బీమాకు, ముఖ్యంగా ఆరోగ్య బీమాకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు మూడిస్ పేర్కొంది. 2024 మొదటి ఎనిమిది నెలల్లో బీమా ప్రీమియం ఆదాయం 16 శాతం పెరిగినట్టు తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రీమియంలో 8 శాతం వృద్ధిని అధిగమించినట్టు వివరించింది. ‘భారత్‌లో బీమా విస్తరణ రేటు (జీడీపీలో బీమా ప్రీమియంల వాటా) 2024 మార్చి నాటికి 3.7 శాతంగానే ఉంది. యూకే 9.7 శాతం, యూఎస్ 11.9 శాతంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. అందుకే భారత బీమా రంగం బలమైన విస్తరణకు పుష్కల అవకాశాలున్నాయి’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment