moodys analytics
-
నీటి కొరతతో.. ఎకానమీకి కష్టమే
న్యూఢిల్లీ: భారత్‌లో నీటి కొరత ఎకానమీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది. భారతదేశంలో పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అంతరాయం కలిగిస్తుందని అలాగే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు, ఆదాయంలో క్షీణతకు, సామాజిక అశాంతికి దారితీయవచ్చనివిశ్లేషించింది. ఆయా ప్రభావాలు సావరిన్ క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావం చూపుతుందని సూచించింది. బొగ్గు విద్యుత్ జనరేటర్లు, ఉక్కు తయారీ వంటి నీటిని అధికంగా వినియోగించే రంగాల ప్రయోజనాలకు సైతం నీటి కొరత విఘాతం కలిగిస్తుందని హెచ్చరించింది. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. అలాగే వాతావరణ మార్పుల కారణంగా నీటి ఒత్తిడి తీవ్రమవుతోందని కూడా పేర్కొంది. వాతావరణ మార్పులు కరువు, తీవ్ర వేడి, వరదలు వంటి తీవ్రమైన సంఘటనలకు కారణమవుతాయని వివరించింది. భారత్ ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలపై మూడీస్ రేటింగ్స్ వెలువరించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. 👉ఢిల్లీ, ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు జూన్ 2024లో 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారతదేశంలోని అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యాలలో వరదలు కూడా కారణం. ఇది నీటి మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగిస్తాయి. ఆకస్మిక భారీ వర్షాల నుండి నీటిని నిలుపుకోవడం సాధ్యమయ్యే పనికాదు. 👉 2023లో ఉత్తర భారతదేశంలోని వరదలు, గుజరాత్‌లోని బిపార్జోయ్ తుఫాను కారణంగా 1.2–1.8 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని, మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన విషయం ఇక్కడ గమనార్హం.👉 రుతుపవన ఆధారిత వర్షపాతం కూడా తగ్గుతోంది. 1950–2020 సమయంలో హిందూ మహాసముద్రం దశాబ్దానికి 1.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున వేడెక్కింది. ఇది 2020–2100 మధ్యకాలంలో 1.7–3.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలపడం గమనార్హం. 👉 వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితులు తరచూ సంభవించే అవకాశాలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశంలో రుతుపవన వర్షపాతం 2023లో 1971–2020 సగటు కంటే 6 శాతం తక్కువగా ఉంది. అకాల వర్షాలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. భారతదేశంలో 70 శాతానికి పైగా వర్షపాతం ప్రతి సంవత్సరం జూన్–సెపె్టంబరులో కేంద్రీకృతమై ఉంటోంది. 2023 ఆగస్టులో దేశంలో భారీగా వర్షపాతం నమోదుకావడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. 👉 గతంలో సంభవించి న వ్యవసాయ ఉత్పత్తికి ఆటంకాలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుదల వల్ల ఆహార సబ్సిడీల భారం నెలకొంది. ఇది దేశంలో ద్రవ్యలోటు పరిస్థితులకూ దారితీసింది. ఆహార సబ్సిడీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 4.3 శాతంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. బడ్జెట్లోని భారీ కేటాయింపుల్లో ఈ విభాగం ఒకటి. 👉భారత ప్రభుత్వం నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి కృషి చేస్తోంది. అదే సమయంలో నీటి భారీ పారిశ్రామిక వినియోగదారులు తమ నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు అటు దేశానికి సంబంధించి సావరిన్ రేటింగ్ మెరుగుపరచుకోడానికి, కంపెనీలకు సంబంధించి దీర్ఘకా లికంగా నీటి నిర్వహణ ప్రతికూలత రేటింగ్లను తగ్గించుకోవడానికి దోహదపడతాయి. 👉భారతదేశంలో ఫైనాన్స్ మార్కెట్ చిన్నది. కానీ వే గంగా అభివృద్ధి చెందుతోంది. కంపెనీలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు నిధుల సేకరణ విషయంలో ఇది కీలకమైన అంశం. తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న కొన్ని రాష్ట్రాలు నీటి నిర్వహణలో పెట్టుబడి కోసం నిధులను సమీకరించడానికి దేశ ఫైనాన్స్ మార్కెట్‌ను ఉపయోగించాయి. 👉పారిశ్రామికీకరణ, పట్టణీకరణ దేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం, భారత్ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 26 శాతం. ఇప్పటికి జీ–20 వర్థమాన దేశాల (ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 32 శాతం) కన్నా ఇది తక్కువ. మున్ముందు పరిశ్రమల రంగం మరింత విస్తరించే వీలుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు దేశ మొత్తం జనాభాలో ప్రస్తుతం 36 శాతం. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం, జీ–20 వర్థమాన దేశాల్లో ఇది 76 శాతం వరకూ ఉంది. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు –నివాసితుల మధ్య మున్ముందు నీటి కోసం తీవ్ర పోటీ నెలకొనే వీలుంది. 👉ఫిబ్రవరి 2023 నాటి ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకురావడానికి భార త ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బహుళజాతి బ్యాంకింగ్ (ప్రపంచబ్యాంక్) మద్దతు ఇచ్చింది. 1.2 బిలియన్ డాలర్ల మొత్తం ఫైనా న్సింగ్తో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 కోట్ల మంది ప్రయోజనం పొందారు.జలవనరుల శాఖ డేటాజలవనరుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారత్ సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్ల నుండి 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు పడిపోవచ్చు. 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ స్థాయి నీటి ఒత్తిడిని సూచిస్తుంది. 1,000 క్యూబిక్ మీటర్లకు పడిపోతే అది నీటి కొరతకు కొలమానం.నివేదిక నేపథ్యం ఇదీ..ఇటీవల బెంగళూరు, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నివాసితులు తీవ్ర నీటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు నిరసనలు, రాజకీయ సంఘర్షణకు దారితీస్తోంది. ఈ అంశంపై జూన్ 21న నిరాహార దీక్ష ప్రారంభించిన ఢిల్లీ జల వనరుల మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణించడంతో తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే మూడీస్ తాజా నివేదిక వెలువరించింది. -
షాకింగ్:రాకెట్లా పెట్రోల్,డిజీల్ ధరలు..రూ.15 నుంచి రూ.20కి పెరిగే ఛాన్స్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయాయి. ఈ మూడు సంస్థల ఎబిట్డాలో ఇది 20 శాతానికి సమానం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు నాలుగు నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించకుండా ఒకే ధరను కొనసాగించడం తెలిసిందే. 137 రోజుల పాటు ధరలను సవరించలేదు. బ్యారెల్ క్రూడ్ 82 డాలర్ల వద్ద చివరిగా ధరలను సవరించగా.. 120 డాలర్లకు పెరిగిపోయినా కానీ, అవే రేట్లను కొనసాగించాయి. నిత్యం రూ.525 కోట్ల నష్టం.. ‘‘ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బ్యారెల్ చమురుపై 25 డాలర్ల ఆదాయాన్ని, పెట్రోల్, డీజిల్ విక్రయంపై 24 డాలర్ల నష్టాన్ని చూస్తున్నాయి. ఒకవేళ చమురు ధరలు బ్యారెల్‌కు సగటున 111 డాలర్ల వద్ద కొనసాగితే, పెరిగిన ధరల మేరకు విక్రయ రేట్లను సవరించకపోతే.. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ రోజువారీగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై 65–70 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు) నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. మూడున్నర నెలల విరామం తర్వాత మార్చి 22 నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాన్ని ప్రారంభించడం తెలిసిందే. మరింత పెంచాల్సిందే..! ‘‘ముడి చమురు బ్యారెల్ ధర 110–120 డాలర్ల మధ్య కొనసాగితే ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్‌పై రూ.13.10–24.90 మేర.. లీటర్ పెట్రోల్‌పై 10.60–22.30 చొప్పున ధరలను పెంచాల్సి వస్తుంది’’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. క్రిసిల్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం చూసినా.. ముడి చమురు బ్యారెల్ 100 డాలర్ల వద్ద సగటున ఉంటే పెట్రోల్, డీజిల్‌కు లీటర్‌పై రూ.9–12 మేర, 110–120 డాలర్ల మధ్య ఉంటే రూ.15–20 మధ్య పెంచాల్సి వస్తుంది. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఒక్కటే 1–1.1 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోగా, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ 55–560 మిలియన్ డాలర్ల మేర 2021 నవంబర్ – 2022 డిసెంబర్ మధ్యకాలంలో నష్టాన్ని చవిచూసినట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా. ‘‘ఆదాయంలో ఈ మేరకు నష్టం స్వల్పకాల రుణ భారాన్ని పెంచుతుంది. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నంత వరకు మూలధన నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. కొంత కాలానాకి చమురు ధరలు దిగివస్తే అప్పుడు ఆయిల్ కంపెనీలు కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
పుతిన్.. నీకు అర్థమవుతుందా? సెమీకండక్టర్లకు యుద్ధం దెబ్బ
ముంబై: మహమ్మారి దెబ్బతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సెమీకండక్టర్ల సరఫరా సమస్య తాజాగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల మరింత తీవ్రం కానుంది. చిప్‌ల తయారీకి అవసరమైన కీలక ముడి ఉత్పత్తుల్లో సింహభాగం వాటా ఈ రెండు దేశాల నియంత్రణలో ఉండటమే ఇందుకు కారణం. సెమీకండక్టర్ల తయారీలో పల్లాడియం, నియాన్ కీలకమైన ముడి ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా పల్లాడియం సరఫరాలో 44 శాతం వాటా రష్యాదే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే నియాన్ .. 70 శాతం భాగం ఉక్రెయిన్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే అంతర్జాతీయంగా చిప్‌ల కొరత మరింత పెరగవచ్చని మూడీస్ అనలిటిక్స్ ఒక నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్ చిప్‌లను మొబైల్ ఫోన్స్ మొదలుకుని వాహనాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ తదితర ఉత్పత్తులన్నింటిలోనూ విరివిగా వాడతారు. రేట్లు రయ్.. 2014–15లో రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు నియాన్ ధరలు అనేక రెట్లు పెరిగిపోయాయి. యుద్ధం అంటూ వస్తే సెమీకండక్టర్ల పరిశ్రమకు ఎలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు అన్నది అప్పుడే వెల్లడైంది. 2015 తర్వాత నుంచి చిప్‌ల తయారీ కంపెనీలు నిల్వలను గణనీయంగా పెంచుకున్నప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొరత ఏర్పడింది. ఇక గోరుచుట్టుపై రోకటిపోటులాగా యుద్ధం కూడా వచ్చి పడటంతో.. ఉద్రిక్త పరిస్థితులు సత్వరం చక్కబడకపోతే వాహనాల తయారీ సంస్థలు, ఎల్రక్టానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు మొదలైన పరిశ్రమలన్నింటిపైనా తీవ్ర ప్రభావం పడొచ్చని నివేదిక హెచ్చరించింది. ఎగియనున్న ద్రవ్యోల్బణం .. క్రూడాయిల్ రేట్లు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం కూడా ఎగియనుంది. అమెరికా తన ఇంధన అవసరాల కోసం రష్యా, ఉక్రెయిన్లపై నేరుగా ఆధారపడకపోయినా రష్యన్ ఇంధనాన్ని ఉపయోగించే పలు యూరప్, ఆసియా దేశాల సంస్థల నుంచి అనేక ఉత్పత్తులు, సర్వీసులను దిగుమతి చేసుకుంటోంది. ఆ రకంగా పరోక్షంగా రష్యన్ ఇంధన కొరత సెగ అమెరికాకు కూడా తగిలే అవకాశం ఉంది. ఇంధనాల ధరలు ఎగియడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంపై గణనీయంగా ప్రభావం పడనుంది. యుద్ధం రావడానికి ముందే .. మహమ్మారి విజృంభించిన సమయంలోనే 2021లో షిప్పింగ్ వ్యయాలు ఏకంగా 300 శాతం పెరిగిపోయాయి. చాలా మటుకు సరిహద్దులు, పోర్టులను మూసివేయడం వల్ల పలు పోర్టుల్లో కంటైనర్లు చిక్కుబడిపోవడం ఇందుకు కారణం. దీంతో అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య అత్యంత లాభదాయక రూట్లపైనే దృష్టి పెడుతున్నాయి. గతేడాది ఆఖరు నుంచి షిప్పింగ్ వ్యయాలు.. గరిష్ట స్థాయి నుంచి కాస్త దిగి వచ్చినప్పటికీ కొత్త కంటైనర్ల కొరత వల్ల ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ యుద్ధం వల్ల చాలా మటుకు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోవచ్చని, ఫలితంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది. దీనివల్ల వృద్ధి మందగించడంతో పాటు యుద్ధంతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా కంపెనీలు, వినియోగదారులపై అధిక ధరలు.. వడ్డీ రేట్ల వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొంది. యూరప్ దేశాలకు చమురు సెగ.. ఇరు దేశాల మధ్య యుద్ధంతో చమురు ధరలు గణనీయంగా పెరిగిపోతాయని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. ఒకవేళ రష్యా నుంచి సరఫరా పెరిగినప్పటికీ చమురును దిగుమతి చేసుకునే దేశాలపై ప్రతికూల ప్రభావం కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం చమురు ధర తొమ్మి దేళ్ల గరిష్టానికి ఎగబాకి, బ్యారెల్‌కు దాదాపు 111 డాలర్ల స్థాయిలో తిరుగాడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 12%గా ఉంటుంది. సహజ వాయువు ఉత్పత్తిలో 17%, బొగ్గు 5.2%, జింక్ 15%, బంగారం 9.5%, పల్లాడియం 44%, ప్లాటినం ఉత్పత్తిలో 14% రష్యాకి ఉంది. వీటిపై కూడా చమురు కాకుండా అల్యుమినియం, గోధుమలు, నికెల్, వెండి మొదలైనవి కూడా ఉత్పత్తి చేస్తోంది. యూరప్ దేశాలు తమ ఇంధన అవసరాల కోసం ఎక్కువగా రష్యాపైనే ఆధారపడుతుండటం వల్ల వాటిపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కరోనాతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు ఇప్పటికే బలహీనపడగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధనాలపై ఆధారపడే చాలా మటుకు పరిశ్రమలు సమస్యలను ఎదుర్కొనాల్సి రానుంది. చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్.. ఆదాయం, ఖర్చుల లెక్కలపై రోజువారీ పర్యవేక్షణ -
భారత్‌లో తీవ్రంగా ధరల పెరుగుదల: మూడీస్
న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ అనుబంధ విభాగం- మూడీస్ ఎనలిటిక్స్ విశ్లేషించింది. ఆసియా దేశాల ఎకానమీలతో పోల్చితే భారత్‌లోనే ధరల స్పీడ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఇంధన ధరల ప్రభావం మున్ముందూ కొనసాగే అవకాశం ఉందని అంచనావేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు-రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గకపోవచ్చని ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ కంపెనీ అభిప్రాయపడింది. జనవరిలో 4.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. కోర్ ఇన్ఫ్లెషన్ (ఫుడ్, ఫ్యూయెల్, విద్యుత్ మినహా) ఇదే కాలంలో 5.3 శాతం నుంచి 5.6 శాతానికి ఎగసింది. ఆర్బీఐ రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన(2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ‘ద్రవ్యోల్బణం భయాలతో’ యథాతథ రేటును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందని అంచనావేస్తున్న ఆర్బీఐ, భవిష్యత్తులో రేటు తగ్గింపునకే అవకాశం ఉందని సూచిస్తూ, వృద్ధికి దోహదపడే సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లు ప్రకటిస్తూ వస్తోంది. కేంద్రం ఆర్బీఐకి ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలి. ఏప్రిల్ 7న ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మూడీస్ ఎనలిటిక్స్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... పలు ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణం తగిన స్థాయిలోనే ఉంది. చమురు ధరల పెరుగుదల, దేశాల ఎకానమీలు తిరిగి ఊపందుకోవడం వంటి కారణాల వల్ల 2021లో కొంత పెరిగే అవకాశం ఉంది. భారత్‌తో పాటు ఫిలిప్పైన్స్‌లో కూడా ద్రవ్యోల్బణం తగిన స్థాయికన్నా ఎక్కువగా ఉంది. విధాన నిర్ణేతలకు ఇది ఒక పెద్ద సవాలే. 2020లో పలు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగిన ‘‘6 శాతం’’ స్థాయికన్నా ఎక్కువగా ఉంది. దీనివల్ల దేశంలో రెపో రేటు మరింత తగ్గించలేని పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ పరపతి విధాన కమిటీకి ప్రస్తుతం కేంద్రం నిర్దేశిస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణ శ్రేణి (2-6 శాతం) మార్చి 31వ తేదీ తర్వాతా కొనసాగించే అవకాశం ఉంది. ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఎఫ్టీఐ (ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లెషన్ టార్గెట్) ఫ్రేమ్‌వర్క్ ఈ మేరకు మార్గదర్శకాలు చేస్తోంది. 2016 నుంచీ అమల్లో ఉన్న ఈ మార్గదర్శకాల గడువు 2021 మార్చి 31వ తేదీతో తీరిపోనున్న సంగతి తెలిసిందే. చదవండి: ఏప్రిల్‌లో ఎన్నిరోజులు బ్యాంక్‌లకు సెలవులంటే..! పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా! -
2020-21లో వృద్ధిరేటు సున్నా శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో దేశీయ వృద్ది రేటు గణనీయంగా పతనం కానుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్సీస్ శుక్రవారం ప్రకటించింది. నెగెటివ్ నుంచి భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను సున్నాకు తగ్గించేసింది. కోవిడ్-19 కల్లోలం, లాక్ డౌన్ కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎటువంటి వృద్ధిని కనబరచదని వెల్లడించింది. అయితే 2022లో ఇది 6.6 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఆర్థిక లోటు జీడీపీ లో 5.5 శాతానికి పెరుగుతుందని మూడీస్ విశ్లేషకులు శుక్రవారం తెలిపారు. బడ్జెట్ అంచనా ప్రకారం 3.5 శాతం మాత్రమే. గత నెల చివరిలో, మూడీస్ తన క్యాలెండర్ సంవత్సరం 2020 జీడీపీ వృద్ధి అంచనాను 0.2 శాతానికి తగ్గించిన సంగతి విదితమే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి, మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న మూల ధన సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. జీడీపీ తిరిగి అత్యధికస్థాయికి కి పుంజుకోక పోతే బడ్జెట్ లోటును తగ్గించడంలో, రుణ భారం పెరగకుండా నిరోధించడంలో ప్రభుత్వం కీలక సవాళ్లను ఎదుర్కొంటుందని మూడీస్ తెలిపింది. వృద్ధి క్షీణత, ప్రభుత్వ ఆదాయ ఉత్పత్తి, కరోనావైరస్-సంబంధిత ఆర్థిక ఉద్దీపన చర్యలతో ప్రభుత్వ డెట్ రేషియోలకు దారితీస్తుందనీ, రాబోయే కొన్నేళ్లలో జీడీపీలో 81 శాతానికి పెరుగుతుందని భావిస్తు న్నామని పేర్కొంది. కాగా గత నవంబరులో ఆర్థిక వ్యవస్థ అవుట్ లుక్ ను ‘నెగటివ్’కి చేర్చిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. (ఎస్బీఐ ఉద్యోగికి కరోనా: కార్యాలయం మూసివేత) -
కరోనా: జీడీపీపై సంచలన అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాలు యుద్ధాన్ని అప్రతి హతంగా కొనసాగిస్తున్నాయి. ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు లాక్డౌన్ పరిస్థితుల మధ్య ప్రపంచ ఆర్థికవ్యవస్థ మరింత మాంద్యంలోకి జారిపోతోంది. అనేక కీలక పరిశ్రమలు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ సంచలన విషయాన్ని ప్రకటించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటు 2.5 శాతానికి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ భయాల మధ్య మూడీస్ తాజాగా ఈ అంచనాలను వెల్లడించింది. (రుణ గ్రహీతలకు భారీ ఊరట) రాబోయే రెండు, మూడు త్రైమాసికాలు భారతదేశంలో అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావం చెందనుండడంతో.. జీడీపీ వృద్ధి రేటు అంచనాలలో భారీగా కోత పడనుందని తెలిపింది. భారత జీడీపీ వృద్ధి రేటు మరింత కనిష్టానికి పడిపోనుందని అంచనా వేసింది. ఒక దశలో 8 శాతం పైగా వృద్ధి రేటుతో దూసుకుపోయిన భారత జీడీపీ 2019 లో 5 శాతానికి చేరింది. ఇపుడు 5 శాతం మార్కును అందుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. పారిశ్రామిక రంగంతో పాటు వాహన రంగాలు కుదేలు కావడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. (వచ్చే 3నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదు) మరోవైపు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన కారణంగా ప్రస్తుత త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కేవలం 1 శాతానికి పడిపోతుందని ఐఎన్జీ గ్రూప్, డాయిష్ బ్యాంకు సహా పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏప్రిల్-జూన్ నెలల్లో నిజమైన జీడీపీ వృద్ధి కుప్పకూలనుందని, చైనా అనుభవంతో వార్షిక ప్రాతిపదికన 5 శాతం లేదా అంతకంటే దిగువకు చేరుతుందని డాయిష్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ అంచనా వేశారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 4.7 శాతం విస్తరించిన ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో రెండు దశాబ్దాల కనిష్టానికి చేరనుందని సింగపూర్ ఐఎన్జీ ఆర్థికవేత్త ప్రకాష్ సక్పాల్ తెలిపారు. ముఖ్యంగా భారతదేశ జీడీపీలో 57 శాతం వాటా ఉన్న ప్రైవేట్ వినియోగం ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు సున్నా శాతానికి పడిపోనున్న నేపథ్యంలో జీపీడీ వృద్ధి కేవలం 1 శాతానికి పడిపోతుందన్నారు. (ప్యాకేజీ లాభాలు) -
సెంట్రల్‌బ్యాంక్, ఐఓబీ రేటింగ్ పెంపు
ముంబై: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ రేటింగ్ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు కారణమని మూడీస్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్‌లకు ఉన్న బీఏఏ3/పీ–3 రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కూడా మూడీస్ వివరించింది. గత నెల్లో కేంద్రం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,200 కోట్ల తాజా మూలధనాన్ని అందించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్‌కు రూ. 2,560 కోట్లు లభించగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.3,810 కోట్లు సమకూరాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,640 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు రూ. 4,110 కోట్లు లభించాయి. 2018 డిసెంబర్ నుంచి జనవరి 2019 మధ్య ఐఓబీకికి రూ.6,690 కోట్ల తాజా మూలధనం లభించింది. -
భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్... స్థిరం
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ అవుట్‌లుక్‌ను మరో 12 నుంచి 18 నెలలు ‘స్థిరం’గా ఉంచుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. బ్యాంకింగ్ రుణ నాణ్యత బలహీనంగా ఉన్నా... స్థిరంగా ఉందని వివరించింది. ఇందుకు సంబంధించి మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని వివరించిన అంశాల్లో క్లుప్తంగా కొన్ని... ►బ్యాంకింగ్‌కు స్థిర అవుట్‌లుక్ ఇవ్వడంలో ఆరు ప్రమాణాలను అనుసరించడం జరిగింది. నిర్వహణా పరమైన వాతావరణం, రుణ నాణ్యత, మూలధనం, నిధుల సమీకరణ, రుణ లభ్యత, లాభదాయకత, సామర్థ్యం, ప్రభుత్వ మద్దతు. ఆ ఆరు ప్రమాణాల విషయంలో బ్యాంకుల పరిస్థితి ‘స్థిరం’గా ఉంది. ►ఇక పటిష్ట ఆర్థిక వృద్ధి పరిస్థితులూ బ్యాంకింగ్ రంగ స్థిరత్వానికి దోహదపడుతున్నాయి. ► 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2019–2020లో ఈ రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా. పెట్టుబడులు పెరగడం, పటిష్ట వినియోగం దీనికి కారణం. ►కాగా, ఆర్థిక వ్యవస్థలో రుణాలకు సంబంధించి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్(ఎన్బీఎఫ్సీ) చాలా కీలకమైనవి. ఎన్బీఎఫ్ఐలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరమైన ఇబ్బందులు వృద్ధిని మందగింపజేస్తున్నాయి. వడ్డీరేట్ల పెరుగుదలా ఇక్కడ ప్రతికూలంగా మారుతోంది. ► ఇక ప్రత్యేకించి బ్యాంకింగ్ రుణ నాణ్యత విషయానికి వస్తే, బలహీనంగా ఉన్నా స్థిరంగా ఉంది. రుణ వృద్ధి తిరిగి పుంజుకుంటోంది. కంపెనీల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతున్నాయి. మొండిబకాయిల సమస్యలూ క్రమంగా పరిష్కారమవుతున్నాయి. ఇవన్నీ రుణ లభ్యత మెరుగుకు దోహదపడే అంశాలే. అయితే బడా ఎన్పీఏల సమస్య పరిష్కారంపైనే రుణ నాణ్యత పూర్తి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ) వచ్చిన రెండేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఎన్పీఏల పరిష్కారానికి అవకాశం ఏర్పడినట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ ఇటీవలే తెలిపారు. బ్యాంకింగ్ ఎన్పీఏలు రుణాల్లో దాదాపు 12 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ►బ్యాంకింగ్ మూలధనం విషయానికి వస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ విషయంలో బలహీనంగానే ఉన్నాయి. కనీస మూలధన అవసరాలకు ప్రభుత్వ మూలధన మద్దతుపై ఆధారపడుతున్నాయి. అయితే కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మూలధన అవసరాలను తట్టుకోగల పరిస్థితుల్లో బ్యాంకులు కొనసాగుతున్నాయి. ► బ్యాంకుల లాభదాయకత మెరుగుపడుతోంది. అయితే అధిక రుణ వ్యయాలు లాభదాయకతకు ప్రతికూలంగా తయారవుతున్నాయి. ►మూడీస్ దేశంలో 15 వాణిజ్య బ్యాంకులకు రేటింగ్ ఇస్తోంది. మొత్తం బ్యాంకింగ్ రుణాల్లో ఈ బ్యాంకుల వాటా 70 శాతం. ఈ 15 బ్యాంకుల్లో 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే, బలహీనంగా ఉన్నాయి. రిటైల్ రుణాల్లో ఆ 11 బ్యాంకులు బాగున్నాయి: జఫ్రీన్ మొండిబకాయిల (ఎన్పీఏ) భారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల ప్రక్రియ (పీసీఏ) కిందకు వెళ్లిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల రిటైల్ రుణాలు బాగున్నాయని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– జఫ్రీస్ పేర్కొంది. 2015 మార్చిలో మొత్తం రిటై ల్ రుణాల్లో ఈ 11 బ్యాంకుల వాటా 15 శాతం అయితే, 2018 సెప్టెంబర్‌లో ఈ వాటా 4 శాతం పెరిగి 19 శాతానికి చేరిందని ఈ సంస్థ నివేదిక పేర్కొంది. పీసీఏ పరిధిలోకి వెళ్లిన బ్యాంకుల్లో అలహాబాద్ బ్యాంక్, యూబీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు ఉన్నాయి. -
'మేకిన్ ఇండియా నినాదం అద్భుతం'
ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇచ్చిన 'మేకిన్ ఇండియా' పిలుపు ఎవరికి ఎలా అనిపించినా, అంతర్జాతీయ విశ్లేషకులకు మాత్రం బాగా నచ్చింది. ఆయన ఎక్కడికెళ్లినా మేకిన్ ఇండియా అంటూ దాని ప్రాశస్త్యం గురించి చెబుతున్నారు. అది ఎందుకు అవసరమో కూడా వివరిస్తున్నారు. ఇటీవల జపాన్ దేశంలో పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామిక వేత్తలను కూడా భారతదేశానికి వచ్చి, ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పాలని, దానివల్ల వాళ్లకు తయారీఖర్చు తగ్గుతుందని, లాభాలు పెరుగుతాయని వివరించారు. అప్పుడే వాళ్లకు కూడా 'కమాన్.. మేకిన్ ఇండియా' అని చెప్పారు. వెంటనే అక్కడ సదస్సులో ఒక్కసారిగా అభినందనలు వెల్లువెత్తాయి. నరేంద్రమోడీ అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని అంతర్జాతీయ నిపుణులు శ్లాఘిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్ ఎనలిటిక్స్' కూడా నరేంద్రమోడీ నినాదాన్ని అభినందించింది. సాధారణంగా భారత రాజకీయ నాయకులు ఇలాంటి చాలా నినాదాలు ఇచ్చి ఊరుకుంటారని, కానీ నరేంద్ర మోడీ విషయంలో మాత్రం అది అమలయ్యేలాగే కనిపిస్తోందని మూడీస్ ఎనలిటిక్స్ సంస్థలో ఆర్థికవేత్త అయిన గ్లెన్ లెవిన్ చెప్పారు. -
గడ్డుకాలం ముగిసినట్లే: మూడీస్
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థకు గడ్డురోజులు ఇక తొలగినట్లేనని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కార్పొరేషన్‌కు చెందిన మూడీస్ ఎనలిటిక్స్ పేర్కొంది. అయితే, సామర్థ్యానికి అనుగుణంగా వృద్ధి మాత్రం 2015లోనే సాధ్యమవుతుందని బుధవారమిక్కడ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటు 5.5%గా ఉండొచ్చని... వచ్చే ఏడాది ఇది 6 శాతం పైనే నమోదయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆర్థిక పరిశోధన, విశ్లేషణలను అందించే ఎనలిటిక్స్ విభాగం ఈ నివేదికను స్వతంత్రంగా ఇచ్చింది. క్రెడిట్ రేటింగ్ విభాగం(మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్) అభిప్రాయాలు ఇందులో లేవని కూడా తెలిపింది. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వ్యాపార విశ్వాసాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రూపాయి విలువ స్థిరీకరణ, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) దిగిరావడంతో ఆర్థిక వ్యవస్థ దిగజారే రిస్క్‌లు తగ్గాయి. ఇటీవలి త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడింది. అయితే, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి సామర్థ్యానికంటే దిగువనే కొనసాగుతోంది. 2013 మధ్య నుంచి ఎగుమతులు వృద్ధి బాటలోకి రావడం ఇతరత్రా సానుకూల అంశాలతో వృద్ధి నిలకడగా నమోదవుతోందని... పెట్టుబడులు కూడా మళ్లీ పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనుందని నివేదికలో మూడీస్ ఎనలిటిక్స్ విశ్లేషకుడు గ్లెన్ లెవిన్ అభిప్రాయపడ్డారు. {పపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రికవరీ మెరుగవుతోంది. ఈ ఏడాది ఎగుమతులు మరింత పెరిగేఅవకాశం ఉంది. దీంతో క్యాడ్ ఇంకా తగ్గొచ్చు. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి ఉండొచ్చు. క్యాడ్‌కు కళ్లెం పడటం(క్యూ2లో 1.2%)తో రూపాయికి సానుకూలం. {దవ్యోల్బ ణం దిగివస్తుండటం వ్యాపార విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ ఏడాదంతా టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖ ధోరణిలోనే ఉండొచ్చు.