గడ్డుకాలం ముగిసినట్లే: మూడీస్
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థకు గడ్డురోజులు ఇక తొలగినట్లేనని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కార్పొరేషన్‌కు చెందిన మూడీస్ ఎనలిటిక్స్ పేర్కొంది. అయితే, సామర్థ్యానికి అనుగుణంగా వృద్ధి మాత్రం 2015లోనే సాధ్యమవుతుందని బుధవారమిక్కడ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటు 5.5%గా ఉండొచ్చని... వచ్చే ఏడాది ఇది 6 శాతం పైనే నమోదయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది.
ఆర్థిక పరిశోధన, విశ్లేషణలను అందించే ఎనలిటిక్స్ విభాగం ఈ నివేదికను స్వతంత్రంగా ఇచ్చింది. క్రెడిట్ రేటింగ్ విభాగం(మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్) అభిప్రాయాలు ఇందులో లేవని కూడా తెలిపింది.
నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వ్యాపార విశ్వాసాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
రూపాయి విలువ స్థిరీకరణ, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) దిగిరావడంతో ఆర్థిక వ్యవస్థ దిగజారే రిస్క్‌లు తగ్గాయి.
ఇటీవలి త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడింది. అయితే, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి సామర్థ్యానికంటే దిగువనే కొనసాగుతోంది.
2013 మధ్య నుంచి ఎగుమతులు వృద్ధి బాటలోకి రావడం ఇతరత్రా సానుకూల అంశాలతో వృద్ధి నిలకడగా నమోదవుతోందని... పెట్టుబడులు కూడా మళ్లీ పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనుందని నివేదికలో మూడీస్ ఎనలిటిక్స్ విశ్లేషకుడు గ్లెన్ లెవిన్ అభిప్రాయపడ్డారు.
{పపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రికవరీ మెరుగవుతోంది. ఈ ఏడాది ఎగుమతులు మరింత పెరిగేఅవకాశం ఉంది. దీంతో క్యాడ్ ఇంకా తగ్గొచ్చు.
అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి ఉండొచ్చు.
క్యాడ్‌కు కళ్లెం పడటం(క్యూ2లో 1.2%)తో రూపాయికి సానుకూలం.
{దవ్యోల్బ ణం దిగివస్తుండటం వ్యాపార విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ ఏడాదంతా టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖ ధోరణిలోనే ఉండొచ్చు.