Indias financial system
-
పన్ను సమస్యలను పరిష్కరిస్తాం
విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక శాఖ హమీ * దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పన్ను సంబంధిత ఆందోళనలన్నింటినీ వీలైనంతం వేగంగా పరిష్కరిస్తామని కేంద్రం హామీనిచ్చింది. అయితే, దేశంలో శాశ్వత కార్యకలాపాలను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరుతున్నట్లు కూడా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు దిగ్గజ ఎఫ్‌పీఐలతో భేటీ అయ్యారు. సిటీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్, ఫిడిలిటీ, గోల్డ్‌మన్ శాక్స్, బ్లాక్‌రాక్ సహా రెండు డజన్లకుపైగా అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఈ భేటీలో ఎఫ్‌పీఐలు అనేక సూచనలు, సలహాలను ఇచ్చారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పన్ను సంబంధ సమస్యలు సహజంగా ఉత్పన్నమైనవే. దేశంలో ఫండ్ మేనేజ్మెంట్ పరిశ్రమ స్థితిగతులపై కూడా మేం చర్చించాం’ అని ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ, సెబీ, సీబీడీటీలకు చెందిన ఉన్నతాధికారులకు కూడా ఈ సమావేశానికి హజరయ్యారు. ప్రస్తుతం ఎఫ్‌పీఐలు భారత్‌తో ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం(డీటీఏఏ) ఉన్న దేశాల నుంచి తమ నిధులను ఇక్కడికి తరలిస్తున్నారని.. దీనివల్ల వారికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తున్నట్లు దాస్ చెప్పారు. అయితే, ఆయా సంస్థలు భారత్‌లోనే తమ కార్యకాలాపాలను నెలకొల్పినట్లయితే ఇక్కడి చట్టాల ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ బాండ్లపై 5 శాతం విత్‌హోల్డింగ్ పన్ను అంశాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు నోమురా ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఎండీ నీరజ్ గంభీర్ చెప్పారు. 2017తో ఈ 5 శాతం పన్ను విధింపునకు గడువు ముగియనుంది. ఈ ఏడాది వృద్ధి 7.5 శాతం పైనే... * ఎస్అండ్పీ అంచనాలతో విబేధం భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) వెలిబుచ్చిన అనుమానాలను శక్తికాంత దాస్ తోసిపుచ్చారు. అది కేవలం ఆ సంస్థ అభిప్రాయం మాత్రమేనని.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతంపైనే ఉంటుందని తాము అంచనావేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధి జోరందుకోవాడానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణ చర్యలను చేపట్టనున్నట్లు కూడా దాస్ వెల్లడించారు. భారత్ ఆర్థిక మూలాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయన్నారు. కాగా, భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఇప్పుడున్న బీబీబీ(మైనస్) స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా రేటింగ్ పెంచే అవకాశాల్లేవని స్పష్టం చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యల్ప స్థాయి రేటింగ్. కాగా, విధాన, సంస్కరణల పరంగా తాము ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని... రేటింగ్ అప్‌గ్రేడ్ చేయాలంటూ ఆర్థిక శాఖ చాన్నాళ్లుగా కోరుతున్న సంగతి తెలిసిందే. -
జీఎస్టీతో 1.5% అదనపు వృద్ధి: పరిశ్రమ చాంబర్లు
న్యూఢిల్లీ: లోక్‌సభలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కొత్త పన్నుల వ్యవస్థ అమల్లోకి రావడం వల్ల భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు అదనంగా 1.5 శాతం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. దేశ వ్యాప్తంగా ఉమ్మడి మార్కెట్ ఏర్పాటు వల్ల బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని సైతం పారిశ్రామిక రంగం పేర్కొంది. సీఐఐ: ఏకైక మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించే క్రమంలో ఇది తొలి అడుగని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సైతం ఇది ప్రయోజనం చేకూర్చే అంశమని వివరించారు. వాణిజ్య విస్తృతి, వృద్ధికి జీఎస్టీ అమలు దోహదపడుతుందని అన్నారు. తమ రెవెన్యూ వసూళ్లు పెరగడం వల్ల రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. అసోచామ్: భారత్ పటిష్ట సంస్కరణల దిశలో నడుస్తోందని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులకు ‘లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం’ ఒక సంకేతం ఇచ్చిందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. పీహెచ్డీ చాంబర్ భారత్ ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక గొప్ప మార్పు అని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ అలోక్ బీ శ్రీరామ్ అన్నారు. దేశంలో సంక్లిష్ట పన్ను వ్యవస్థ సరళీకరణకు ఈ పరిణామం దోహదపడుతుందని వివరించారు. -
స్టాక్ మార్కెట్‌కు ఆకాశమే హద్దు
ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది.. - ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనాలు న్యూఢిల్లీ: రానున్న కాలంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగనున్నాయని బిగ్‌బుల్‌గా పిలిచే ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనా వేశారు. సీఐఐ నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన రాకేష్ దేశీ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇండియా ఆర్థిక వ్యవస్థ కొత్త వృద్ధి బాటలో అడుగుపెట్టిందని వ్యాఖ్యానించారు. 2017-18కల్లా జీడీపీ 9% స్థాయిలో పురోగమిస్తుందని అంచనా వేశారు. ఆపై ఏడాది 10% వృద్ధిని చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.రానున్న ఐదేళ్లలో రిటైల్ రంగంలో అద్భుత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత రిటైల్ రంగ పరిమాణం ఐదు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. భవిష్యత్‌లో దేశీ స్టాక్ మార్కెట్లో పటిష్టమైన బూమ్‌కు అవకాశమున్నదని, అయితే బలమైన యాజమాన్యం, పారదర్శక నిర్వహణ కలిగిన కంపెనీల షేర్లను ఎంపిక చేసుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిం చారు. వృద్ధి అవకాశాలున్న రంగాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. వీటిలో రిటైల్ రంగం ఒకటని పేర్కొన్నారు. భారీ స్థాయిలో విస్తరించగలిగే కంపెనీలను ఎంపిక చేసుకోవడం మేలని తెలిపారు. పెట్టుబడులకు ముందుగా అవకాశాలపై కన్నేయాలని చెప్పారు. అవకాశంలేనిదే ఆర్థిక చైతన్యం ఉండదని, ఆర్థిక పురోగతి లేకపోతే లాభదాయకతకూ వీలుచిక్కదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆలోచనతో కాల్గేట్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీగా లాభపడినట్లు వెల్లడించారు. ఇక దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం 500 బిలియన్ డాలర్లుకాగా, ఆర్గనైజ్డ్ రంగం వాటా 8% మాత్రమేనని చెప్పారు. ప్రత్యేకత చూపే రిటైల్ సంస్థలకు భారీ అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. రియల్టీ, రిటైల్ నుంచే..: ఏ దేశానికి చెందిన సంపన్నుల జాబితాను చూసినా రియల్టీ, రిటైల్ రంగాల నుంచి వచ్చిన వారికి తప్పకుండా చోటు లభిస్తుంటుందని వివరించారు. వీటిలో రిటైల్ రంగంలో పలు అవకాశాలున్నాయని చెప్పారు. ఇలాంటి ఆలోచన నుంచే టైటాన్ షేర్లలో ఇన్వెస్ట్‌చేసినట్లు పేర్కొన్నారు. టైటా న్లో ఇకపై కూడా పెట్టుబడులను కొనసాగించనున్నట్లు చెప్పారు. వీటి తరువాత కంపెనీల పోటీతత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇదే విధంగా భవిష్యత్‌లో లార్జ్ క్యాప్‌గా మారగల సత్తా ఉన్న మిడ్ క్యాప్ షేర్లను పెట్టుబడులకు పరిశీలించవచ్చన్నారు. -
ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 20 నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం పటిష్టంగా ఉందని ఆర్థికమంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశం పలు ఆర్థిక అంశాల్లో పురోగతి సాధించిందన్నారు. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్య అంశాలను పరిశీలిస్తే... గడచిన ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ అంటే ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న వ్యత్యాసం) 88 బిలియన్ డాలర్లు. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 4.5% పైబడి ,ఇది తీవ్ర ఆందోళన సృష్టించింది. 2013-14లో ఇది 35 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గింది. జీడీపీలో 3%కన్నా ఎగువకు పెరిగే అవకాశం లేదు. ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయం-వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 4.8%గా ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుతం 4.6% వద్ద కట్టడి చేసే పరిస్థితి ఉంది. యూపీఏ ప్రభుత్వ పాలసీ సానుకూలతే స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాలే ఈ ర్యాలీకి కారణమని భావించడం ఎంతమాత్రం తగదు. బంగారంపై నియంత్రణలు సడలించే యోచన బంగారం దిగుమతులపై నియంత్రణలు సడలించే ఆలోచన వుంది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష తర్వాత ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. గ్యాస్‌పై ఈసీకి నివేదించకుండా ఉండాల్సింది గ్యాస్ ధర రెట్టింపునకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాన్ని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఎన్నికల సంఘానికి(ఈసీ) నివేదించకుండా ఉండాల్సింది. చాలా ఆలోచించి ఎన్నికల నోటిషికేషన్‌కు 3 నెలల క్రితమే క్యాబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం శాఖ అతిజాగ్రత్తకు పోయి ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘానికి నివేదించిందని వ్యక్తిగతంగా భావిస్తున్నా. అసలు ఇలాంటి అవసరమేలేదు. (రిలయన్స్ వంటి కంపెనీలు ఉత్పత్తి చేసిన ఇంధన ధరల రెట్టింపు నోటిఫై చేయడాన్ని ఎన్నికల దృష్ట్యా వాయిదా వేయాలని ఈసీ యూపీఏ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే.) బ్యాంక్ లెసైన్సులపై కూడా ఇదే తీరు... బ్యాంక్ లెసైన్సుల జారీ అంశం ఎన్నికల సంఘానికి నివేదించడం సైతం అతి జాగ్రత్తతో కూడినదే. నేనే కాదు... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో అసలు ప్రభుత్వ పాత్రే ఉండదు. -
గడ్డుకాలం ముగిసినట్లే: మూడీస్
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థకు గడ్డురోజులు ఇక తొలగినట్లేనని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కార్పొరేషన్‌కు చెందిన మూడీస్ ఎనలిటిక్స్ పేర్కొంది. అయితే, సామర్థ్యానికి అనుగుణంగా వృద్ధి మాత్రం 2015లోనే సాధ్యమవుతుందని బుధవారమిక్కడ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటు 5.5%గా ఉండొచ్చని... వచ్చే ఏడాది ఇది 6 శాతం పైనే నమోదయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆర్థిక పరిశోధన, విశ్లేషణలను అందించే ఎనలిటిక్స్ విభాగం ఈ నివేదికను స్వతంత్రంగా ఇచ్చింది. క్రెడిట్ రేటింగ్ విభాగం(మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్) అభిప్రాయాలు ఇందులో లేవని కూడా తెలిపింది. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వ్యాపార విశ్వాసాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రూపాయి విలువ స్థిరీకరణ, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) దిగిరావడంతో ఆర్థిక వ్యవస్థ దిగజారే రిస్క్‌లు తగ్గాయి. ఇటీవలి త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడింది. అయితే, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి సామర్థ్యానికంటే దిగువనే కొనసాగుతోంది. 2013 మధ్య నుంచి ఎగుమతులు వృద్ధి బాటలోకి రావడం ఇతరత్రా సానుకూల అంశాలతో వృద్ధి నిలకడగా నమోదవుతోందని... పెట్టుబడులు కూడా మళ్లీ పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనుందని నివేదికలో మూడీస్ ఎనలిటిక్స్ విశ్లేషకుడు గ్లెన్ లెవిన్ అభిప్రాయపడ్డారు. {పపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రికవరీ మెరుగవుతోంది. ఈ ఏడాది ఎగుమతులు మరింత పెరిగేఅవకాశం ఉంది. దీంతో క్యాడ్ ఇంకా తగ్గొచ్చు. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి ఉండొచ్చు. క్యాడ్‌కు కళ్లెం పడటం(క్యూ2లో 1.2%)తో రూపాయికి సానుకూలం. {దవ్యోల్బ ణం దిగివస్తుండటం వ్యాపార విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ ఏడాదంతా టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖ ధోరణిలోనే ఉండొచ్చు.