‘బడ్జెట్’కు నోట్ల రద్దు చిల్లు!
• తగ్గిపోనున్న ప్రభుత్వ ఆదాయాలు
• వాటాల విక్రయ లక్ష్యమూ కష్టమే
• నోట్ల రద్దు ప్రభావం ఎక్కువ కాలమే ఉంటుందన్న అంచనాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు సెగ ప్రభుత్వానికీ తగిలింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌సన్నాహాలపై దీని ప్రభావం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించారుు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగం తగ్గడం, వృద్ధికి విఘాతం... ఫలితంగా ప్రభుత్వ ఆదాయలు, వాటాల విక్రయాలపైనా దీని ప్రభావం ఉండడం కారణాలని ఆ వర్గాలు పేర్కొన్నారుు. నల్లధనం కట్టడిలో భాగంగా గత నెల 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అరుుతే, నెల తర్వాత కూడా బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద నగదు కోసం భారీ క్యూలు దర్శనమిస్తుండడం, కంపెనీలు వేతన చెల్లింపుల సమస్యలను ఎదుర్కొండటంతో ముందుగా అంచనా వేసిన దాని కంటే ఎక్కువ కాలం పాటే ఆర్థిక రంగ కార్యకలాపాలు నెమ్మదిస్తాయని అధికారులు కలవరపడుతున్నారు. ఏటా ఫిబ్రవరి నెల చివర్లో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. అరుుతే, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అరుుతే, బడ్జెట్ సన్నాహాలను ఇంకా ప్రారంభించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.
రూ.35వేల కోట్లకు గండి
‘‘నిర్మాణం, వ్యవసాయం, ఆటోమొబైల్ రంగాలపై నగదు కొరత ప్రభావం పడుతుంది. దీంతో పన్ను వసూళ్లు తగ్గుతారుు. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ సైతం కష్టతరమవుతుంది’’ అని ఓ అధికారి వివరించారు. నవంబర్ నెలలో దేశీ ద్విచక్ర, వాణిజ్య వాహనాల విక్రయాలు 10 శాతం మేర తగ్గిపోవడం, రిటైల్, ఆభరణాల రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారుు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.56,500 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని అధికారుల అభిప్రాయంగా ఉంది. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు సగం మేరే ప్రభుత్వం నిధులు సేకరించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
కాగా, డీమోనిటైజేషన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు రూ.35,000 కోట్ల మేర పడిపోనున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్‌స అండ్ పాలసీ ఆర్థికవేత్త ఎన్‌ఆర్‌భానుమూర్తి పేర్కొన్నారు. ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి ఆర్‌బీఐ తాజా అంచనా 7.1 శాతానికంటే దిగువకు పడిపోతుందని తెలిపారు. కానీ జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్దేశించుకున్న 3.5 శాతానికి చేరుకుంటామని కేంద్రం ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నారుు.