government revenues
-
లక్ష్యంలో 63.6 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి ముగిసే నాటికి బడ్జెట్ లక్ష్యంలో 63.6 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.11 లక్షల కోట్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.35 లక్షల కోట్లు గా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. జీడీపీ అంచనాల్లో ఇది 5.8 శాతం. కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (కాగ్) విడుదల చేసిన గణాంకాలు చూస్తే.. ► ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.22.52 లక్షల కోట్లు (2023–24 బడ్జెట్ అంచనాల్లో ఇది 81.7 శాతం). ఇందులో రూ.18.8 లక్షల కోట్లు నికర పన్ను ఆదాయం. రూ.3.38 లక్షల కోట్లు పన్ను యేతర ఆదాయం. రూ.34,219 కోట్లు నాన్–డెట్ క్యాపిటల్ రిసిట్స్ (రుణాల రికవరీ, ఇతర క్యాపిటల్ రిసిట్స్). ► కేంద్ర వ్యయాలు రూ.33.54 లక్షల కోట్లు (బడ్జెట్లో 74.7 శాతం). వీటిలో రూ.26.33 లక్షల కోట్లు రెవెన్యూ అకౌంట్‌కు సంబంధించినది కాగా, రూ.7.2 లక్షల కోట్లు క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించినది. ► వెరసి ద్రవ్యలోటు రూ.11.02 లక్షల కోట్లు. -
ద్రవ్యలోటు కట్టడిలో తగ్గేదేలే..!
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు కట్టడిలో తన చిత్తశుద్దిని కేంద్రం తాజా బడ్జెట్ ద్వారా ఉద్ఘాటించింది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.1 శాతానికి తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ అంచనావేసింది. 2025–26 నాటికి ఈ లోటును 4.5 శాతానికి తగ్గాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్ అన్న సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరం (2022–23) ద్రవ్యలోటు 6.4 శాతం. మార్చితో ముగిసే ప్రస్తుత (2023–24) ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని 5.9 శాతంగా గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సమరి్పంచిన బడ్జెట్ నిర్దేశించుకుంది. అయితే ఇది 5.8 శాతానికే పరిమితమవుతుందని 2024–25 మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. భారీ పన్ను ఆదాయాలు ద్రవ్యలోటు అంచనా సానుకూలంగా 5.9 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గడానికి కారణంగా వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు విలువలో రూ.17,34,773 కోట్లు ఉంటే, 2024–25 రూ.16,85,494 కోట్లకు తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24తో పోల్చితే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటును తగ్గించడానికి భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలను మెరుగుపరిచిందనే సందేశాన్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతర సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ‘‘మేము ఇంతకుముందు ఇచి్చన ద్రవ్యలోటు రోడ్‌మ్యాప్‌ను అనుసరించడంలో, మెరుగుపరచడంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఇది ప్రతి రేటింగ్ సంస్థకు సూటిగా పంపుతున్న ఒక స్పష్టమైన సందేశం. ఏజెన్సీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని అన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి భారీ డివిడెండ్లు, పన్ను సమీకరణలో మెరుగుదల ద్రవ్యలోటు కట్టడిలో లక్ష్య సాధనకు దోహదపడుతున్న అంశాలు. గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థలు– ఫిచ్, ఎస్అండ్పీ, మూడీస్లు దేశానికి అతి దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. చెత్త స్థాయికి ఈ రేటింగ్ కేవలం ఒకమెట్టు ఎక్కువ. అధిక రేటింగ్ కోసం కేంద్రం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంతగా ఫలితం ఇవ్వడంలేదు. ఒకదేశంలో పెట్టుబడులను పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఆయా సంస్థలు ఈ రేటింగ్‌లనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. -
ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కట్టడిలోకి తీసుకోడానికి విశ్వసనీయ చర్యలు అవసరమని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి సవాళ్లు తొలగిన వెంటనే ఈ బాటలో చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ రుణ భారం ఇప్పటికి అటు ఆందోళనకరంగాకానీ లేదా ఇటు తగిన స్థాయిలో కానీ లేదని ఆయన విశ్లేíÙస్తూ, ఆర్థిక ఉద్దీపన చర్యలను కోరడానికి ముందు ఆయా వర్గాలన్నీ దేశ రుణ భారం అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెకించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ.30 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 15 శాతం. ద్రవ్యలోటు పెరుగుదలపై విభిన్న వాదనల నేపథ్యంలో ఎన్కే సింగ్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2019– 20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం (రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోలి్చతే ఇది 21.3 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సూచనలు.. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో సామాజిక ఆర్థిక పురోగతి వ్యవహారాల కేంద్రం (పీఎస్‌ఈపీ)– ప్రపంచబ్యాంక్ నిర్వహించిన సెమినార్లో 15 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన ప్రసంగంలో ద్రవ్యలోటుపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. -
‘బడ్జెట్’కు నోట్ల రద్దు చిల్లు!
• తగ్గిపోనున్న ప్రభుత్వ ఆదాయాలు • వాటాల విక్రయ లక్ష్యమూ కష్టమే • నోట్ల రద్దు ప్రభావం ఎక్కువ కాలమే ఉంటుందన్న అంచనాలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు సెగ ప్రభుత్వానికీ తగిలింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్సన్నాహాలపై దీని ప్రభావం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించారుు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగం తగ్గడం, వృద్ధికి విఘాతం... ఫలితంగా ప్రభుత్వ ఆదాయలు, వాటాల విక్రయాలపైనా దీని ప్రభావం ఉండడం కారణాలని ఆ వర్గాలు పేర్కొన్నారుు. నల్లధనం కట్టడిలో భాగంగా గత నెల 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అరుుతే, నెల తర్వాత కూడా బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద నగదు కోసం భారీ క్యూలు దర్శనమిస్తుండడం, కంపెనీలు వేతన చెల్లింపుల సమస్యలను ఎదుర్కొండటంతో ముందుగా అంచనా వేసిన దాని కంటే ఎక్కువ కాలం పాటే ఆర్థిక రంగ కార్యకలాపాలు నెమ్మదిస్తాయని అధికారులు కలవరపడుతున్నారు. ఏటా ఫిబ్రవరి నెల చివర్లో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. అరుుతే, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అరుుతే, బడ్జెట్ సన్నాహాలను ఇంకా ప్రారంభించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. రూ.35వేల కోట్లకు గండి ‘‘నిర్మాణం, వ్యవసాయం, ఆటోమొబైల్ రంగాలపై నగదు కొరత ప్రభావం పడుతుంది. దీంతో పన్ను వసూళ్లు తగ్గుతారుు. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ సైతం కష్టతరమవుతుంది’’ అని ఓ అధికారి వివరించారు. నవంబర్ నెలలో దేశీ ద్విచక్ర, వాణిజ్య వాహనాల విక్రయాలు 10 శాతం మేర తగ్గిపోవడం, రిటైల్, ఆభరణాల రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారుు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.56,500 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని అధికారుల అభిప్రాయంగా ఉంది. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు సగం మేరే ప్రభుత్వం నిధులు సేకరించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా, డీమోనిటైజేషన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు రూ.35,000 కోట్ల మేర పడిపోనున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స అండ్ పాలసీ ఆర్థికవేత్త ఎన్ఆర్భానుమూర్తి పేర్కొన్నారు. ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి ఆర్బీఐ తాజా అంచనా 7.1 శాతానికంటే దిగువకు పడిపోతుందని తెలిపారు. కానీ జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్దేశించుకున్న 3.5 శాతానికి చేరుకుంటామని కేంద్రం ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నారుు.