జనవరి నాటికి విలువ రూ.11 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి ముగిసే నాటికి బడ్జెట్ లక్ష్యంలో 63.6 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.11 లక్షల కోట్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.35 లక్షల కోట్లు గా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. జీడీపీ అంచనాల్లో ఇది 5.8 శాతం. కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (కాగ్) విడుదల చేసిన గణాంకాలు చూస్తే..
► ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.22.52 లక్షల కోట్లు (2023–24 బడ్జెట్ అంచనాల్లో ఇది 81.7 శాతం). ఇందులో రూ.18.8 లక్షల కోట్లు నికర పన్ను ఆదాయం. రూ.3.38 లక్షల కోట్లు పన్ను యేతర ఆదాయం. రూ.34,219 కోట్లు నాన్–డెట్ క్యాపిటల్ రిసిట్స్ (రుణాల రికవరీ, ఇతర క్యాపిటల్ రిసిట్స్).
► కేంద్ర వ్యయాలు రూ.33.54 లక్షల కోట్లు (బడ్జెట్‌లో 74.7 శాతం). వీటిలో రూ.26.33 లక్షల కోట్లు రెవెన్యూ అకౌంట్‌కు సంబంధించినది కాగా, రూ.7.2 లక్షల కోట్లు క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించినది.
► వెరసి ద్రవ్యలోటు రూ.11.02 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment