Fiscal deficit
-
టార్గెట్‌లో 57 శాతానికి ద్రవ్య లోటు
న్యూఢిల్లీ: ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 9,14,089 కోట్లకు చేరింది. ఇది పూర్తి సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యంలో 56.7 శాతమని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును రూ. 16,13,312 కోట్లకు పరిమితం చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. సీజీఏ డేటా ప్రకారం డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయం రూ. 18.43 లక్షల కోట్లు. ఇది 2024–25 బడ్జెట్ అంచనాల్లో (బీఈ) 71.3 శాతం. మరోవైపు బీఈలో మొత్తం వ్యయాలు 67 శాతానికి (రూ. 32.32 లక్షల కోట్లు) చేరుకున్నాయి. 2023–24లో స్థూల దేశీయోత్పత్తిలో 5.6 శాతంగా ఉన్న లోటును ఈసారి 4.9 శాతానికి కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఆదాయానికి మించి ఉన్న ఖర్చుల కోసం ప్రభుత్వం సమీకరించాల్సిన రుణమొత్తాన్ని ఇది సూచిస్తుంది. -
కొత్త బడ్జెట్‌కు ముందు కీలక డాక్యుమెంట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman ) ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ (Finance Ministry) కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు ( fiscal deficit) కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.వచ్చే రెండేళ్లు భారత్ వృద్ధి 6.5 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత (2024–25) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని సేవల దిగ్గజ సంస్థ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నివేదిక పేర్కొంది. ప్రైవేట్ వినియోగ వ్యయం, అలాగే మూలధన వ్యయాలు అంచనాలకన్నా తగ్గడం వృద్ధికి బ్రేకులు వేస్తున్న అంశంగా ఈవై వివరించింది. ఈ కారణంగానే సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయ్యిందని విశ్లేషించింది.ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుందని ఈవై పేర్కొంది. రోడ్లు, స్మార్ట్ సిటీలు, రైల్వేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనంసహా ప్రాధాన్యతా రంగాల పురోగతికి 2030 వరకు వర్తించే తాజా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆవిష్కరణ అవసరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతానికి మించకూడదని పేర్కొన్న ఈవై, ఈ 60 శాతం భారం కేంద్రం, రాష్ట్రాలపై సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
పదేళ్లూ పెరుగుదలే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రంలో కీలకాంశంగా పరిగణించే ద్రవ్యలోటు గత పదేళ్లలో భారీగా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వె ల్లడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో రూ.9,410 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.56,063 కోట్లకు చేరిందని పేర్కొంది. పలు సూచీల ఆధారంగా రాష్ట్రాల్లోని ఆర్థిక, విద్య, వైద్య, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశంలోని రాష్ట్రాల సంబంధిత గణాంకాలతో (హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024) ఆర్బీఐ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్టులో వెల్లడించిన ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవ్యలోటు భారీగా నమోదవుతోంది. బడ్జెట్ పరిమాణం, రాష్ట్రాల స్థూల ఉత్పత్తితో పాటు ద్రవ్యలోటు కూడా అదే స్థాయిలో పెరుగుతోందని తెలిపింది. గత పదేళ్ల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకాంశాలు ఇలా ఉన్నాయి. రూ.9,410 కోట్ల నుంచి రూ.56,063 కోట్లకు పెరిగిన ద్రవ్యలోటు» తెలంగాణ రాష్ట్ర నికర అప్పులు (గ్యారంటీలు కాకుండా) 2024 మార్చి నాటికి రూ.3,89,673 కోట్లుగా ఉన్నాయి. అదే 2015 మార్చి నాటికి ఇవి రూ.72,658 కోట్లు మాత్రమే. » గత పదేళ్లలో సామాజిక రంగాలపై ఖర్చు భారీగా పెరిగింది. సంక్షేమం, విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల కల్పన, పారిశుధ్యం తదితర అవసరాల కోసం చేసే ఖర్చు 2014–15లో రూ.24,434 కోట్లు ఉండగా, 2023–24లో రూ.1,27,123 కోట్లకు పెరిగింది. ఇక మూలధన వ్యయం 2014–15లో రూ.11,583 కోట్లుగా, 2023–24లో రూ.78,611 కోట్లుగా నమోదైంది. » అప్పులకు వడ్డీల కింద 2014–15లో రూ.5,227 కోట్లు మాత్రమే చెల్లించగా, 2023–24లో రూ.22,408 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దేశంలోని మరో 10 రాష్ట్రాలు కూడా అప్పులకు వడ్డీల కింద మనకంటే ఎక్కువే చెల్లిస్తుండడం గమనార్హం. » గత పదేళ్ల కాలంలో పన్నేతర ఆదాయంలో పెరుగుదల ఆశించినంతగా కనిపించలేదు. 2014–15లో రూ.6,447 కోట్లు ఉన్న పన్నేతర ఆదాయం స్వల్ప పెరుగుదలతో 2023–24లో రూ.22,808 కోట్లకు చేరింది. » రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పన్ను ఆదాయం (సొంత రాబడులు) పదేళ్ల కాలంలో బాగానే పెరిగింది. ఇది 2014–15లో రూ.29,288 కోట్లు మాత్రమే ఉండగా, 2023–24 నాటికి రూ.1,31,029 కోట్లకు పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో రూ.10 వేల కోట్లు పెరిగిన సొంత ఆదాయం, వరుసగా మరో రెండేళ్లు అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. కరోనా సమయంలో మాత్రం స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేసింది. 2018–19లో రూ.65,040 కోట్లు ఉన్న పన్ను ఆదాయం, 2019–20లో 67,597 కోట్లకు పెరగగా, 2020–21లో రూ.66,650 కోట్లకు తగ్గింది. మహమ్మారి నుంచి బయటపడిన తర్వాతి ఏడాది 2021–22లో ఏకంగా రూ.25 వేల కోట్లు పెరిగింది. ఆ తర్వాతి ఏడాది రూ.10 వేల కోట్లు, గత ఏడాదిలో రూ.21 వేల కోట్లు పెరిగి రూ.1.31 లక్షల కోట్లకు చేరింది.పరిమిత స్థాయిలో ఓకే.. కానీ..రెవెన్యూ వసూళ్లు, రుణ వసూళ్లతో పాటు రుణసమీకరణ ద్వారా వచ్చిన రాబడి కంటే ఆ ఏడాదిలో జరిగిన మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. వ్యక్తులైనా, వ్యవస్థలైనా, రాష్ట్రాలైనా, దేశాలైనా పొదుపు చేసి పెట్టుబడి పెట్ట డం సాధ్యం కాదు. ఆలస్యం కూడా అవు తుంది. ఈ నేపథ్యంలో పరిమిత స్థాయిలో ఉండే ద్రవ్య లోటును ప్రతికూల కోణంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్థాయికి మించి.. అంటే కొత్తగా తెచ్చే అప్పులు, చెల్లించాల్సిన అప్పులు, వడ్డీల కంటే మించితే అది భారంగా పరిణమిస్తుంది. ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం 2023–24లో ద్రవ్యలోటు రూ.56 వేల కోట్లకు పెరిగింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3 శాతానికి మించకూడదు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉంది. రాష్ట్ర జీఎస్డీపీ రూ.13.5 లక్షల కోట్లు ఉంటుందనే అంచనా మేరకు, రాష్ట్ర ద్రవ్యలోటు కూడా 4 శాతం మించుతోంది. – డాక్టర్ అందె సత్యం, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు -
ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐ
ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కట్టు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సంఘం సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. మితిమీరిన దూకుడు లక్ష్యాలు భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూలత చూపుతాయని హెచ్చరించింది.2024–25లో మొత్తం ద్రవ్యలోటును రూ.16,13,312 కోట్లకు కట్టడి చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 4.9 శాతం. 2023–24లో జీడీపీలో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యలోటు ప్రభుత్వానికి రుణ సమీకరణ అవసరాలను సూచిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థికమంత్రి ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం కొన్ని సూచనలు చేశారు.నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లోనూ దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ ఈ వృద్ధికి కీలకమైనది. రుణ–జీడీపీ నిష్పత్తులు తగిన స్థాయిల్లో కొనసాగించడానికి ద్రవ్యలోటు కట్టడి ముఖ్యమైనది.రాబోయే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ రుణాన్ని గణనీయంగా తగ్గించేలా ఉండాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రం ఆర్థిక స్థిరత్వ రిపోర్టింగ్‌ను వెలువరించాలి.తీవ్ర ఒత్తిడి పరిస్థితులలో ఆర్థిక స్థిరత్వం కోసం ఔట్‌లుక్‌ను అందించాలి.రిపోర్టింగ్‌లో దీర్ఘకాల (10–25 సంవత్సరాలు) ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం, ఆర్థిక వృద్ధి, సాంకేతిక మార్పు, వాతావరణ మార్పు మొదలైన అంశాల ప్రభావానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. పలు దేశాలు ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి. బ్రెజిల్ విషయంలో ఇవి 10 సంవత్సరాలు ఉంటే, బ్రిటన్ విషయంలో 50 ఏళ్లుగా ఉంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది సందర్శకులతో భారత్ బ్యాటరీ షో!రాష్ట్రాలకు సంబంధించి ద్రవ్య క్రమశిక్షణ చాలా అవసరం. రాష్ట్ర స్థాయి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం, 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి మార్కెట్ నుంచి నేరుగా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థల ద్వారా రుణాలు తీసుకునే విషయంలో హామీలను అందించడం ఇందులో ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణను కొనసాగించే విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర పారదర్శక క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను రూపొందించాలి. రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం వంటి అంశాలు నిర్ణయించడంలో రాష్ట్రాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి రాష్ట్రాల రేటింగ్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం వంటి పథకాలు రూపొందించవచ్చు. -
గరిష్టాలను చేరిన అమెరికా ఆర్థిక లోటు!
అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్ఠాలను చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇది రూ.1,538 లక్షల కోట్లను చేరింది. కొవిడ్ మహమ్మారి కాలంతో పోల్చినా ఈ లోటు అధికంగా నమోదవ్వడం ఆందోళనలు కలిగిస్తుంది. రుణ వడ్డీ, విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు..వంటివి ఇందుకు కారణమని యూఎస్ ట్రెజరీ విభాగం తెలిపింది. అయితే ఫెడ్ ఇటీవల వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంతో రానున్న రోజుల్లో ఈ లోటు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.యూఎస్ అధికారిక ట్రెజరీ డేటా ప్రకారం..సెప్టెంబరు 30 నాటికి యూఎస్ ఆర్థిక లోటు 1.83 ట్రిలియన్ డాలర్ల(రూ.1,538 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఇది అంతకుముందు 2020-21 కాలంలో గరిష్ఠంగా 1.7 ట్రిలియన్ డాలర్లు(రూ.14.2 లక్షల కోట్లు)గా ఉండేది. 2023 మధ్యలో బైడెన్ ప్రభుత్వ ప్రతిపాదనలతో యూఎస్ అత్యున్నత న్యాయస్థానం విద్యార్థుల రుణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఆర్థిక లోటు మరింత పెరిగినట్లయింది. యూఎస్ ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతానికి మించిపోయింది. ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ యుద్ధ భయాల కారణంగా 2023లో 6.2 శాతం, 2024 సెప్టెంబర్ 30 నాటికి 6.4 శాతానికి చేరింది. వడ్డీ చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వడ్డీ ఖర్చులు 254 బిలియన్ డాలర్లు(రూ.21 లక్షల కోట్లు) పెరిగి 1.1 ట్రిలియన్ డాలర్లకు(రూ.92 లక్షల కోట్లు) చేరాయి. ఇది గతంలో కంటే 29 శాతం అధికం. జీడీపీలో ఈ వడ్డీ చెల్లింపులు 3.93 శాతంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు 11 శాతం పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో రానున్న రోజుల్లో కొంత వడ్డీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!దేశీయంగా పెరుగుతున్న అప్పు ఆందోళనకరమే. అయితే ఆ అప్పు మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తే దాని ప్రతిఫలాలు సమీప భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి దాంతో కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి వడ్డీతో సహా భవిష్యత్తులో అప్పు తీర్చే ప్రణాళికలు ఉంటాయి. కానీ సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు ఒకవేళ అవినీతికి పాల్పడితే దానికోసం ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చిన అప్పు భారంగా మారుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి రాబడి సృష్టించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పలితంగా దేశం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
జూన్ నాటికి ద్రవ్యలోటు 8.1 శాతానికి అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ముగిసే నాటికి లక్ష్యంలో 8.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.1,35,712 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజా గణాంకాను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే... ఆర్థిక సంవత్సరం (2024–25) జీడీపీలో 4.9 శాతం వద్ద కట్టడి చేయాలన్నది నిర్మలా సీతారామన్ బడ్జెట్ లక్ష్యం. విలువలో ఇది 16.14 లక్షల కోట్లు. అయితే జూన్ ముగిసే నాటికి ఈ విలువ రూ.1,35,712 కోట్లకు చేరిందన్నమాట. అంటే ద్రవ్యలోటు ఇప్పటికి 8.1 శాతమని అర్థం. 2023–24లో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లుగా, వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనావేస్తోంది. వెరసి ద్రవ్యలోటు రూ.16.14 లక్షల కోట్లుగా నమోదుకానుంది. -
లక్ష్యంలో 63.6 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి ముగిసే నాటికి బడ్జెట్ లక్ష్యంలో 63.6 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.11 లక్షల కోట్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.35 లక్షల కోట్లు గా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. జీడీపీ అంచనాల్లో ఇది 5.8 శాతం. కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (కాగ్) విడుదల చేసిన గణాంకాలు చూస్తే.. ► ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.22.52 లక్షల కోట్లు (2023–24 బడ్జెట్ అంచనాల్లో ఇది 81.7 శాతం). ఇందులో రూ.18.8 లక్షల కోట్లు నికర పన్ను ఆదాయం. రూ.3.38 లక్షల కోట్లు పన్ను యేతర ఆదాయం. రూ.34,219 కోట్లు నాన్–డెట్ క్యాపిటల్ రిసిట్స్ (రుణాల రికవరీ, ఇతర క్యాపిటల్ రిసిట్స్). ► కేంద్ర వ్యయాలు రూ.33.54 లక్షల కోట్లు (బడ్జెట్లో 74.7 శాతం). వీటిలో రూ.26.33 లక్షల కోట్లు రెవెన్యూ అకౌంట్‌కు సంబంధించినది కాగా, రూ.7.2 లక్షల కోట్లు క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించినది. ► వెరసి ద్రవ్యలోటు రూ.11.02 లక్షల కోట్లు. -
మూలధన వ్యయం ‘తగ్గింది’
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మూలధన వ్యయానికి కేటాయింపులు బాగా తగ్గాయి. గత ఏడాది అంటే 2023–24 ఆర్థిక సంవత్సర ప్రతిపాదనల కంటే సుమారు సుమారు రూ.8వేల కోట్లను ఈసారి తక్కువగా చూపెట్టారు. 2023–24లో మూల ధన వ్యయం రూ.37,524 కోట్లు చూపెట్టగా, ఈసారి ప్రతిపాదించింది కేవలం రూ.29,669.14 కోట్లు మాత్రమే. 2023–24 సవరణ అంచనాలకు అనుగుణంగా ఈసారి మూలధన వ్యయ పద్దును ప్రతిపాదించినట్టు అర్థమవుతోంది. 2023–24 ప్రతిపాదనల్లో రూ.37వేల కోట్లకు పైగా చూపెట్టినా వాస్తవంగా ఖర్చు పెట్టింది రూ.24,178 కోట్లు మాత్రమే కావడంతో, ఆ మొత్తానికి రూ.5,500 కోట్లు పెంచి చూపెట్టడం గమనార్హం. అంటే 2023–24 కంటే 2024–25లో రూ.5,500 కోట్లు ఎక్కువగా ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మరి సవరణల బడ్జెట్‌కు వచ్చేసరికి 2024–25లో ఎంత ఖర్చవుతుందో వేచి చూడాల్సిందే. ద్రవ్యలోటు పెంపు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్లో ద్రవ్యలోటు పెంచి చూపెట్టారు. 2023–24లో ద్రవ్యలోటు ప్రతిపాదన రూ.38,234 కోట్లు కాగా, వాస్తవిక ద్రవ్యలోటు రూ.33,785 కోట్లుగా నమోదైంది. అయితే, 2024–25లో ద్రవ్యలోటు అంచనాను ఏకంగా రూ.53,227.82 కోట్లుగా ప్రతిపాదించడం గమనార్హం. ఈ పెంపు జీఎస్డీపీకి అనుగుణంగానే జరిగిందని, జీఎస్డీపీలో 3.5శాతాన్ని ద్రవ్యలోటుగా చూపెట్టడంతోనే ఆ మేరకు పెరుగుదల కనిపించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రెవెన్యూ మిగులు ప్రతిపాదనలోనూ ఈసారి తక్కువగా చూపెట్టారు. రూపాయి రాక, పోక అనంతరం రూ.4,881 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని 2023–24 బడ్జెట్లో చూపెట్టినప్పటికీ సవరించిన అంచనాల్లో అది రూ.9,031 కోట్లకు పెరిగింది.అంటే అప్పటి ప్రభుత్వం అంచనాలో రూ.4,200 కోట్లకు పైగా ఖర్చు కాలేదని అర్థమవుతోంది. ఈసారి మాత్రం 2023–24 ప్రతిపాదిత అంచనాల కంటే తక్కువగా రూ.4,424 కోట్ల రెవెన్యూ మిగులును ప్రతిపాదించారు. దీన్నిబట్టి బడ్జెట్ అంచనాల మేరకు వ్యయం ఉంటుందనే ధీమాను ప్రభుత్వం బడ్జెట్లోవ్యక్తపరిచిందని అర్థమవుతోంది. క్షీణించిన రాష్ట్ర వృద్ధిరేటు! ♦ 14.7 శాతం నుంచి 11.3 శాతానికి తగ్గుదల ♦ మైనస్‌లోకి పడిపోయిన వ్యవసాయరంగ వృద్ధిరేటు ♦ రూ. 49,059 కోట్ల నుంచి రూ. 45,723 కోట్లకు తగ్గిన వ్యవసాయ విలువ ♦ తలసరి ఆదాయ వృద్ధిరేటులో సైతం క్షీణత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధిరేటు క్షీణించింది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ 2022–23తో పోలిస్తే 2023–24లో ప్రస్తుత ధరల వద్ద రూ. 13,02,371 కోట్ల నుంచి రూ. 14,49,708 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వృద్ధి రేటు మాత్రం 14.7 శాతం నుంచి 11.3 శాతానికి క్షీణించింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు సైతం 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పతనమైంది. అయితే దేశ వృద్ధిరేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధిరేటు 2.4 శాతం అధికం కావడం గమనార్హం. అయితే స్థిర ధరల వద్ద తెలంగాణ వృద్ధిరేటు గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఏడాది 7.5 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024–25 ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెల్లడించారు. ద్రవ్యోల్బణంలో 5వ స్థానంలో రాష్ట్రం.. వినియోగదారుల ధరల సూచీ డిసెంబర్ 2023లో జాతీయ స్థాయిలో 5.69% ఉండగా తెలంగాణలో 6.65 శాతంగా నమోదైంది. ఈ లెక్కన దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన ఐదో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. క్షీణించిన తలసరి ఆదాయం... తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2023–24లో రూ. 3,43,297 ఉంటుందని అంచనా. గతేడాది తలసరి ఆదాయం రూ. 3,09,912గా నమోదైంది. తలసరి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ వృద్ధిరేటు మాత్రం క్షీణించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడి పడిపోయిన వ్యవసాయరంగ వృద్ధిరేటు.. వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ (జీవీఏ) రూ. 49,059 కోట్లతో పోలిస్తే రూ. 45,723 కోట్లకు తగ్గిపోయింది. దీంతో వ్యవసాయరంగ వృద్ధిరేటు మైనస్ 6.8 శాతానికి పతనమైంది. నైరుతి రుతుపవనాల ఆలస్యం, వర్షాభావం, కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేకపోవడం, భూగర్భ జలాల్లో క్షీణతతో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, శనగ పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలైన విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వాణిజ్యం, మరమ్మతు సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వేలు, వాయు రవాణా వంటి రంగాల్లో సైతం క్షీణత కినిపించింది. తయారీ రంగంలో మాత్రం వృద్ధిరేటు 1.3 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, మైనింగ్, క్వారీయింగ్ వంటి రంగాలు గతంతో పోలిస్తే 2023–24లో అధిక వృద్ధిరేటును నమోదు చేశాయి. -
ద్రవ్యలోటు కట్టడిలో తగ్గేదేలే..!
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు కట్టడిలో తన చిత్తశుద్దిని కేంద్రం తాజా బడ్జెట్ ద్వారా ఉద్ఘాటించింది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.1 శాతానికి తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ అంచనావేసింది. 2025–26 నాటికి ఈ లోటును 4.5 శాతానికి తగ్గాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్ అన్న సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరం (2022–23) ద్రవ్యలోటు 6.4 శాతం. మార్చితో ముగిసే ప్రస్తుత (2023–24) ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని 5.9 శాతంగా గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సమరి్పంచిన బడ్జెట్ నిర్దేశించుకుంది. అయితే ఇది 5.8 శాతానికే పరిమితమవుతుందని 2024–25 మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. భారీ పన్ను ఆదాయాలు ద్రవ్యలోటు అంచనా సానుకూలంగా 5.9 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గడానికి కారణంగా వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు విలువలో రూ.17,34,773 కోట్లు ఉంటే, 2024–25 రూ.16,85,494 కోట్లకు తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. ఇక స్థూల, నికర మార్కెట్ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24తో పోల్చితే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటును తగ్గించడానికి భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలను మెరుగుపరిచిందనే సందేశాన్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతర సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ‘‘మేము ఇంతకుముందు ఇచి్చన ద్రవ్యలోటు రోడ్‌మ్యాప్‌ను అనుసరించడంలో, మెరుగుపరచడంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఇది ప్రతి రేటింగ్ సంస్థకు సూటిగా పంపుతున్న ఒక స్పష్టమైన సందేశం. ఏజెన్సీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని అన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి భారీ డివిడెండ్లు, పన్ను సమీకరణలో మెరుగుదల ద్రవ్యలోటు కట్టడిలో లక్ష్య సాధనకు దోహదపడుతున్న అంశాలు. గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థలు– ఫిచ్, ఎస్అండ్పీ, మూడీస్లు దేశానికి అతి దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. చెత్త స్థాయికి ఈ రేటింగ్ కేవలం ఒకమెట్టు ఎక్కువ. అధిక రేటింగ్ కోసం కేంద్రం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంతగా ఫలితం ఇవ్వడంలేదు. ఒకదేశంలో పెట్టుబడులను పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఆయా సంస్థలు ఈ రేటింగ్‌లనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. -
నవంబరు చివరకు ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు నవంబర్ ముగిసే నాటికి 2023–24 వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 50.7 శాతానికి చేరింది. విలువలో రూ.9,06,584 కోట్లకు చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. నవంబర్ ముగిసే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.17.40 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 64.3 శాతం). వ్యయాలు రూ.26.46 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 58.9 శాతం). వెరసి ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లకు చేరింది. కాగా, మొత్తం వ్యయాల్లో రూ.20.66 లక్షల కోట్లు రెవెన్యూ అకౌంట్‌కు సంబంధించినదికాగా, మిగిలినది మూలధన వ్యయాలపై జరిగింది. -
లక్ష్యంలో 45 శాతానికి చేరిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం.. ద్రవ్యలోటు అక్టోబర్‌తో ముగిసిన నెలకు ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 45 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ విలువ ర.8.03 లక్షల కోట్లని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు ర.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. రూ.8.03 లక్షల కోట్లు లోటు ఎలా? అక్టోబర్ 2023 వరకు ప్రభుత్వానికి ర. 15.90 లక్షల కోట్ల పన్ను నికర రాబడి (బడ్జెట్ అంచనాల్లో 58.6 శాతం) లభించింది. ఇందులో 13.01 లక్షల కోట్లు పన్ను ఆదాయాలు. ర. 2.65 లక్షల కోట్ల పన్నుయేతర ఆదాయం. ర. 22,990 కోట్లు నాన్–డెట్ క్యాపిటల్ ఆదాయం. రుణాల రికవరీ (ర.14,990 కోట్లు, మూలధన ఆదాయాలు (రూ.8,000 కోట్లు) నాన్–డెట్ క్యాపిటల్ పద్దులో ఉంటాయి. ఇక ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో ప్రభుత్వ వ్యయాలు ర.23.94 లక్షల కోట్లు (బడ్జెట్లో నిర్దేశించుకున్న మొత్తంలో 53 శాతం). వ్యయాల్లో ర.18,47,488 కోట్లు రెవెన్యూ అకౌంట్కాగా, ర. 5,46,924 కోట్లు క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ వ్యయాలు ర.18,47,488 కోట్లలో ర.5,45,086 కోట్లు వడ్డీ చెల్లింపులు. ర.2,31,694 కోట్లు సబ్సిడీ అకౌంట్ వ్యయాలు. వెరసి ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ర.8.03 లక్షల కోట్లుగా నవెదయ్యింది. -
మిగులు నుంచి లోటుకు.. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం 2018–19 వరకు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. కానీ ఆ తర్వాత క్రమంగా రెవెన్యూ లోటు నమోదయింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.9,335 కోట్ల రెవెన్యూ లోటు, రూ.46,639 కోట్ల ద్రవ్యలోటు ఏర్పడింది. మిగులు నుంచి లోటుకు వెళ్లినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెవెన్యూ, ద్రవ్యలోటు పరిమాణం కాస్త తగ్గింది. 2020–21లో రెవెన్యూ లోటు రూ.22,298 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.49,038 కోట్లుగా ఉంది. 2021–22లో నమోదైన రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 0.81 శాతం కాగా, ద్రవ్యలోటు 4.06 శాతంగా నమోదయింది. అదే రెవెన్యూ రాబడులతో పోలిస్తే 27 శాతం ద్రవ్యలోటు ఏర్పడింది..’అని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను అకౌంట్ల నిర్వహణకు సంబంధించిన పరిశీలన అనంతరం కాగ్ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం.. వర్షాకాల సమావేశాల చివరిరోజు ఆదివారం శాసనసభ, మండలి ముందు ఉంచింది. ఈ నివేదికలో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌లకు వెళ్లి ప్రభుత్వం తెచ్చుకున్న అడ్వాన్సులు, పద్దుల వారీగా చూపెట్టాల్సిన ఖర్చుల్లో తేడాలు, చూపెట్టిన నగదు నిల్వ, ఖర్చుల్లో తేడాలు, రెవెన్యూ రాబడులు, ప్రభుత్వ అప్పుల గణాంకాలను వెల్లడించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ప్రభుత్వ శాఖల ఆర్థిక పారదర్శకతపై ఆడిట్ నిర్వహించి కాగ్ రూపొందించిన నివేదిక అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సభ ముందుంచకపోవడం గమనార్హం. 2021–22 అకౌంట్ల నిర్వహణలో కాగ్ గుర్తించిన ముఖ్యాంశాలు ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి అడ్వాన్సులు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో కనీస నగదు నిల్వ ఉంచింది 76 రోజులు. స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం (ఎస్డీఎఫ్) వినియోగించుకుంది 30 రోజులు. వేజ్ అండ్ మీన్స్కు వెళ్లింది 159 రోజులు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది 100 రోజులు. ► అడ్వాన్సులు తీసుకున్న 289 రోజుల్లో (ఎస్డీఎఫ్ 30, వేజ్ అండ్ మీన్స్ 159, ఓడీ 100 రోజులు కలిపి) ఎస్డీఎఫ్ కింద రూ.9,636 కోట్లు, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సుల రూపంలో రూ.34,969 కోట్లు వినియోగించుకుంది. ఓడీ కింద రూ.22,669 కోట్లు తెచ్చుకుంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పుల రూపంలో తెచ్చిన రూ.42,936 కోట్లు, ప్రజాపద్దు కింద వినియోగించాల్సిన రూ.3,773 కోట్లను ద్రవ్యలోటు కింద చూపెట్టారు. ► ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) కింద 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇందులో రెవెన్యూ మిగులుతో ఖజానా నిర్వహించాలనేది మొదటి లక్ష్యం కాగా, రూ.9,335 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడింది. జీఎస్డీపీలో 3 శాతానికి మించకుండా ద్రవ్యలోటు ఉండాలనేది రెండోలక్ష్యం కాగా, అది 4.06 శాతంగా నమోదైంది. నికర అప్పులు జీఎస్డీపీలో 25 శాతం మించవద్దనే మూడో లక్ష్యం కూడా నెరవేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి జీఎస్డీపీలో 27.40 శాతం అప్పులు మిగిలాయి. ► రెవెన్యూ రాబడుల కింద వచ్చిన రూ.1,27,468 కోట్లలో దాదాపు 50 శాతం అనివార్య వ్యయం కిందనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇందులో రూ.30,375 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు, రూ.19,161 కోట్లు వడ్డీ చెల్లింపులు, రూ.14,025 కోట్లు పింఛన్ల కింద ఖర్చు పెట్టారు. ► ఏప్రిల్ 1, 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పులు రూ.2,78,017.64 కోట్లు. ఆ ఏడాదిలో తీసుకున్న అప్పులు రూ.43,593.94 కోట్లు. 2022 మార్చి 31 నాటికి నికర అప్పులు రూ.3,21,611.58 కోట్లు. ► పలు కార్పొరేషన్లు, సంస్థలకు రుణాలు తీసుకునేందుకు గాను రూ.40,449 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గార్యంటీ ఇచ్చింది. దీంతో 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వ నికర గ్యారంటీల మొత్తం రూ.1,35,283 కోట్లకు చేరింది. ► మొత్తం అప్పుల్లో రూ.28,883 కోట్లు మూలధన వ్యయం కింద, రూ.8,469 కోట్లు రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు వెచ్చించారు. జీఎస్డీపీకి సమాంతరంగా మూలధన వ్యయం లేదు. జీఎస్డీపీలో 2.51 శాతం మాత్రమే మూలధన పద్దు కింద వెచ్చించారు. ► వివిధ మేజర్ పద్దులను ఆడిట్ చేయగా, ఉండాల్సిన నగదు నిల్వ కంటే తక్కువ ఉంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలుకు గాను కేంద్రం నేరుగా ఇచ్చిన రూ.18,392 కోట్లు ప్రభుత్వ అకౌంట్లలో కనిపించలేదు. తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లకు పలు పథకాల అమలు కోసం ఈ నిధులను కేంద్రం ఇచ్చింది. ► హౌసింగ్, పరిశ్రమల శాఖలకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం కంటే చాలా తక్కువ ఖర్చు పెట్టారు. బడ్జెట్ అంచనాల రూపకల్పనలో ఆయా శాఖలకు స్పష్టత లేని కారణంగానే ఇది జరిగింది. ► ఇక ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం కోసం ప్రతి నెలా వసూలు చేసే మొత్తంలో రూ.2,074.22 కోట్లు మాత్రమే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)కు జమ చేసింది. మరో రూ.313.72 కోట్లు జమ చేయాల్సి ఉంది. -
ద్రవ్యలోటు మేనాటికి లక్ష్యంలో 11.8 శాతం,ఎన్ని లక్షల కోట్లంటే!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు-మే ముగిసే నాటికి లక్ష్యంలో 11.8 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.2,10,287 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజా గణాంకాలను విడుదల చేసింది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లకు కట్టడి చేయాలని బడ్జెట్ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి విలువ అంచనాలో ఇది 5.9 శాతం. అయితే 2023 మే నాటికి లక్ష్యంలో (రూ.17.86 లక్షల కోట్లు) రూ.2.10 లక్షల కోట్లకు చేరిందన్నమాట. 2022-23లో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతం. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) -
రాష్ట్ర డిస్కంలకు అప్పుల షాక్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అప్పులు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఆర్థిక లోటు, నిర్వహణ మూలధన వ్యయం కొరత కారణంగా ఏటా మరింతగా అప్పులు చేస్తున్నాయి. దీంతో 2019–20లో రూ.5.01 లక్షల కోట్లుగా డిస్కంల అప్పులు.. 2021–22 నాటికి రూ.6.2లక్షల కోట్లకు (24%వృద్ధి) ఎగబాకాయి. చాలా రాష్ట్రాల్లో డిస్కంల ఆస్తులతో పోల్చితే వాటి అప్పులు 100 శాతానికి మించిపోయి దివాలా బాటపట్టాయి. అందులో తెలంగాణ సహా మరో మూడు రాష్ట్రాల్లోని డిస్కంల అప్పులు ఆస్తుల కంటే 150శాతానికి మించిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ప్రకటించిన డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదిక ఈ అంశాలను బహిర్గతం చేసింది. విద్యుత్ సబ్సిడీల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం, బిల్లుల వసూళ్లలో ఆలస్యంతో డిస్కంలు అప్పులు చేయకతప్పడం లేదని ఈ నివేదిక పేర్కొంది. డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) పథకం కింద డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు టేకోవర్ చేసుకోవడంతో కొంత భారం తగ్గిందని తెలిపింది. రెండింటి పనితీరు మెరుగుపడాలి రాష్ట్రంలోని ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్ఎన్పీడీసీఎల్/ టీఎస్ఎస్పీడీ సీఎల్)ల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై ఈ నివేదికలో కేంద్ర విద్యుత్ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు డిస్కంలు కూడా ఇంధన వ్యయం పెరుగుదల భారాన్ని వినియోగదారులపై ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా బదిలీ చేయాలని.. డిస్కంల నష్టాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ఈఆర్సీ ట్రూఅప్ ఆర్డర్ 2020–21ను జారీ చేయాలని, ఉద్యోగుల వ్యయ భారాన్ని సంస్థ తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. నష్టాల్లో కూరుకుపోయిన ఉత్తర డిస్కం ♦ ఉత్తర తెలంగాణలోని 17 జిల్లాల పరిధిలో 63,48,874 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఎన్పీడీసీఎల్.. దేశంలోని 51 డిస్కంలలో 47వ స్థానంలో నిలిచింది. దీనికి 2020–21లో రూ.204 కోట్ల నష్టాలు వచ్చాయి. ♦ఒక్కో యూనిట్ విద్యుత్ సరఫరా అంచనా వ్యయం, వాస్తవ వ్యయం మధ్య తేడా 2020–21లో 0.68 పైసలుకాగా.. 2021–22లో రూ.1.52కి పెరిగింది. అంటే సరఫరా చేసిన ప్రతి యూనిట్ విద్యుత్‌పై నష్టాలు గణనీయంగా పెరిగాయి. ♦సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 2020–21లో 9శాతం ఉండగా.. 2021–22లో ఏకంగా 14.1 శాతానికి ఎగబాకాయి. ♦ వినియోగదారుల నుంచి కరెంట్ బిల్లులను 60 రోజుల్లోగా వసూలు చేసుకోవాల్సి ఉండగా.. ఈ డిస్కం పరిధిలో సగటున 267 రోజులు పడుతోంది. ♦ గత మూడేళ్లలో ప్రభుత్వానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి ఏకంగా 40శాతం బిల్లులు వసూలు కాలేదు. దక్షిణ డిస్కంపై బకాయిల బండ ♦ దక్షిణ తెలంగాణలోని 1,04,36,589 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఎస్పీడీసీఎల్.. దేశంలోని 51 డిస్కంలలో 43వ ర్యాంకు సాధించింది. 2020–21లో రూ.627 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ♦ సరఫరా చేసిన ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ.1.40 నష్టం వస్తోంది. ♦ జెన్కోలకు సంస్థ బిల్లుల చెల్లింపులకు 375 రోజులను తీసుకుంటోందని.. దీనిని 45 రోజులకు తగ్గించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ♦ వినియోగదారుల నుంచి కరెంట్ బిల్లుల వసూళ్లకు 130 రోజులు తీసుకుంటోంది. ♦ గత మూడేళ్లలో ప్రభుత్వానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి 25శాతం బిల్లులు వసూలు కాలేదు. -
లక్ష్యంలో 82.8 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.14.53 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 82.8 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)ఈ గణాంకాలను విడుదల చేసింది. 2022–23లో మొత్తం ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లుగా అంచనావేయడం జరిగింది. స్థూల దేశీయోత్పత్తి ఇది 6.4 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. -
ద్రవ్యలోటు తగ్గింది
సాక్షి, అమరావతి: గత ఆర్థికసంవత్సరం (2021–22)లో.. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం 1.46 శాతం తగ్గిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31తో ముగిసిస సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. రాష్ట్ర బడ్జెట్ లోపల అప్పులు, బడ్జెట్ బయట అప్పుల వివరాలను కాగ్ నివేదికలో విశ్లేషించింది. 2021–22 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికన్నా ద్రవ్యలోటు గణనీయంగా తగ్గిందని, దీంతో తీసుకున్న రుణాలు కూడా తగ్గినట్లు పేర్కొంది. 2021–22 నాటికి రాష్ట్ర మొత్తం రుణబకాయిలు జీఎస్డీపీ లక్ష్యంలోపలే ఉన్నాయని తెలిపింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు 2021–22 నాటికి రాష్ట్ర రుణబకాయిలు జీఎస్డీపీలో 35.60 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువగా 31 శాతమే ఉన్నాయని పేర్కొంది. అప్పటికి రాష్ట్ర రుణాలు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయి. ఇక 2020–21లో జీఎస్డీపీలో రుణాలు 34.35 శాతం ఉండగా 2021–22లో రుణాలు జీఎస్డీపీలో 31 శాతానికి తగ్గినట్లు కాగ్ తెలిపింది. 2021–22లో బడ్టెట్ ప్రతిపాదించిన అంచనాలకన్నా వాస్తవ పరిస్థితులు వచ్చేనాటికి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గినట్లు కాగ్ పేర్కొంది. ద్రవ్యలోటు రూ.38,224 కోట్లు ఉంటుందని అంచనా వేయగా దానిని రూ.25,013 కోట్ల్లకే పరిమితం చేసినట్లు కాగ్ పేర్కొంది. ఇలా ద్రవ్యలోటు 2.08 శాతానికే పరిమితమైంది. బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ.19,546 కోట్లు ఉంటుందని ప్రతిపాదించగా వాస్తవంగా రెవెన్యూ లోటు రూ 8,611 కోట్లకు పరిమితం చేశారు. ఇక 2021–22లో రెవెన్యూ రాబడులు 28.53 శాతం పెరిగాయని, దీని ఫలితంగా 2021–22లో రెవెన్యూ, ద్రవ్యలోటు గణనీయంగా మెరుగుపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని కాగ్ వివరించింది. మరోవైపు.. 2021–22 నాటికి బడ్జె్జటేతర రుణాలు రూ.1,18,393.81 కోట్లు ఉన్నాయి. ఈ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర మొత్తం రుణాలు జీఎస్డీపీలో 40.85 శాతంగా ఉంటుందని పేర్కొంది. అశాస్త్రీయ రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక లోటును ఎదుర్కొంటోందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చినట్లు కాగ్ తెలిపింది. భౌగోళిక ప్రాతిపదికన ఏపీ తెలంగాణకు ఆస్తులను కోల్పోయిందని, కానీ.. జనాభా ప్రాతిపదికన చెల్లింపుల బాధ్యతను పొందిందని, బకాయిలు తీర్చడానికి ఏపీకి వనరులు కూడా లేవని ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేటగిరి హోదా, 2014–15 రెవెన్యూ లోటుగ్రాంట్ వంటి విభజన హామీల అమలుకు కేంద్రంతో నిరంతరాయంగా ప్రయత్నిస్తోందని.. కోవిడ్ మహమ్మారి ఆర్థికపరమైన ఒత్తిడిని మరింత పెంచిందని తెలిపింది. ఈ కారణంగా రుణంగా తీసుకున్న నిధులలో కొంతభాగాన్ని లోటు ఫైనాన్సింగ్ కోసం, బాకీలను తీర్చేందుకు ఉపయోగించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కాగ్ వెల్లడించింది. -
రానున్న బడ్జెట్లో ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్ సేవింగ్, ఇతర స్మాల్ సేవింగ్ పథకాలకు ఊరట లభించనుందా అంటే అవుననే సంకతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికలు, బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్‌కు ఈ దఫా చివరి బడ్జెట్ నేపథ్యంలో చిన్న పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం లభించనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న పొదుపు పథకాలు పెద్ద ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ బడ్జెట్ 2023లో ఆర్థిక లోటును పూరించుకునేందుకు ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై ఆధారపడే అవకాశం ఉందని, వాటి నుండి దాదాపు రూ. 5 లక్షల కోట్లు సేకరించవచ్చని అంచనా. సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకం 2023-24 కోసం రాబోయే కేంద్ర బడ్జెట్లో ఊపందుకోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి చిన్న పొదుపు పథకాలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ పథకం 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచినా ఇందులో ఎస్‌ఎస్‌వైని చేర్చకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. 10 సంవత్సరాల లోపు ఆడబిడ్డ ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో కేవలం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం మొత్తం రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా అధీకృత బ్యాంకు లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. 60 యేళ్లకు మించిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ముందస్తు పదవీ విరమణ చేసిన 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం దీనిపై 8 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ఈ స్కీంలో ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పెట్టుబడిపై రూ .1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Union Budget 2022: ద్రవ్య స్థిరత్వానికి బడ్జెట్లో ప్రాధాన్యత!
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న 2023–24 వార్షిక బడ్జెట్ ద్రవ్య స్థిరత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 2022–23లో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) రూ.16.61 లక్షల కోట్లు ఉండాలని 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలకు అనుగుణంగా 6.4 శాతంలోపునకే (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక రానున్న (2023–24) ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా వంటి సంస్థలు అంచనావేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దన్నుతో భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకన్నా రూ.4 లక్షల కోట్ల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని స్వయంగా ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది. వ్యయ ప్రతిపాదనలకు సూచన పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి ఆర్థికశాఖ 2022–23కు సంబంధించి తుది వ్యయ ప్రతిపాదనలను కోరింది. గ్రాంట్లకుగాను రెండవ, తుది సప్లిమెంటరీ డిమాండ్ల ప్రతిపాదనలను ఆర్థికశాఖ కోరినట్లు ఒక అధికారిక మెమోరాండం పేర్కొంది. గ్రాంట్ల కోసం తుది సప్లిమెంటరీ డిమాండ్లను సమావేశాల్లోని రెండవ విడతలో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. గత నెలలో, ప్రభుత్వం రూ. 3.25 లక్షల కోట్లకు పైగా నికర అదనపు వ్యయాన్ని అనుమతించే గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్ల మొదటి బ్యాచ్‌ను ఆమోదించింది. ఇందులో ఎరువుల సబ్సిడీ చెల్లింపునకు ఉద్దేశించిన రూ. 1.09 లక్షల కోట్లు కూడా ఉన్నాయి. ఈ అదనపు వ్యయం 2022–23 బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం కంటే అధికం. 2021–22లో బడ్జెట్ వ్యయం రూ.37.70 లక్షల కోట్లు. 2022–23లో బడ్జెట్ ప్రతిపానల్లో దీనిని రూ.37.70 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. నియంత్రణలు సడలించాలి... ఫార్మా, హెల్త్‌కేర్ పరిశ్రమ విజ్ఞప్తి ∙ ప్రోత్సాహకాల కోసం వినతి రాబోయే కేంద్ర బడ్జెట్లో ఫార్మా, హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేయాలని సంబంధిత వర్గాలు విజ్ఞప్తి చేశాయి. పలు ప్రోత్సాహకాలతో పాటు, ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు, పరిశోధనా అభివృద్దిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దేశీయ ఫార్మా పరిశ్రమ ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, 2030 నాటికి 130 బిలియన్ డాలర్లు, 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు ఎదగాలన్నది పరిశ్రమ ఆంకాంక్షని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. ఈ దిశలో బడ్జెట్లో చర్యలు ఉంటాయని భావిస్తున్నామని అన్నారు. ఔషధ పరిశ్రమ అభివృద్ధికి సహాయపడే సహాయక విధానాలు, సరళీకృత నిబంధనలు, జీఎస్టీ నిబంధనల సరళీకరణ ప్రతిపాదనలు బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా, సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్‌లతో సహా 24 ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీల కూటమే ఐపీఏ. ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) డైరెక్టర్ జనరల్ వివేక్ సెహగల్ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి బాటలో ’ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌కు లైఫ్ సైన్సెస్ రంగం వాస్తవికంగా దోహదపడేలా ప్రభుత్వం విధానాలు అవసరమని అన్నారు. ప్రొడక్షన్ ఆధారిత ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం మాదిరిగానే, పరిశోధన ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. హెల్త్‌కేర్ రంగం విషయానికొస్తే, ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని పరిశ్రమల సంఘం నాథేల్త్ ప్రెసిడెంట్ శ్రవణ్ సుబ్రమణ్యం అన్నారు. ఈ దిశలో మౌలిక సదుపాయాల సామర్థ్యాలను పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. అల్యూమినియంపై దిగుమతి సుంకాలు పెంచాలి అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై రాబోయే బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని కనీసం 12.5 శాతానికి పెంచాలని ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ కోరింది. ఈ చర్య అల్యూమినియం ఉత్పత్తుల డంపింగ్‌ను అరికట్టడానికి అలాగే దేశీయ తయారీ– రీసైక్లింగ్ వృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో అల్యూమినియం దిగుమతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దిగువ స్థాయి అల్యూమినియం దిగుమతుల్లో 85 శాతానికి పైగా చైనా వాటా ఉంటోందని ఒక ప్రకటనలో తెలిపింది. -
లక్ష్యంలో 59 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ ముగిసే నాటికి లక్ష్యంలో 59 శాతానికి చేరుకుంది. ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్–2023 మార్చి) ముగిసే నాటికి రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. స్థూల దేశీయోత్పత్తి అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే నవంబర్ ముగిసే నాటికి ఇది 9.78 లక్షల కోట్లకు చేరింది. అంటే వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 59 శాతానికి చేరిందన్నమాట. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
Budget 2023: క్లిష్ట పరిస్థితుల్లో కఠిన ద్రవ్య విధానం తగదు
న్యూఢిల్లీ: ప్రపంచం తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లోనే కొనసాగుతున్నందున ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం), రుణ సమీకరణల కట్టడి వంటి అంశాల్లో దూకుడు ప్రదర్శించరాదని కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ సూచించారు. రానున్న 2023–24 వార్షిక బడ్జెట్లో ఈ మేరకు కఠిన ద్రవ్య విధానాలను అనుసరించవద్దని ఆమె సలహాఇచ్చారు. 2021–22లో 6.71 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2022–23లో 6.4 శాతానికి తగ్గాలని, 2025–26 నాటికి 4.5 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. వ్యయాలు ఆర్థిక పురోగమనానికి బాట వేయాలి.. ప్రభుత్వం చేసే వ్యయాలు పన్ను రాబడులు పెంచే విధంగా కాకుండా, ఆర్థిక వ్యవస్థ పురోగమనమే ప్రధాన ధ్యేయంగా జరగాలని అన్నారు. ప్రభుత్వ రుణాలు కూడా అభివృద్ధికి బాటలు వేయడం లక్ష్యంగా ఉండాలన్నారు. భారం మోపని పన్ను విధానాలను అనుసరించాలని, తద్వారా పన్ను బేస్ విస్తరణకు కృషి జరగాలని ఆమె సూచించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమంటే, భవిష్యత్ తరాలపై భారం మోపడమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వస్తున్న ‘పాత పెన్షన్ పథకాలను పునరుద్ధరణ డిమాండ్’ నేపథ్యంలో అషిమా ఈ వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్ పథకాలను 2003లో ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు ఇప్పటికే ఓపీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. జార్ఖండ్ కూడా ఓపీఎస్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ ఇటీవలే పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయడానికి ఆమోదముద్ర వేసింది. ద్రవ్యోల్బణం కట్టడికి మనమే బెటర్... నవంబర్‌ను మినహాయిస్తే అంతకుముందు గడచిన 10 వరుస నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు రాకపోవడానికి కారణం... ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల, సరఫరాల సమస్య, ఆహార ధరలు పెరగడం వంటి అంశాలు కారణమని అన్నారు. సరఫరాలవైపు తొలగుతున్న సమస్యలు నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు రావడానికి కారణమని అన్నారు. వృద్ధికి విఘాతం కలుగకుండా ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దిగురావడం హర్షణీయ పరిణామని పేర్కొన్న ఆమె, ‘‘పలు ఇతర దిగ్గజ ఎకానమీలతో పోల్చితే సవాళ్లను భారత్ సమర్థవంతంగా అధిగమించగలిగింది’’ అని అన్నారు. -
లక్ష్యంలో 37.3 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలలూ ముగిసే నాటికి (సెప్టెంబర్) లక్ష్యంలో 37.3 శాతానికి చేరింది. మరిన్ని వివరాల్లో వెళితే, 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే సెప్టెంబర్ ముగిసే నాటికి ద్రవ్యలోటు రూ.6,19,849 కోట్లకు చేరినట్లు సోమవారం వెలువడిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు ప్రకారం.. ► సెప్టెంబర్ నాటికి పన్నులుసహా ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.12.03 లక్షల కోట్లు. 2022–23 బడ్జెట్ అంచనాల్లో ఇది 52.7 శాతం. ఇందులో ఒక్క పన్ను వసూళ్లు రూ.10.11 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఈ మొత్తం 52.3 శాతం. ► ఇక ఇదే కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.18.23 లక్షల కోట్లు. ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ అంచనాల్లో 46.2 శాతం. ► వెరసి ద్రవ్యలోటు 6.20 లక్షల కోట్లుగా నమోదయ్యింది. -
బాబు చేసిన పాపాలు
చంద్రబాబు సర్కారు 2016–17, 2017–18లో 7.6 శాతం.. 2018–19లో ఏకంగా 8.3 శాతం వడ్డీతో మార్కెట్ రుణాలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7.2%, 2020–21లో 6.5% వడ్డీతో మాత్రమే మార్కెట్ రుణాలు తీసుకుంది. క్రమంగా అప్పులు కూడా తగ్గిస్తోంది. – ఆర్బీఐ నివేదిక సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసినట్లు ఆర్బీఐ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఏ సంవత్సరం కూడా ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) నిబంధనలను పాటించలేదని కుండబద్దలు కొట్టింది. 2014–15 ఆర్థిక ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ, అప్పులు, అప్పులపై వడ్డీలు, వ్యయాల తీరు తెన్నులపై ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక వడ్డీలకు ఎక్కువ అప్పులు చేస్తోందని గగ్గోలు పెడుతున్న ఈనాడు, టీడీపీ బృందానికి.. బాబు గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక నిర్వహణపై ఆర్బీఐ వెల్లడించిన అధ్యయన నివేదిక కనిపించడం లేదు. ఈ నివేదిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం మార్కెట్ అప్పులను ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వడ్డీకి తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. స్టేట్ డెవలప్మెంట్ రుణాల కింద మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న అప్పులకు సాధారణం కన్నా 45 బేసెస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ పడినట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటి ప్రభుత్వం క్రమంగా అప్పులను కూడా తగ్గిస్తోందని తెలిపింది. 2020–21 బడ్జెట్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35.5 శాతం ఉంటాయని అంచనా వేయగా, వాస్తవానికి సవరించిన అంచనాల్లో అవి 32.5 శాతానికే పరిమితం అయినట్లు వెల్లడించింది. ఆ అప్పులు కూడా తక్కువ వడ్డీకే తెచ్చిందని తెలిపింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు ద్రవ్యలోటు 4 శాతం పైగానే ఉందని.. ఒక ఏడాది ఏకంగా 6 శాతానికి చేరిందని తెలిపే ఆర్బీఐ నివేదికలోని ఓ భాగం బాబు జమానాలో ఎఫ్ఆర్బీఎంను మించి అప్పులు బాబు హయాంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవడం అప్పట్లో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టింది. రాష్ట్ర ఆర్థిక పరపతి దిగజారినప్పుడే ఎక్కువ వడ్డీలకు గానీ అప్పులు పుట్టవని ఆర్బీఐ నివేదిక వ్యాఖ్యానించింది. మరో పక్క 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు చంద్రబాబు హయాంలో ఏ సంవత్సరం కూడా ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) నిబంధనలను పాటించలేదని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్య లోటు మూడు శాతం దాటకూడదని, అయితే బాబు ఐదేళ్ల పాలనలో ఒక ఏడాది ఏకంగా ఆరు శాతం, మిగతా నాలుగేళ్లు నాలుగు శాతంపైనే ఉందని నివేదిక వెల్లడిచింది. వీటన్నింటి వల్ల ఆర్థిక సూచికల ర్యాంకులో రాష్ట్రం దిగజారినట్లు నివేదిక స్పష్టం చేసింది. -
రెవెన్యూ, ద్రవ్య లోటు తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ, ద్రవ్యలోటును తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక శాఖ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)లో ఇటీవల సవరణలు చేసింది. ప్రస్తుత సంవత్సరపు ఆర్థిక విధాన వ్యూహం, మధ్యకాలిక ఆర్థిక విధానాన్ని ఎఫ్ఆర్బీఎం పత్రంలో ఆర్థిక శాఖ దీనిని వెల్లడించింది. 2025–26 ఏడాది నాటికి రెవెన్యూ లోటును 2.4 శాతానికి.. ద్రవ్యలోటును 3.5 శాతానికి తగ్గించనున్నట్లు అందులో పేర్కొంది. అప్పుల శాతం కూడా తగ్గింపు ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులను 2025–26 నాటికి 35.5 శాతానికి తగ్గించాలని కూడా ఆర్థిక శాఖ లక్ష్యంగా నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23)లో ఎఫ్ఆర్బీఎం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 36.30గా ఉంది. అయితే, దీనిని 32.79 శాతానికే పరిమితం చేయనున్నట్లు రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థికశాఖ పేర్కొంది. అంతకుముందు 2021–22 బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35% ఉంటాయని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు అప్పులు 32.51 శాతానికి తగ్గాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ద్రవ్యలోటు 5% ఉంటుందని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు ద్రవ్యలోటు 3.18 శాతానికి తగ్గింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం చట్టాల్లో సవరణలు చేసుకున్నాయి. అదే తరహాలో ఏపీ కూడా సవరణలు చేయడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ద్రవ్య, రెవెన్యూ లోటును తగ్గించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. పన్ను ఎగవేతలను, లీకేజీలను నిరోధించడం ద్వారా రాష్ట్ర సొంత ఆదాయం పెంచుకోవాలని, లావాదేవీల వ్యయాన్ని తగ్గించడంతో పాటు మరింత సమర్ధవంతంగా పన్ను, పన్నేతర ఆదాయాలను రాబట్టుకోవాలని నిర్ణయించింది. -
ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.13,16,595 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఫిబ్రవరి ముగిసే నాటికి రూ.13,16,595 కోట్లుగా నమోదయ్యింది. సంబంధిత బడ్జెట్ లక్ష్యంలో (రూ.15.91 లక్షల కోట్లు) ఇది 82.7 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.9 శాతంగా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఫిబ్రవరి ముగిసే నాటికి ద్రవ్యలోటు 76 శాతం ఉంటే, తాజా సమీక్షా కాలంలో ఇది 82.7 శాతానికి చేరడానికి ప్రభుత్వ అధిక వ్యయాలే కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్య గణాంకాలు చూస్తే... ఫిబ్రవరి నాటికి ఆదాయాలు రూ.18.27 లక్షల కోట్లు. వ్యయాలు రూ.31.43 లక్షల కోట్లు. సవరిత బడ్జెట్ లక్ష్యంలో 83.4 శాతం. వెరసి ద్రవ్యలోటు 13.16 లక్షల కోట్లు. -
ద్రవ్యలోటు రూ.5.26 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సెప్టెంబర్ ముగిసే నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంతో పోల్చితే ఈ పరిమాణం 35 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. 2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే ఇది 6.8 శాతం. అంచనాలతో పోల్చితే సెప్టెంబర్ నాటికి ద్రవ్యలోటు రూ.5,26,851 కోట్లకు (35 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం. కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 114.8 శాతానికి ఎగసింది. 2020–21లో 3.5 శాతం తొలి (బడ్జెట్) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే... 2020–21తో పోల్చితే పురోగతి ► 2021 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.10.99 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 55.5 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్ మొత్తం ఆదాయ అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 25.2 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 సెప్టెంబర్ నాటికి) వచ్చింది రూ.9.2 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 59.6 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 28 శాతమే కావడం గమనార్హం. ► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.16.26 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 46.7 శాతం. వెరసి ద్రవ్యలోటు సెప్టెంబర్ నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరిందన్నమాట. సెప్టెంబర్‌లో మౌలిక రంగం స్పీడ్ 4.4 శాతం ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి సెప్టెంబర్‌లో 4.4 శాతం పెరిగింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ ఎనిమిది రంగాల వృద్ధితీరు 2020లో కేవలం 0.6 శాతం. అప్పటి అతి తక్కువ లో బేస్ పరిస్థితిలో కూడా మౌలిక రంగం కేవలం 4.4 శాతం పురోగమించడం గమనార్హం. లో బేస్ కారణంతోనే 2021 ఆగస్టులో వృద్ధిరేటు భారీగా 11.5 శాతంగా ఉంది. మౌలిక రంగాల తీరు సమీక్షా నెల్లో వేర్వేరుగా చూస్తే... సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6 శాతం ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7 శాతం క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02 శాతం పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 0.3 శాతం పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1 శాతం. -
లక్ష్యంలో 31.1 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో 31.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.4,68,009 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గురువారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే, 2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోలి్చతే ఇది 6.8 శాతం. అంచనాలతో పోలి్చతే ఇప్పటికి ద్రవ్యలోటు రూ.4,69,009 కోట్లకు (31.1 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం. కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 109.3 శాతానికి ఎగసింది. 2020–21లో 3.5 శాతం తొలి (బడ్జెట్) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే... 2020–21తో పోలి్చతే మెరుగైన స్థితి ► 2021 ఆగస్టు నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.8.08 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 40.9 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్ మొత్తం ఆదాయ అంచనాల్లో ఆగస్టు నాటికి ఒనగూరింది కేవలం 16.8 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 ఆగస్టు నాటికి) వచి్చంది రూ.6.44 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 41.7 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో ఆగస్టు నాటికి ఒనగూరింది కేవలం 17.4 శాతమే కావడం గమనార్హం. ► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.12.76 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 36.7 శాతం. ► వెరసి ఆదాయ–వ్యయాల మధ్య వ్యత్యాసం (ద్రవ్యలోటు) ఆగస్టు నాటికి రూ.4.68 లక్షల కోట్లకు చేరిందన్నమాట. ► ద్రవ్యలోటు కట్టడికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, రేటింగ్ సంస్థలు ఇతర ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. ఆర్థిక ఉద్దీపనల ప్రకటనల విషయంలో జాగరూకత పాటించాలన్నది వారి అభిప్రాయం, కాగా, కేవీ కామత్ లాంటి ప్రముఖ బ్యాంకర్లు ఈ విషయంలో కొంత సాహస వైఖరిని ప్రదర్శించాలని కేంద్రానికి సూచిస్తున్నారు. ► 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. ► ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెపె్టంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. -
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించిన తాజా పరిణామాలతో పాటు దేశీయ, అంతర్జాతీయంగా వెల్లడికానున్న ఆర్థిక గణాంకాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశకు అత్యంత కీలకంగా ఉండనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలకు తోడు భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించడంలో కీలకంకానున్నాయని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ – హెడ్– ఈక్విటీ రీసెర్చ్ í కురియన్ అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే మార్కెట్ ప్రతికూలంగా స్పందించనుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా, సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషించారు. స్థూల ఆర్థికాంశాల ప్రభావం.. మే నెల ద్రవ్య లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి గణాంకాలు, మార్చి త్రైమాసిక కరెంట్ అకౌంట్ మంగళవారం వెలువడనున్నాయి. జూన్ నెల మార్కిట్ తయారీ పీఎంఐ బుధవారం విడుదలకానుండగా.. సేవారంగ పీఎంఐ శుక్రవారం వెల్లడికానుంది. దేశీ ఆటో పరిశ్రమ జూన్ నెల అమ్మకాల డేటా బుధవారం నుంచి వెల్లడికానుంది. మరోవైపు జూన్ 9–10 తేదీల్లో జరిగిన అమెరికా ఫెడ్ సమావేశానికి సంబంధించిన మినిట్స్ బుధవారం వెల్లడికానున్నాయి.1,420 కంపెనీల ఫలితాలు: ఎంఆర్ఎఫ్, ఓఎన్జీసీ, వొడాఫోన్ ఐడియాసహా దాదాపు 1,420 కంపెనీల ఫలితాలు ఈ వారం వెలువడనున్నాయి. -
కరోనా ఎఫెక్ట్: రూ.10 లక్షల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఫలితంగా దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. కరోనా కారణంగా భారత్ రూ.10 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూడనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ సంక్షోభం కారణంగా భారత్ రూ .10 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వచ్చే నెలలో జీతాలు చెల్లించడానికి కూడా కొన్ని రాష్ట్రాల వద్ద డబ్బు లేదు’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది. మన దేశ జీడీపీ రూ .200 లక్షల కోట్లు. అందులో పది శాతం అంటే సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు, రైతుల కోసం కేటాయించారు’ అని గడ్కరీ గత నెలలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని ప్రస్తావించారు. రూ .10 లక్షల కోట్ల రెవెన్యూ లోటు ఉంది. కాబట్టి రూ .200 లక్షల కోట్లలో (జీడీపీ) రూ. 30 లక్షల కోట్లు ఈ విధంగా వెళితే.. ఎంత తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుందో చూడండి’ అన్నారు. ప్రస్తుత పరిస్థితిని సానుకూలతతో పరిష్కరించుకోవలసి ఉంటుందన్నారు. ‘మనమందరం కఠినమైన సమయాన్ని, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రతికూలత, నిరాశ, భయంతో మనం దాన్ని ఎదుర్కోలేము. ఆత్మవిశ్వాసం, సానుకూల వైఖరితో కరోనాపై పోరాడాలి’ అని గడ్కరీ పిలుపునిచ్చారు. (ఆశావహంగా ఫార్మా) ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 5 శాతం తగ్గిపోతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే జీడీపీ వృద్ధి రేటు 2021-22లో 8.5 శాతంగా, 2022-23లో 6.5 శాతంగా ఉంటుందని తెలిపింది. దీర్ఘకాల లాక్డౌన్ వల్ల కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్రం ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. అయితే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను తిరిగి అమలు చేసే యోచనలో ఉన్నాయని సదరు నివేదిక తెలిపింది. బుధవారం 9,985 కేసులు నమోదయ్యి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.76 లక్షలకు చేరుకుంది. రాజకీయ, ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలు ఒకే రోజులో 1,500కు పైగా కేసులను నమోదు చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం జూలై 31 నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు 1.5 లక్షలకు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రజలు నియమాలను పాటించకపోతే తిరిగి లాక్డౌన్ అమలు చేయవలసి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. -
వృద్ధి లక్ష్య సాధన కష్టమే: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి లక్ష్య సాధన కొంత కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2019-20లో 4.9 శాతం వాస్తవ వృద్ధి రేటు నమోదయ్యే వీలుందని, 2020-21లో ఈ రేటు 5.5 శాతానికి పెరగవచ్చని అంచనావేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధనకు ప్రధానంగా సంస్థాగత సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొంది. తాజా సీతారామన్ ఆర్థిక బడ్జెట్ ప్రకారం- 2020-21లో భారత్ నామినల్ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా) స్థూల దేశీయోత్పత్తి 10 శాతం. 2021-22, 2020-23ల్లో ఇది 12.6 శాతం, 12.8 శాతానికి పెరుగుతుందని బడ్జెట్ అంచనావేసింది. అయితే 2019-20లో ఈ రేటు 7.5 శాతంగా ఉంటుందని, 2020-21లో 8.7 శాతంగా నమోదవుతుందని మూడీస్ అంచనావేసింది. -
ద్రవ్య లోటుపై రఘురామ్ రాజన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటుందని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ల పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యమిస్తుందని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. విదేశీ పోటీని ఆహ్వానించాలని, కొందరు వాదిస్తున్నట్లుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం విఘాతం కలగదని పేర్కొన్నారు. -
ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొముర అంచనా వేసింది. నొముర దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నొముర పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది. బ్యాంకులకిస్తే బెటర్: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఇబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ తాజా నివేదిక అంచనా వేసింది. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకటించారు. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఇప్పటికే మూడు కమిటీలు... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) వీటికి నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12% వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, థోరట్ కమిటీ 18%గా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారులకు ఓకే చెప్పింది. లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28% నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14% నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. -
ఒడిదుడుకుల వారం..!
ముంబై: మార్చి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ ముగింపు, స్థూల ఆర్థిక అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ) నిర్ణయాలు ప్రధానంగా ఈవారంలో దేశీ స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయినందున రుణ మార్కెట్ల నుండి ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గేందుకు అవకాశం ఉంది. ఇదే సమయంలో రిడెంప్షన్ ఒత్తిడికి ఆస్కారం ఉండడం వల్ల దేశీ సంస్థలు (డీఐఐ)లు కూడా భారీ స్థాయిలో అమ్మకాలకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉంది’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘కొంత దిద్దుబాటు జరిగిన తరువాత నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయ సంకేతాలు కూడా పురోగతికి ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు లార్జ్‌క్యాప్ ఇండీసెస్ను అవుట్పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎంపికచేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచన’ అని ఎడిల్వీస్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. ద్రవ్య లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా శుక్రవారం (29న) విడుదల కానుండగా.. విదేశీ రుణ గణాంకాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇవి ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా నిఫ్టీ 11,380 వరకు వెళ్లే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. ఇక్కడ కీలక మద్దతు లభించకపోతే మరింత దిద్దుబాటుకు ఆస్కారం ఉందన్నారు. మార్కెట్ పెరిగితే 11,572 కీలక నిరోధంగా పనిచేయనుందని విశ్లేషించారు. అమెరికా–చైనాలు బీజింగ్‌లో భేటీ: వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య గురువారం బీజింగ్‌లో ఇరుదేశాల ఉన్నతస్థాయి అధికారుల మధ్య చర్చలు పునర్ప్రారంభంకానున్నాయి. ఇక్కడ నుంచి వెలువడే కీలక అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఆలస్యం అవుతున్న ఈ అంశం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూలత చూపుతుందన్నారు. ఈసారి ఏమైనా పురోగతి ఉంటే మాత్రం సూచీలకు సానుకూలం అవుతుందన్నారాయన. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని రాయిటర్స్ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ తిరస్కరణకు గురైన బ్రెగ్జిట్ ఒప్పందంపై త్వరలోనే మరోసారి ఓటింగ్ ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బ్రెగ్జిట్ అంశంపై కొత్త ప్రజాభిప్రాయ సేకరణను డిమాండ్ చేస్తూ శనివారం లండన్‌లో దాదాపు 10లక్షల మంది పౌరులు మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై సైతం ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈనెల 14–15న జరిగిన పాలసీ మీటింగ్‌కు సంబంధించిన తన బోర్డ్ సభ్యుల అభిప్రాయ సారాంశాన్ని సోమవారం ప్రకటించనుంది. రూపాయికి 68.30 వద్ద మద్దతు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పతనమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందనే ఆందోళనలు, తగ్గిన డిమాండ్ నేపథ్యంలో ముడిచమురు ధరలు దిగివచ్చి డాలరుతో రూపాయి మారకం విలువకు బలాన్నిచేకూర్చాయి. వరుసగా ఆరోవారంలోనూ బలపడిన రూపాయి.. గతవారంలో 15 పైసలు బలపడి 68.95 వద్ద ముగిసింది. రూపాయికి కీలక నిరోధం 69.50 వద్ద ఉండగా, సమీపకాల మద్దతు 68.30 వద్ద ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అమిత్ గుప్తా అన్నారు. విదేశీ నిధుల వెల్లువ.. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ఎఫ్ఐఐలు భారత స్టాక్ మార్కెట్లలో రెట్టించిన ఉత్సాహంతో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. మార్చి 1–22 కాలంలో వీరు ఏకంగా రూ.38,211 కోట్ల పెట్టుబడులను పెట్టారు. రూ.27,424 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.10,787 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. సాధారణ ఎన్నికల్లో సానుకూలత ఉండవచ్చనే ప్రధాన అంశం కారణంగా వీరి పెట్టుబడి గణనీయంగా పెరిగిందని వినోద్ నాయర్ అన్నారు. ఇక నుంచి నిధుల ప్రవాహం ఏవిధంగా ఉండనుంది.. రూపాయి కదలికల ఆధారంగా మార్కెట్ గమనం ఉండనుందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్, ఎండీ డీకే అగర్వాల్ విశ్లేషించారు. -
మార్కెట్లపై సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఫిబ్రవరి నెల ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు ముగిసే రోజు కావడం, భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్లపై చూపించింది. దీంతో ఉదయం ఆశాజనకంగా ప్రారంభమై లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా లాభ, నష్టాల మధ్య స్వల్ప శ్రేణి పరిధిలో కదలాడుతూ... చివరికి బీఎస్ఈ సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 35,829 వద్ద క్లోజ్ అవగా, అటు నిఫ్టీ 15 పాయింట్లకు పైగా నష్టపోయి 10,792 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,865–10,785 మధ్య ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, యూరోప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం కూడా మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. ‘‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కారణంగా మార్కెట్ ఓ శ్రేణికి పరిమితమైంది. మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువ రోజుల పాటు కొనసాగవని ఇన్వెస్టర్లు భావించారు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీనికి అదనంగా ఆర్థిక గణాంకాలు, ఎన్నికల ముందుస్తు ర్యాలీ, ఎఫ్ఐఐల నిధుల రాక పెరగడం, రూపాయి బలోపేతం వంటి వాటిపైకి దృష్టి మళ్లిందన్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్చి సిరీస్‌కు పొజిషన్లను క్యారీ ఫార్వార్డ్ చేసుకోకుండా, వాటిని క్లోజ్ చేసేందుకు మొగ్గు చూపించినట్టు బ్రోకర్లు తెలిపారు. మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలు, ద్రవ్యలోటు గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు వినోద్ నాయర్ చెప్పారు. ఆర్ఈసీ రూ.11 మధ్యంతర డివిడెండ్ ప్రభుత్వరంగ సంస్థ ఆర్ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 11 రూపాయలను మధ్యంతర డివిడెండ్‌గా ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణాల సమీకరణ పరిమితిని రూ.60,000 కోట్ల నుంచి రూ.85,000 కోట్లకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ‘కిరణ్’ ఇన్ఫోసిస్ షేర్ల అమ్మకం... ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న కిరణ్ మంజుందార్ షా నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు సంబంధించి 1,600 షేర్లను విక్రయించిన విషయం వెలుగు చూసింది. బయోకాన్ చైర్పర్సన్ అయిన కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ కంపెనీ బోర్డులో లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గానూ ఉన్నారు. తన పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవల ద్వారా ఆమె షేర్లను ముందస్తు అనుమతి లేకుండా అనుకోకుండా విక్రయించినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ‘‘కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆడిట్ కమిటీ సమీక్ష అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్ పాలసీ, ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించాం. కిరణ్ మజుందార్ షాపై రూ.9.5 లక్షల పెనాల్టీని విధించడం జరిగింది. కిరణ్ మజుందార్ షా ముందస్తు అనుమతి లేకుండా తన పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా 1,600 షేర్లను విక్రయించినట్టు ఇన్ఫోసిస్ కాంప్లియన్స్ ఆఫీసర్ దృష్టికి ఫిబ్రవరి 13న వచ్చింది’’ అని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో మేనేజర్ షాకు తెలియకుండానే ఈ పనిచేసినట్టు వివరణ ఇచ్చింది. -
ద్రవ్యలోటు భయపెడుతోంది..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లెక్కలు ప్రస్తుతానికి ఆందోళన సృష్టిస్తున్నాయి. కేంద్రం మంగళవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ – 2019 మార్చి) మధ్య ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ఉండాలని సంబంధిత బడ్జెట్ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 3.3 శాతం. ►అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పీయూష్ గోయెల్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, 2018–19లో ద్రవ్యలోటు అంచనాలను 6.24 లక్షల కోట్ల నుంచి రూ.6.34 లక్షల కోట్లకు (జీడీపీలో 3.4%) పెంచారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయ పథకానికి ఫండింగ్ వల్ల ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచాల్సి వచ్చిందని బడ్జెట్లో గోయెల్ తెలిపారు. ►అయితే జనవరి ముగిసే నాటికి (ఆర్థిక సంవత్సరం ఇంకా 2 నెలలు మిగిలి ఉండగానే) లోటు రూ.7.70 లక్షల కోట్లకు చేరింది. అంటే లక్ష్యం (రూ.6.34 లక్షల కోట్లు)లో 100% దాటిపోయి మరో 21.5% (121.5%) పెరిగిందన్నమాట. ►అయితే కేంద్రం మాత్రం ద్రవ్యలోటును సవరిత అంచనాలను (రూ.6.34 లక్షల కోట్లు) ఎంతమాత్రం దాటనివ్వమని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి) కేంద్ర ఖజానాకు రానున్న ఆదాయం లోటును కట్టడి చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థికశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ►2018–19కు సంబంధించి మధ్యంతర బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఆదాయ లక్ష్యం రూ.17.29 లక్షల కోట్లు. అయితే జనవరి నాటికి ఈ వసూళ్లు రూ.11.81 లక్షల కోట్లు. అంటే లక్ష్యంలో 68.3 శాతమన్నమాట. ►అలాగే వ్యయాల మొత్తం రూ.24.57 లక్షల కోట్లయితే జనవరి ముగిసే నాటికి రూ.20.01 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ పరిమాణం వ్యయాలు బడ్జెట్‌తో పోల్చితే 81.5 శాతం. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? ద్రవ్యలోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై సర్వత్రా ఇప్పుడు చర్చ నెలకొంది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జలాన్ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. అయితే, ఆర్బీఐ ఉషా థోరట్ కమిటీ సిఫారసులను తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ఆర్బీఐ లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం. -
కేంద్రం సంస్కరణలు కొనసాగించాలి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్య సాధనకు కేంద్రం కట్టుబడి ఉండాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. మరోవైపు గత నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన సంస్కరణలను కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వస్తు, సేవల పన్నుల విధానం, దివాలా చట్టం వంటి సంక్లిష్టమైన చట్టాలను ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు ఇబ్బందిపడ్డాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రవేశపెట్టడంతో పాటు అమలు చేయడంలోనూ గణనీయంగా పురోగతి సాధించిందని అరవింద్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్థిక స్థిరీకరణనేది ప్రస్తుత ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటి. ఇది స్థూల ఆర్థిక స్థిరత్వ సాధనలో కీలకపాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యాలను మార్చుకోరాదు‘ అని ఆయన పేర్కొన్నారు. -
ట్రిలియన్ దాటిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి,న్యూఢిల్లీ: పండుగ సీజన్లో వినియోగదారుల డిమాండ్ పెరగడంతో జీఎస్టీ వసూళ్లు మరోసారి ట్రిలియన్ మార్క్‌ను అధిగమించాయి. సెప్టెంబర్‌లో రూ. 94,442 కోట్ల పోలిస్తే అక్టోబర్ నెలలో బాగా పుంజుకుని లక్ష కోట్ల రూపాయిలను దాటాయి. 6.64 శాతం పెరిగి అక్టోబర్ నెలలో రూ. 1,00,700 కోట్లకు చేరాయి. సీజీఎస్టీ రూ. 16,464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ. 22,826 కోట్లు. ఉమ్మడి అంటే ఐజీఎస్టీ వసూళ్లు రూ. 53,419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ. 26,908 కోట్లు. సెస్ రూపంలో రూ. 8,000 కోట్లు వసూలయ్యాయి. ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆపసోపాలు పడుతున్నప్రభుత్వానికి ఇది ఊరట నిచ్చే అంశం. కాగా ఈ ఏడాదిలో లక్షకోట్ల వసూళ్లను దాటం ఇది రెండవ సారి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలలో తొలిసారి ట్రిలియన్ రూపాయల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. -
ఫెడ్ నిర్ణయం, రూపాయి కదలికలే కీలకం..!
న్యూఢిల్లీ: ఈవారంలో సూచీలు మరింత కన్సాలిడేషన్‌కు గురికావచ్చని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, డాలరు విలువ బలపడుతుండటం, ద్రవ్యలోటు వంటి పలు ఆందోళనకర అంశాల నేపథ్యంలో మార్కెట్ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఈవారంలో అత్యంత కీలక అంశంగా ఉంది. మన మార్కెట్లలో దిద్దుబాటు చోటుచేసుకుంటున్న క్రమంలో పలు రంగాలు, ఎంపిక చేసిన షేర్లలో వాల్యూ బయ్యింగ్‌కు అవకాశం కనిపిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. ఇక శుక్రవారం వెల్లడికానున్న ద్రవ్యలోటు, ఆగస్టు ఇన్ఫ్రా డేటాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని భావిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఫెడరల్ రిజర్వ్ బుధవారం ప్రకటించనున్న వడ్డీ రేట్ల కోసం ప్రపంచదేశాల మార్కెట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రీసెర్చ్ సంస్థ రాయిటర్స్ అంచనా ప్రకారం.. సెప్టెంబర్ 25–26 సమావేశంలో పాలసీ రేటు 2 నుంచి 2–25 శాతానికి పెరిగేందుకు అవకాశం ఉంది. ఎఫ్‌ఓఎమ్‌సీ సమావేశం నేపథ్యంలో ఈవారంలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. గడిచిన సెషన్లలో చోటుచేసుకున్న కరెక్షన్ అనంతరం మార్కెట్ ఇంటర్మీడియట్ బోటమ్‌ను తాకినట్లు భావిస్తున్నామని వెల్లడించారు. వెంటాడుతున్న వాణిజ్య యుద్ధ భయాలు 200 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను విధించగా.. చైనా సైతం 110 బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై సుంకాలను ప్రకటించింది. ఈ రెండు దేశాల ట్యారిఫ్‌లు కూడా సోమవారమే అమల్లోకిరానున్నాయి. అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగియకపోగా మరింత వేడెక్కే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 72.91 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై దృష్టిసారిస్తున్నారు. 11,090 స్థాయిని కోల్పోతే మరింత దిగువకు 11,170 పాయింట్ల కీలక మద్దతు స్థాయిని కోల్పోయిన నిఫ్టీకి తక్షణ మద్దతు స్థాయి 11,090 వద్ద ఉందని, ఈ స్థాయిని కూడా కోల్పోతే మరింత కరెక్షన్ను చూడవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషించింది. పుల్‌బ్యాక్ ర్యాలీస్ నమోదైతే 11,250 అత్యంత కీలక నిరోధమని వివరించింది. -
ద్రవ్యలోటుపై లక్ష్యాన్ని చేరుకుంటాం
న్యూఢిల్లీ: పెరుగుతున్న పన్ను ఆదాయం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల మద్దతుతో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతానికి పరిమితం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం వెల్లడించారు. అయితే పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ ఆకాశన్నంటుతున్నా, వాటిపై పన్నులను తగ్గించే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు, డాలర్‌తో రూపాయి మారకం విలువను బలపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్ర, శనివారాల్లో స్థూల ఆర్థిక సమీక్షా సమావేశం జరిగింది. శనివారం సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ ‘బడ్జెట్లో చెప్పిన 7 నుంచి 7.5 శాతం కంటే ఎక్కువే జీడీపీ వృద్ధిని సాధిస్తాం. మూలధన వ్యయ లక్ష్యాలను చేరుకుంటాం. బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే పన్ను వసూళ్లను రాబడతాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను విక్రయించడం ద్వారా లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువే సమీకరిస్తాం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్రో ధరలపై సమాధానం నిరాకరణ పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నులను తగ్గించే అంశంపై సమావేశంలో చర్చించారా లేదా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు పెట్రో పన్నుల తగ్గింపుపై కూడా సమావేశంలో చర్చిస్తారని తొలుత అంచనాలు వెలువడ్డాయి. కానీ ఆ దిశగా ముందడుగు పడలేదు. రూపాయి బలహీనపడుతుండటంటో ముడిచమురు కొనుగోలు భారంగా మారుతోందనీ, దీంతో కరెంట్ ఖాతా లోటుపై తీవ్ర ప్రభావం పడుతోందని జైట్లీ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. తాము చేపట్టిన నల్లధన వ్యతిరేక చర్యలు, నోట్లరద్దు, జీఎస్టీతోనే పన్ను ఆదాయం పెరిగిందని జైట్లీ చెప్పుకొచ్చారు. ‘బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువే పన్ను వసూళ్లు ఈ ఏడాది వస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి స్పష్టం చేస్తోంది. కొన్ని నెలల్లో వస్తు, సేవల వినియోగం పెరిగితే పరోక్ష పన్ను రాబడి కూడా పెరుగుతుంది’ అని జైట్లీ తెలిపారు. -
భారీగా కుదేలైన రూపాయి
ముంబై : రూపాయి విలువ రోజురోజుకు మరింత క్షీణిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త కనిష్ట స్థాయిల్లోకి కుదేలైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.32 మార్కును తాకి, ఇన్వెస్టర్లలో గుండె గుబేల్మనిస్తోంది. ఇప్పట్లో రూపాయి కోలుకునే అవకాశాలేమీ కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియా కరెన్సీలు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనంతటికీ కారణం టర్కీ రాజకీయ సంక్షోభం. ఈ సంక్షోభం ప్రపంచ మార్కెట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ కరెన్సీలు, దేశీయ కరెన్సీ పాతాళంలోకి పడిపోతుండటంతో డాలర్ విలువ పైపైకి 13 నెలల గరిష్టంలోకి ఎగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 70.25 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత క్షీణిస్తూ ట్రేడవుతోంది. తాజాగా 43 పైసల్ ఢమాలమని 70.32 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకింది. రూపాయి విలువ భారీగా పడిపోతుండటంతో, వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్టాన్ని తాకుతున్నట్టు విశ్లేషకులు చెప్పారు. టర్కీ కరెన్సీ లీరా కోలుకుని గ్లోబల్ మార్కెట్లు స్థిరత్వానికి వచ్చినప్పుడే రూపాయి విలువ కోలుకుంటుందని ఆనంద్ సేథి షేర్, స్టాక్ బ్రోకర్స్, రీసెర్చ్ విశ్లేషకుడు రుషబ్ మరు తెలిపారు. మరికొన్ని సెషన్ల వరకు రూపాయి విలువ ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై విధించిన టారిఫ్‌లు, టర్కీ లీరాను దెబ్బతీస్తున్నాయని, ఈ ఒత్తిడి భారత రూపాయిపై పడుతుందని చెప్పారు. -
పెట్రో సుంకం తగ్గిస్తే ద్రవ్యలోటు పైపైకే...
న్యూఢిల్లీ: పెరుగుతున్న ముడిచమురు ధరలతో ఒకపక్క ప్రజల జేబుకు చిల్లు పడుతుంటే.. మరోపక్క ప్రభుత్వం కూడా దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోకుండా, పెట్రోలు, డీజిల్‌పై గనుక ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే.. ద్రవ్యలోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి కొంత ఊరట కల్పించాలంటూ అన్నివైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, పెట్రోలు, డీజిల్‌పై ప్రతి రూపాయి సుంకం తగ్గింపుతో ఖజానాకు దాదాపు రూ.13,000 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుందని అంచనా. ‘బీఏఏ’ రేటింగ్ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే... ఆర్థిక క్రమశిక్షణ విషయంలో భారత్ చాలా వెనుకబడిందని మూడీస్ పేర్కొంది. వ్యయాలను తగ్గించుకుంటేనే... ‘ఒకవేళ పెట్రో ఉత్పత్తులపై సుంకం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తే... దానికి అనుగుణంగా వ్యయాలను కూడా కట్టడి చేయాల్సి ఉంటుంది. లేదంటే ద్రవ్యలోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది’ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్(సావరీన్ రిస్క్ గ్రూప్) విలియమ్ ఫోస్టర్ వ్యాఖ్యానించారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ భారత్ సావరీన్ రేటింగ్‌ను మూడీస్ గతేడాది పెంచిన(బీఏఏ2, స్థిర అవుట్‌లుక్) సంగతి తెలిసిందే. -
వ్యాపార విశ్వాసం దిగువకు!
ముంబై: జూన్ త్రైమాసికానికి సంబంధించి కార్పొరేట్ల వ్యాపార విశ్వాసం తగ్గింది. రూ.13,000 కోట్ల పీఎన్బీ కుంభకోణం, ద్రవ్యలోటు కట్టుతప్పడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ‘గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో విశ్వాసం పెరిగింది. ఇది తర్వాత 2018 తొలి త్రైమాసికంలో 91 శాతం గరిష్ట స్థాయికి ఎగసింది. అయితే రెండో త్రైమాసికంలో 6.6 శాతం క్షీణతతో 85 శాతానికి తగ్గింది’ అని ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ డాన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకుల్లో కుంభకోణాలు చోటుచేసుకోవడం, ద్రవ్యలోటు కట్టుతప్పడం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని తెలిపింది. వీటితోపాటు పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో ఎల్ఓయూల నిలుపుదల, అమెరికా రక్షణాత్మక విధానాలు అనుసరించడం కూడా ఆందోళనలకు ఆజ్యం పోశాయని పేర్కొంది. ఈ అంశాలన్నీ కంపెనీల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయని పేర్కొంది. అయితే అప్టిమిజమ్ ఇండెక్స్‌లో వార్షిక ప్రాతిపదికన 7.6% వృద్ధి నమోదయ్యిందని తెలిపింది. రంగాల వారీగా చూస్తే ఇంటర్మీడియట్ గూడ్స్ అత్యంత ఆశావహ రంగంగా అవతరించిందని పేర్కొంది. ఇక నిర్మాణ రంగం చివరిలో నిలిచిందని తెలిపింది. -
ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యలోటు భయాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) బుధవారం ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటి ద్రవ్యలోటు పరిస్థితిపై తాజా గణాంకాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం– ఆర్థిక సంవత్సరం ఇంకా ఒకనెల మిగిలిఉండగానే ద్రవ్యలోటు బడ్జెట్ (2017–18) లక్ష్యాలను దాటి, ఏకంగా 120.3%కి చేరింది. విలువ రూపంలో ఇది రూ.7.15 లక్షల కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం రూ.5.94 లక్షల కోట్లుగా ఉండాలి. ఆందోళన వద్దంటున్న ప్రభుత్వం నిజానికి 2017–18 బడ్జెట్ ప్రకారం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 3.2 శాతంగానే ఉండాలి. అయితే 2018–19 బడ్జెట్లో దీనిని కేంద్రం 3.5 శాతానికి సవరించింది. ఈ సవరిత శాతంపైనే ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. కాగా ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్లు బుధవారం ఫైనాన్స్ సెక్రటరీ హాస్ముఖ్ ఆదియా స్పష్టం చేశారు. ఈ అంశంపై బుధవారం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించినట్లూ వెల్లడించారు. రూపాయి విలువపై ఎఫెక్ట్... ద్రవ్యలోటు ఎఫెక్ట్ బుధవారం మనీ మార్కెట్‌పై పడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు నష్టపోయి 65.18కి చేరింది. వాణిజ్య యుద్ధ భయాలు, దేశ కరెంట్ అకౌంట్‌లోటు(క్యాడ్) ఆందోళనలు కూడా జతకావడంతో ఒక దశలో బుధవారం రూపాయి విలువ 65.30కి పడిపోవడం గమనార్హం. -
మురిపించింది... మౌలికం
జనవరిలో 6.7% వృద్ధి న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమల విభాగం జనవరిలో పర్వాలేదనిపించింది. వృద్ధి 6.7 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 3.4 శాతం. ఐఐపీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఈ ఎనిమిది రంగాలూ ఇలా.. ►పెట్రోలియం రిఫైనరీ ప్రోడక్టులు: అసలు ఎటువంటి వృద్ధి లేని స్థితి నుంచి (2016 జనవరిలో 0%) తాజా సమీక్షా నెల– జనవరిలో 11% వృద్ధిని నమోదుచేసుకుంది. ►సిమెంట్: క్షీణత నుంచి (2016 జనవరిలో వృద్ధి లేకపోగా –13.3 శాతం క్షీణత) వృద్ధి ఏకంగా 20.7 శాతానికి ఎగసింది. ►స్టీల్: వృద్ధి 11.3 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ►విద్యుత్: వృద్ధి 5.2 శాతం నుంచి 8.2 శాతానికి చేరింది. ►బొగ్గు: ఈ రంగంలో వృద్ధి 3.5 శాతం నుంచి 3.0 శాతానికి తగ్గింది. ►క్రూడ్ ఆయిల్: 1.3 వృద్ధి రేటు –3.2 క్షీణతలోకి జారింది. ►సహజవాయువు: ఈ రంగంలో కూడా 11.6 శాతం వృద్ధి –1 శాతం క్షీణతలోకి మారింది. ►ఎరువులు: –1.2 శాతం క్షీణత మరింతగా –1.6 క్షీణతకు జారింది. 10 నెలలూ చూస్తే దిగువ బాటే: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ చూస్తే, మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గింది. గురితప్పింది... ద్రవ్యలోటు జనవరి ముగిసే నాటికి 6.77 లక్షల కోట్లు న్యూఢిల్లీ: భారత్ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2017–18) గురితప్పుతున్నట్లు మరింత స్పష్టమైన గణాంకాలు వెలువడ్డాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండు నెలలు ఉండగానే– జనవరిలో ద్రవ్యలోటు రూ. 6.77 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2017–18 బడ్జెట్ లక్ష్యాలతో పోల్చిచూస్తే ఇది 113.7 శాతం అధికం. ప్రభుత్వ అధిక వ్యయాలు దీనికి కారణం. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2017–18లో ఈ విలువ రూ.5.33 లక్షల కోట్లు దాటరాదని ఈ బడ్జెట్ నిర్దేశించింది. ఇది మొత్తం జీడీపీ విలువతో పోల్చితే 3.2 శాతం. అయితే తాజా గణాంకాలు చూస్తుంటే, లక్ష్యాలను సాధించడంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని ఇప్పటికే నిర్ధారించుకున్న కేంద్రం 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని రూ.5.95 లక్షల కోట్లకు పెంచింది. జీడీపీ అంచనా విలువలో ఇది 3.5 శాతం. మరింతగా విశ్లేషిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ అంచనాల ప్రకారం– ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3 శాతానికి తగ్గాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.2 శాతం లక్ష్యానికి బదులు 3.5 శాతంగా ఉంటుందని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ద్రవ్యలోటు విధానంపై ఆర్థిక విశ్లేషకుల నుంచి విమర్శలు వెలువడ్డాయి. బడ్టెట్ తరువాత, స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పడిపోయాయి. నెమ్మదించింది... తయారీ! న్యూఢిల్లీ: తయారీ రంగం ఫిబ్రవరిలో నెమ్మదించిందని నికాయ్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఫిబ్రవరిలో సూచీ 52.1గా నమోదయినట్లు తన సర్వేలో పేర్కొంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. జనవరిలో ఈ రేటు 52.4 వద్ద ఉంది. డిసెంబర్లో 60 నెలల గరిష్ట స్థాయి 54.7 వద్ద సూచీ ఉంది. ఫ్యాక్టరీ ఉత్పత్తి, బిజినెస్ ఆర్డర్లలో మందగమనం ఫిబ్రవరిలో సూచీ నెమ్మదించడానికి కారణమని నికాయ్ పేర్కొంది. అయితే నికాయ్ ఇండెక్స్ ప్రకారం... సూచీ 50పైన ఉంటే అది వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతే, క్షీణతగా భావిస్తారు. వరుసగా 7 నెలలుగా సూచీ 50 పైనే ఉంటోంది. -
ఇకపై ఆకర్షణీయం కాదు
సింగపూర్: భారత్ ద్రవ్యలోటు లక్ష్యం పట్ల ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరిక జారీ చేశారు. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత్ ఇకపై ఎంత మాత్రం ఆకర్షణీయం కాదన్నారు. 2018–19 కేంద్ర బడ్జెట్లో దిగుమతుల సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారత్‌లో తయారీకి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 1991లో భారత్ చెల్లింపుల పరంగా ఎదుర్కొన్న సంక్షోభం, 2013లో మరోసారి సంక్షోభం వరకూ వెళ్లడం అన్నవి నియంత్రణ లేని ఆర్థిక దుబారాల వల్లేనన్నారు. సింగపూర్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో ‘ప్రపంచీకరణలో భారత్’ అనే అంశంపై మాట్లాడుతూ దువ్వూరి ఈ విషయాలు చెప్పారు. పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాల పెంపును దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. భారత్‌లో తయారీకి తగినంత ఆసరా ఇవ్వకుండా ఈ విధంగా రేట్లు పెంచితే అది దేశ తయారీ రంగానికి తగదన్నారు. -
ద్రవ్యలోటు బాట తప్పరాదు
సింగపూర్: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 1వ తేదీ తన బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాలను సవరించడం తగిన నిర్ణయం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం అసంతృప్తికి గురిచేసిందన్నారు. ‘‘ద్రవ్య స్థిరీకరణ విషయంలో అటు యూపీఏ కానీయండి... లేదా ఎన్డీఏ కానీయండి. ఆర్థికమంత్రులు ప్రతిసారీ ‘విరామ’ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇది తప్పదంటూ తమను తాము సమర్థించుకుంటున్నారు. ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నామంటూనే ఆ బాట తప్పుతున్నారు. ఇది ఆందోళనకరమైన అంశం’’ అని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటు లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటును ఎంత మేరకు కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని .. 2018–19 బడ్జెట్ కొనసాగించలేకపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ అంచనాల ప్రకారం– ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3 శాతానికి తగ్గాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.2 శాతం లక్ష్యాలనికి బదులు 3.5 శాతంగా ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు అనుకున్న 3 శాతానికి భిన్నంగా 3.3 శాతంగా ఉంటుందని చెప్పారు. కాగా జాతీయ ఆరోగ్య బీమా పథకం ప్రతిపాదన పట్ల దువ్వూరి హర్షం వ్యక్తం చేశారు. -
పరిమితి మించిన ద్రవ్య లోటు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు.. నవంబర్లోనే పరిమితిని దాటేసింది. బడ్జెట్లో నిర్దేశించుకున్న దాన్ని మించి 112% స్థాయిని తాకింది. జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉండటం, వ్యయాలు అధికంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం. వ్యయాలు, ఆదాయానికి మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు 2017–18 ఏప్రిల్–నవంబర్ మధ్యకాలంలో రూ. 6.12 లక్షల కోట్లుగా ఉన్నట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాల్లో వెల్లడైంది. 2016–17 ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ద్రవ్య లోటు నిర్దేశిత పరిమితిలో 85.8 శాతం మాత్రమే నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటును జీడీపీలో 3.5%కి పరిమితం చేయగలిగిన కేంద్రం ఈసారి 3.2%కి కుదించాలని నిర్దేశించుకుంది. -
మోదీ ప్రచారంతో భారత్‌కు అప్పులు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును భర్తీ చేసుకునేందుకు అదనంగా మరో 50 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ద్రవ్యలోటును స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 3.2 శాతంగా చూపిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి ద్రవ్యలోటును మూడు శాతానికి కుదిస్తామని హామీ ఇచ్చింది. అలాంటిది అదనంగా 50 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? దీనివల్ల వచ్చే ఆర్థిక సంవత్సరానకి ద్రవ్యలోటు మూడు శాతానికి తగ్గాల్సిందిపోయి 3.5 శాతానికి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై పెద్ద ఆశ పెట్టుకుంది. దాదాపు 3.75 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రావని, అదంతా ప్రభుత్వానికి మిగిలినట్టేనని ఊహించింది. వాస్తవానికి రద్దు చేసిన మేరకు డబ్బంతా వచ్చి ఆర్బీఐకి చేరడంతో కంగుతిన్న ప్రభుత్వం ఆర్థిక లోటును దాచేసేందుకు కొత్త దారులు వెతికింది. అత్యవసరంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేయడం వల్ల ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక వనరులు వచ్చి ఖజానా నిండుతుందని భావించింది. జీఎస్టీ అమల్లో ఎన్నో అవరోధాలు, గందరగోళం ఏర్పడడంతో ఆశించిన స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరలేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతాయనుకుంటే పెరుగుతుండడం ఆర్థిక శాఖకు మరో దెబ్బ. అందుకని పన్నులను తగ్గించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను తాజాగా కోరింది. ఏదేమైనా ఈ ఏడాది చమురు కోసం అదనంగా 15 శాతం నిధులు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో దేశ ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంటూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మరుతోంది. ఈ ఏడాది జీడీపీ రేటు 5.7 శాతానికి తగ్గడం కూడా ఆర్థికంగా ఎంతో దెబ్బ. జీఎస్టీని అమలు చేసిన తొలి నెలల్లో నెలకు జీఎస్టీ కింద కేంద్రానికి 91వేల కోట్ల రూపాయలు రాగా, నవంబర్ నెలకు 80,808 కోట్ల రూపాయలే వచ్చాయి. వివిధ వర్గాల ఒత్తిళ్లుకు జీఎస్టీ రేట్లను తగ్గించడం ఇందుకు కారణమని తెలుస్తోంది. నరేంద్ర మోదీ మానసిక పుత్రికా రత్నమైన ‘స్వచ్చ్ భారత్’ లాంటి పథకాల ప్రచారానికి, ఆయన విదేశీ యాత్రలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, వాటిని తగ్గించుకున్నట్లయితే ఇప్పుడు అదనంగా 50 వేల కోట్ల రూపాలను అప్పుగా తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014, జూన్ 15వ తేదీతో ఆయన విదేశీ యాత్రలు ప్రారంభమయ్యాయి. ఆ రోజున ఆయన బూటాన్‌కు వెళ్లినప్పటి నుంచి 2016, నవంబర్ 10వ తేదీ మధ్య ఆయన 27 ట్రిప్పుల్లో 44 దేశాలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విమానాల అద్దెకే 275 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఈ ఏడాది జరిపిన యాత్రల ఖర్చుగానీ, ఆయన బస చేసిన హోటళ్లకు అయిన ఖర్చుగానీ అందుబాటులో లేదు. -
పెరిగిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ద్రవ్యలోటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలానికి బడ్జెట్ అంచనాల్లో 96.1 శాతానికి చేరుకున్నట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాలు వెల్లడించాయి. ఆదాయం తక్కువగా రావడం, వ్యయం పెరగడం వల్ల ద్రవ్యలోటు పెరిగింది. సీజీఏ గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ వ్యయానికి, ఆదాయానికి మధ్య గల వ్యత్యాసం(ద్రవ్యలోటు) ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో రూ.5.25 లక్షల కోట్లకు చేరింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 96.1 శాతానికి సమానం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ.4.2 లక్షలు కోట్లుగా ఉంది. ఇది ఆ సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో 79.3 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటును 3.2 శాతానికి పరిమితం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. తాజా గణాంకాలను చూస్తే.. ఈ లక్ష్య సాధన కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతంగా ఉంది. -
మరింత పెరిగిన ద్రవ్యలోటు
సాక్షి, న్యూడిల్లీ: అక్టోబర్ చివరి నాటికి ద్రవ్య లోటు 2017-18 నాటికి బడ్జెట్ అంచనాలతో పోలిస్తే..ముఖ్యంగా తక్కువ ఆదాయం, వ్యయాల వృద్ధి కారణంగా ఏప్రిల్-అక్టోబర్‌లో ద్రవ్యలోటు రూ. 5.25 లక్షల కోట్లుగా నిలిచింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అక్కౌంట్లు (సీజీఏ) వివరాల ప్రకారం, 2017-18ఏప్రిల్-అక్టోబర్ ద్రవ్యలోటు గత ఏడాది రూ. 4.2లక్షల కోట్లతో పోలిస్తే రూ.5.25లక్షల కోట్లుగా నమోదైంది. నిర్వహణ వ్యయం రూ.12.9లక్షల కోట్లు, ఆదాయ ఆర్జన రూ.7.67లక్షలకోట్లు, రెవెన్యూ గ్యాప్ రూ. 4.0.1 లక్షలకోట్లు పన్ను ఆదాయం రూ.9.7లక్షలకోట్లుగా నిలిచింది. ప్రభుత్వం మొత్తం వ్యయం అక్టోబర్ చివరినాటికి రూ .12.92 లక్షల కోట్లు, లేదా బడ్జెట్ అంచనాలో 60.2శాతంగా ఉంది. మరోవైపు 10శాతం జీడీపీ వృద్ధి సాధించం అతి పెద్ద సవాల్ అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రసంగించిన జైట్లీ గత మూడేళ్లుగా జీడీపీ వృద్ధి 7-9శాతం ఉంటుంది. 10శాతం వృద్ధి సాధించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇది ఒక్క దేశీయ పరిణామాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుందని జైట్లీ తెలిపారు. కాగా 2017-18 నాటికి జిడిపిలో ద్రవ్యలోటును 3.2 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతం లక్ష్యాన్ని సాధించింది. -
రాకెట్లా ఎగిసిన రాష్ట్రాల లోటు
ముంబై : ఆ రెండు రాష్ట్రాలు దేశానికి అత్యంత కీలకం. ఒకటి అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ కాగ, మరొకటి అతిపెద్ద రాష్ట్రం రాజస్తాన్. కానీ వాటి వాణిజ్య లోటులు మాత్రం భారీగా ఎగిశాయి. ఆ రెండు రాష్ట్రాలివే కాక, మిగతా రాష్ట్రాల వాణిజ్య లోటులు కూడా స్కై రాకెట్ లా ఎగిసినట్టు తెలిసింది. 1991 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వాణిజ్య లోటు రూ.18,790కోట్లుంటే, అవి కాస్త, 2016 ఆర్థిక సంవత్సరానికి రూ.4,93,360కోట్లకు పెరిగినట్టు తాజా ఆర్బీఐ డేటా పేర్కొంది. ఆర్బీఐ రెండో ఎడిషన్ గణాంకాల ప్రచురణ ''హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ స్టేట్స్ 2016-17'' కింద ఈ డేటాను ఆర్బీఐ నేడు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాణిజ్య లోటును రూ.4,93,360 కోట్ల నుంచి రూ.4,49,520 కోట్లకు తగ్గించుకోవాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలు తమ బడ్జెట్ లలో అంచనాలు వేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్ వాణిజ్య లోటు 1991లో రూ.3070 కోట్లు ఉండగా.. 2016లో ఇది రూ.64,230కోట్లకు పెరిగింది. అయితే 2017 ఆర్థికసంవత్సరంలో వాణిజ్య లోటు కొంత మెరుగుపరుచుకుని రూ.49,960కోట్లగా ఉంచాలని బడ్జెట్ లో ఆ రాష్ట్రం నిర్ణయించింది. 2016 వాణిజ్యలోటులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. అంతేకాక రాజస్తాన్ స్థూల వాణిజ్య లోటు కూడా 1991 కంటే 2016లో భారీగానే రూ.67,350 కోట్లకు పెరిగింది. దీన్ని లోటును కూడా రూ.40,530 కోట్లకు తగ్గించాలనుకుంటున్నారు.. పట్టణీకరణలోనూ, పరిశ్రమలోనూ ఎక్కువగా అభివృద్ది చెందిన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర వాణిజ్య లోటు కూడా 1991 నుంచి 2016కు బాగానే పెరిగినట్టు తెలిసింది. 1991లో ఈ రాష్ట్ర లోటు రూ.1,020 కోట్లుంటే, 2016లో రూ.37,950 కోట్లగా నమోదైనట్టు ఆర్బీఐ డేటా పేర్కొంది. అయితే ముందటేడాది కంటే ఈ ఏడాది కాస్త మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అత్యంత వేగంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందిన గుజరాత్ లో కూడా లోటు పెరగడం తక్కువేమీ కాదని ఆర్బీఐ పేర్కొంది. ఈ రాష్ట్రంలో 1991లో 1,800 కోట్ల వాణిజ్య లోటు ఉంటే, 2016లో రూ.22,170కోట్లకు తాజా గణాంకాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాణిజ్య లోటు బాగానే పెరిగినట్టు తెలిసింది. ఈ రాష్ట్రంలో 1991లో రూ.970 కోట్ల లోటు ఉంటే, అది కాస్త 2016 నాటికి రూ17,000 కోట్లకు పెరిగినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది కంటే అత్యధిక వాణిజ్యలోటును నమోదుచేసిన రాష్ట్రంగా తమిళనాడు, కర్నాటక, కేరళలు ఉన్నాయి. -
మూడేళ్ల దాకా మూడు శాతం..
► ద్రవ్యలోటు లక్ష్యంపై ఎఫ్ఆర్బీఎం ప్యానెల్ సిఫార్సులు ► 2023 నాటికి 2.5 శాతానికి తగ్గించుకోవాలని సూచన ► కొత్తగా ఆర్థిక మండలి ఏర్పాటుకు సిఫార్సు న్యూఢిల్లీ: ద్రవ్య లోటును 3 శాతానికే పరిమితం చేయాలని ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) కమిటీ సిఫార్సు చేసింది. మూడేళ్లు దీన్ని ఇదే స్థాయిలో కొనసాగించాలని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 3.2 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వార్షిక లక్ష్యాల నిర్దేశానికి కొత్తగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్కే సింగ్ సారథ్యంలోని ఎఫ్ఆర్బీఎం కమిటీ సూచించింది. స్థూల దేశీయోత్పత్తి, రుణ నిష్పత్తిపై మరింతగా దృష్టి సారించాలని సూచించింది. 2023 నాటికి జీడీపీ, రుణ నిష్పత్తి కేంద్రం, రాష్ట్రాలన్నింటికీ కలిపి 60 శాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానిది 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలది 20 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. మూడేళ్ల దాకా 3 శాతం స్థాయిలో, ఆ తర్వాత 2022–23 నాటికి 2.5 శాతానికి తగ్గించాలని సూచించిన ఎఫ్ఆర్బీఎం కమిటీ.. అరశాతం అటూ, ఇటూ మారేందుకు కొంత వెసులుబాటు కల్పించింది. ఏకపక్ష లక్ష్యాలు: సీఈఏ అరవింద్ సుబ్రమణ్యన్ సిఫార్సులతో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ విభేదించారు. నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యాలు ఏకపక్షంగా ఉన్నాయని ఒక నోట్లో వ్యాఖ్యానించారు. వీటికి కట్టుబడి ఉంటే ఎకానమీపై ప్రతికూల ప్రభావాలు తప్పవన్నారు. వీటి కారణంగా విధానకర్తలు వివిధ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాల్సి వస్తుందని, దీంతో మొత్తం ఆర్థిక విధానానికి రిస్కులు ఉంటాయని తెలిపారు. ప్రాథమిక లోటు అయిదేళ్లలో స్థిరంగా తగ్గుముఖం పట్టేలా ఒకే లక్ష్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. -
రూ. 4 లక్షల కోట్లకుద్రవ్య లోటు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ద్రవ్య లోటు రూ. 4.23 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో (బీఈ) ఇది 79.3 శాతం. గతేడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో 74 శాతమే. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు 2016-17లో సుమారు రూ. 5.33 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3.5 శాతం)గా ఉండొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. పన్నుల రూపంలో ఆదాయం రూ. 5.30 లక్షల కోట్లు వచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో (రూ.10,54,101 కోట్లు) ఇది 50.3 శాతం. ఆదాయం, రుణయేతర పెట్టుబడులపై రాబడులు మొదలైనవన్నీ కలిపి ప్రభుత్వానికి తొలి ఏడు నెలల్లో రూ. 7.27 లక్షల కోట్లు వచ్చారుు. ఇక వ్యయాలు (ప్రణాళిక, ప్రణాళికేతర) మొత్తం రూ.11.50 లక్షల కోట్లుగా నమోదయ్యారుు. పూర్తి ఆర్థిక సంవత్సరం వ్యయాలు రూ. 19.78 లక్షల కోట్ల మేర ఉండొచ్చని ప్రభుత్వం అంచనా. -
ద్రవ్యలోటు విధాన సమీక్షకు త్వరలో కమిటీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు లక్ష్య నిర్దేశ విధానాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అసోచామ్ బుధవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు నిర్దిష్టంగా ‘ఇంత’ శాతం ఉండాలన్నది ప్రస్తుత విధానం. ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్ట నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ అమలు జరుగుతోంది. ఇలా ఒకే ఒక్క అంకె కాకుండా- (శాతంలో) దీనికి ఒక శ్రేణిని నిర్దేశించుకునే విధాన రూపకల్పన సాధ్యాసాధ్యాలను ప్రతిపాదిత కమిటీ పరిశీలిస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.9ు. 2016-17లో ఈ లక్ష్యం 3.5%. ఈ లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నారు. -
స్పెక్ట్రమ్ అమ్మకంతో ద్రవ్యలోటు భర్తీ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతానికి కేంద్ర ఆర్థిక మంత్రి పరిమితం చేస్తారన్న అంచనాలను దేశీయంగా ఫిచ్ రేటింగ్స్ అనుబంధ విభాగం- ఇండియా రేటింగ్స్ వెలువరించింది. ఇందుకు స్పెక్ట్రమ్ అమ్మకాలు దోహదపడతాయని సైతం విశ్లేషించింది. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ వెలువరించిన అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... రెవెన్యూ యేతర ఆదాయాల ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇందులో స్పెక్ట్రమ్ అమ్మకాలు ఒకటి. ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వల్ల ఏర్పడే ఆదాయలోటును ఇతర ఆదాయాలు భర్తీ చేస్తాయి.పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం అదనపు వ్యయాలు ఎలా చేయగలుగుతుందన్న అంశాన్ని భారత పరిశ్రమ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం దాదాపు 1.7%కి (జీడీపీలో) పరిమితమవుతున్న మూలధన పెట్టుబడులను 2 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.9%కన్నా అధికంగా 4.1%కి (రూ.5.6 లక్షల కోట్లు) పెంచవచ్చు.ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనానికి బడ్జెటరీ మద్దతు ఒక సవాలే. బాసెల్ 3 ప్రమాణాల అమలుకు 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్య బ్యాంకులకు రూ.3.7 లక్షల కోట్ల మూలధనం అవసరం.మౌలిక రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అయితే పెట్టుబడులకు సంబంధించి కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఉంటుంది. నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకు ఒక వ్యూహం అవసరం.కాలం తీరిన వాణిజ్య వాహనాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడానికి ఒక ‘స్క్రాపింగ్ పథకాన్ని’ బడ్జెట్ తీసుకువచ్చే వీలుంది. పెద్ద కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గించే అవకాశం ఉంది. జీవిత బీమా పరిశ్రమకు ఊతం... దేశాభివృద్ధిలో జీవిత బీమా పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకించి మౌలిక రంగంలో పెట్టుబడులు సమకూర్చడానికి ఈ పరిశ్రమ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రంగం మరింత పురోభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాలన్నింటికీ ఈ రంగం విస్తరించాలి. అందువల్ల 2016-17 బడ్జెట్ ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నా. ముఖ్యంగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పట్ల ఆకర్షణ మరింత పెంచేందుకు ‘డెత్ బెనిఫిట్’ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. 80సీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత 1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడం పొదుపులను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. - అరిజిత్ బసు, ఎస్బీఐ లైఫ్ ఎండీ అండ్ సీఈఓ ఆరోగ్య భద్రతపై దృష్టి... ఆరోగ్య భద్రత విషయంలో లక్ష్యాలు నెరవేరడానికి ఒక సమర్థవంతమైన ప్రణాళిక అవసరం. ఇలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రంగానికి కేటాయింపుల్లో 15 నుంచి 16 శాతం మేర నిరుపయోగంగా మిగిలిపోతోంది. 2011 నుంచీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజా బడ్జెట్ ఈ విషయాన్ని గమనించి సమస్య పరిష్కారం దిశలో చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. ఆరోగ్య సంరక్షణ విషయంలో ముందుగానే ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. ఒక వ్యాధి ముదరకముందే దానిని గుర్తించి, చికిత్స వ్యయ భారాలను తగ్గించే దిశలో ప్రభుత్వం తగిన వ్యూహ రచన చేయాలి. ఈ రంగంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆరోగ్య భద్రతా విభాగంలో తగిన ఫలితాలు రాబట్టవచ్చని భావిస్తున్నాం. - అమీరా షా, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ ఎండీ, సీఈఓ వాహన రంగంలో డిమాండ్ వృద్ధి.. తయారీ, ఉపాధి కల్పన మార్గాల ద్వారా దేశాభివృద్ధిలో వాహన రంగం భాగస్వామ్యం కీలకం. వినియోగదారు సెంటిమెంట్ బలపడ్డానికి, డిమాండ్ మెరుగుదలకు బడ్జెట్ కీలక చర్యలు ప్రకటిస్తుందని భావిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రైసింగ్, పన్ను విధానాలు విభిన్నంగా ఉన్నాయి. ఈ పన్ను వ్యవస్థను సరళీకరించడంపై బడ్జెట్ దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. వ్యాపార పటిష్టత దిశలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు కీలక పాత్ర పోషిస్తుంది. కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు వల్ల పరిశ్రమ సెంటిమెంట్ బలపడుతుందని భావిస్తున్నాం. రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుదలకు తీసుకునే చర్యలు కూడా వాహన పరిశ్రమ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. - జో కింగ్, ఆడీ ఇండియా హెడ్ -
గతవారం బిజినెస్
ఎయిర్టెల్ భారీ విస్తరణ ప్రణాళిక దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మెగా పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. నెట్వర్క్ మెరుగుదల, సర్వీసుల నాణ్యతను పెంచడమే లక్ష్యంగా వచ్చే మూడేళ్లలో రూ.60,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేసింది. టెలికం రంగంలో పోటీ తీవ్రతరమవుతుండటం, కాల్ డ్రాప్ సమస్యపై కేంద్రం కొరడా ఝళిపించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎయిర్టెల్ తాజా ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘మౌలిక’ గ్రూప్ అంతంతే ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ అక్టోబర్‌లో 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 9 శాతం. సెప్టెంబర్‌లో కూడా ఈ గ్రూప్ వృద్ధి రేటు 3.2 శాతం కావడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఎనిమిది పారిశ్రామిక విభాగాల వెయిటేజ్ 38 శాతం. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు వీటిలో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్, స్టీల్ ఉత్పత్తి పేలవ పనితీరు మొత్తం మౌలిక రంగం గ్రూప్ మందగమన స్థితికి కారణమైంది. లక్ష్యంలో 74 శాతానికి ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో మొదటి ఏడు నెలలు గడిచేసరికి 74 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ ద్రవ్యలోటు 4.11 లక్షల కోట్లుగా నమోదయ్యింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గత సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.55 లక్షల కోట్లు మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. ఆర్థికాభివృద్ధికి ‘తయారీ’ ఊపు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్నట్లు సోమవారం వెల్లడైన తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2015-16, జూలై-సెప్టెంబర్) భారత్ 7.4 శాతం ఆర్థికాభివృద్ధిని నమోదుచేసుకుంది. తయారీ, మైనింగ్, సేవా రంగాల చక్కని పనితీరు... మొత్తం ఫలితం పటిష్టతకు కారణమైంది. బ్యాంక్ షేర్లపై ఫండ్స్ మోజు మ్యూచువల్ ఫండ్ మేనేజర్లకు బ్యాంక్ షేర్లపై బాగా గురి కుదురుతోంది. బ్యాంక్ షేర్లలో జోరుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో మ్యూచువల్ ఫండ్ కంపెనీల బ్యాంక్ షేర్ల హోల్డింగ్స్ ఏకంగా రూ.85,376 కోట్లకు చేరాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి. దేశీ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఫండ్! దేశీ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఆర్థిక చేయూతను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.10,000 కోట్ల మూలధనంతో ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ ఫండ్ (ఈడీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నది. ఈ ఫండ్‌ను కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పారిశ్రామికవేత్తలకు బాసటగా నిలువడానికి ఉపయోగిస్తామని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. బంగారం లావాదేవీలకు ఎక్స్ఛేంజ్! దేశీయంగా బంగారం ధర నిర్ణయానికి విదేశాలపై ఆధారపడకుండా ఉండడం లక్ష్యంగా ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్’ ఏర్పాటు ఆలోచనను కేంద్ర ఆర్థికశాఖ ఆవిష్కరించింది. బంగారం ధరల విషయమై అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడాల్సిన పనిలేకుండా ఆభరణాల కొనుగోళ్లు, అమ్మకాలకు వేదికగా ఈ ఎక్స్ఛేంజ్ని మలచాలన్నది కేంద్రం యోచనగా కనిపిస్తోంది. ఏపీలో బ్లూస్టార్ ఏసీల ప్లాంటు! ఏసీల తయారీలో ఉన్న బ్లూస్టార్ దక్షిణాది ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని నిర్ణయించింది. నెల్లూరు జిల్లా తడ వద్ద ఇది ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు కనెక్టివిటీ ప్రయోజనాలు ఉండడమే ఇందుకు కారణం. ప్రపంచ అతిపెద్ద పెన్షన్ ఫండ్‌కు నష్టాలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా పెన్షన్ ఫండ్ అయిన జపాన్ పబ్లి క్ పెన్షన్ ఫండ్‌కు జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు భారీగా నష్టాలొచ్చాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు ఈ ఫండ్‌కు 6,400 కోట్ల డాలర్ల నష్టాలొచ్చాయి. 1.1 లక్షల కోట్ల డాలర్ల విలువైన జపాన్ గవర్నమెంట్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ విలువ ఈ క్వార్టర్లో దాదాపు 6% క్షీణించిందని ఒక నివేదిక వెల్లడించింది. బేస్ రేటు కోతలో విదేశీ బ్యాంకులు టాప్ బేస్ రేటు తగ్గింపులో ప్రై వేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. బేస్ రేటు తగ్గింపులో విదేశీ బ్యాంకులు టాప్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 27 ప్రభుత్వ బ్యాంకులు బేస్ రేటు తగ్గింపు 0.30-0.70% మధ్యలో, 16 ప్రైవేట్ బ్యాంకుల బేస్ రేటు తగ్గింపు 0.25-0.75% మధ్యలో, 26 విదే శీ బ్యాంకుల బేస్ రేటు తగ్గింపు 0.20-1.05% మధ్యలో ఉందని తెలిపారు. డిపాజిట్ రేటు తగ్గించిన ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన కీలక డిపాజిట్ రేటును ప్రస్తుత మైనస్ 0.20 శాతం నుంచి మైనస్ 0.30 శాతానికి తగ్గించింది. ఈ చర్య వల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఈసీబీ వద్ద ఉంచకుండా... ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించే అవకాశం ఉంటుంది. ఈసీబీ బెంచ్‌మార్క్ రీఫైనాన్సింగ్ రేటు (తాను ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీరేటు) చరిత్రాత్మక కనిష్ట స్థాయి 0.05 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. చెన్నై వాహన కంపెనీల కష్టాలు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై ఆటోమొబైల్ కంపెనీలు నెల కాలవ్యవధిలో రెండవసారి ప్లాంట్లను బలవంతంగా మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నైలో ప్లాంట్లను కలిగి ఉన్న ఫోర్డ్, నిస్సాన్, టీవీఎస్, హ్యుందాయ్, రెనో-నిస్సాన్, అశోక్ లే లాండ్ వంటి కంపెనీల్లో కొన్ని ఇప్పటికే వాటి ప్లాంట్లను మూసివేశాయి. ఆన్లైన్ వెడ్డింగ్ మార్కెట్లోకి ఎన్డీటీవీ ఆన్లైన్ వెడ్డింగ్ మార్కెట్ స్పేస్‌లోకి ఎన్డీటీవీ మీడియా గ్రూప్ ప్రవేశించింది. స్పెషల్ ఆకేషన్ పేరుతో ఆన్లైన్ ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త వెంచర్‌కు అమెరికాకు చెందిన సెర్రాక్యాప్ వెంచర్స్ నుంచి పెట్టుబడులు సమీకరించామని ఎన్డీటీవీ తెలిపింది. అయితే ఎంతమొత్తంలో నిధులు సమీకరించిందీ కంపెనీ వెల్లడించలేదు. స్టార్‌లో మా టీవీ విలీనం పూర్తి మా టెలివిజన్ నెట్వర్క్ విలీన ప్రక్రియ పూర్తయినట్లు స్టార్ ఇండియా ప్రకటించింది. మా టెలివిజన్‌కు నెట్‌వర్క్‌కు చెందిన మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా చానల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపక్ మర్డోక్‌కు చెందిన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు చెందిన స్టార్ ఇండియా గ్రూపు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విలీనం అధికారికంగా పూర్తయ్యిందని స్టార్ ఇండియా ప్రకటించింది. డీల్స్.. * ఆన్లైన్ క్లాసిఫైడ్ సంస్థ క్వికర్... రియల్ ఎస్టేట్ పోర్టల్ కామన్‌ఫ్లోర్ డాట్‌కామ్‌ను 10 కోట్ల నుంచి 20 కోట్ల డాలర్ల ధరకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. * బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో 26 శాతం వాటాను కలిగి ఉన్న సన్‌లైఫ్ ఎష్యూరెన్స్ దాన్ని 49 శాతానికి పెంచుకోనున్నది. డీల్ విలువ రూ. 1,664 కోట్లు. * జర్మనీకి చెందిన ఐటీ కన్సల్టింగ్ సంస్థ సెలెంట్ ఏజీను భారత్‌కు చెందిన విప్రో కంపెనీ రూ.518 కోట్ల(7.35 కోట్ల యూరోల)కు కొనుగోలు చేసింది. * నావిగేషన్, ట్రాకింగ్ సొల్యూషన్స్ అందించే మ్యాప్‌మైఇండియా సంస్థలో వ్యూహాత్మక మైనారిటీ వాటాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. * అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తమ సెల్యులార్ టవర్ల వ్యాపారాన్ని ప్రై వేట్ ఈక్విటీ సంస్థలు టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్, టీపీజీ ఏషియాకి విక్రయించనుంది. ఇందుకోసం వచ్చే ఏడాది జనవరి 15 దాకా అమల్లో ఉండేలా నాన్-బైండింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే టిల్మన్, టీపీజీ సంస్థలు ఆర్‌కామ్‌కు చెందిన ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను కూడా కొనుగోలు చేయనున్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 30,000 కోట్లు. * యాప్ ఆధారిత ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ భారత్, చైనాల్లో విస్తరణ కోసం 210 కోట్ల డాలర్ల(సుమారుగా రూ.13,650 కోట్లు) పెట్టుబడులు సమీకరించనున్నది. టైగర్ గ్లోబల్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ స్థాయిలో నిధులు సమీకరించనున్నదని సమాచారం. -
ద్రవ్యలోటు గణాంకాల జోష్
* 363 పాయింట్ల లాభంతో 27,687కు సెన్సెక్స్ * 111 పాయింట్ల లాభంతో 8,374కు నిఫ్టీ * కొనసాగుతున్న కీలక రేట్ల కోత అంచనాలు ద్రవ్యలోటు గణాంకాల జోష్‌తో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. చివరి గంటలో వెల్లువెత్తిన కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోయాయి. ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతానికే పరిమితమైందని ప్రభుత్వం వెల్లడించడం, ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కొనసాగుతుండడం, సకాలంలోనే వర్షాలు కురుస్తాయన్న అంచనాలు, తదితర అంశాల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 27,687 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 8,374 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. పెట్రోల్ ధరలు పెంచడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీల షేర్లు 4% పెరగడం కూడా స్టాక్ మార్కెట్ పెరుగుదలకు దోహదం చేసింది. నిఫ్టీ మళ్లీ 8,300 పాయింట్ల పైన ముగిసింది. ఆర్థిక మంత్రి అదే కోరుకుంటున్నారు.. నిర్దేశించుకున్న లక్ష్యానికంటే కూడా తక్కువ స్థాయిలోనే ద్రవ్యలోటును కట్టడి చేయగలిగామన్న ప్రభుత్వ ప్రకటన సెంటిమెంట్‌ను బలపరచిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లకు, ఆసియా మార్కెట్ పటిష్టంగా ట్రేడవడం తోడవడంతో స్టాక్ మార్కెట్ జోరు పెరిగిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) జిగ్నేశ్ చౌధురి చెప్పారు. వచ్చే నెల 2న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్బీఐ కీలక రేట్లలో కోత విధించాలని తాను కూడా కోరుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం సెంటిమెంట్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ 3.5 శాతం అప్ రిఫైనరీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, బ్యాంకింగ్, ఐటీ, టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. సిటికోలిన్కు ఇన్నోవేటర్ బ్రాండ్‌గా సోమాజిన ఔషధాన్ని భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.5 శాతం పెరిగి రూ. 3,613వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 27షేర్లు లాభపడ్డాయి. గెయిల్ 3.4 శాతం, టాటా పవర్ 3 శాతం, హెచ్డీఎఫ్సీ 2.3 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.9 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.8 శాతం, ఐటీసీ 1.8 శాతం, బజాజ్ ఆటో 1.8 శాతం, ఇన్ఫోసిస్ 1.6%, భెల్ 1.5 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.4%, హిందాల్కో 1.3 శాతం చొప్పున పెరిగాయి. 1,046 షేర్లు లాభాల్లో, 1,046 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,194 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,234 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,23,343 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.202 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.619 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
ప్రచార పటాటోపం
కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వం జిల్లా అంతటా హోర్డింగ్‌లు ఆర్థిక లోటులోనూ వృథా ఖర్చు ప్రచార ఆర్భాటంపై విమర్శల వెల్లువ విశాఖపట్నం: అధికారం చేపట్టి తొమ్మిది నెలలవుతున్నా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలకు, సెమినార్లలో సావనీర్లు విడుదలచేసి పంపిణీకి డబ్బులు మంంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ప్రచారం పేరుతో వృథా ఖర్చు ప్రారంభించారు. జిల్లాలో ఏ మూలకెళ్లినా బాబు ప్రచార హోర్డింగ్‌లే కనిపిస్తున్నాయి. బస్సులపైనే కాదు..బస్షెల్టర్లు, ప్రధాన,మారుమూల కూడళ్లలో సైతం భారీ హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ ప్రచార హోర్డింగ్‌ల కోసం ఒక్క విశాఖ జిల్లాలోనే అక్షరాల కోటిన్నర ఖర్చు చేస్తున్నారు. ఇక రాష్ర్టవ్యాప్తంగా ఎన్ని కోట్లు ఈ రూపంలో తలగేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ర్టంలో రైతులకు రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా మొదటివిడతలో కేవలం నాలుగున్నరవేల కోట్లతో సరిపెట్టింది. రెండోవిడత కోసం బడ్జెట్లో మరో 5వేల కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ రెండువిడతల్లో 82.66లక్షల మందిరైతులకు రుణవిముక్తి కల్పించినట్టుగా ప్రచార హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇవేకాదు..ఇలాంటి లేనిగొప్పలు చెప్పుకుంటూ వెలిసిన హోర్డింగ్‌ల పట్ల సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 544 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. సుమారు 2,75,980 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల కోసం రూ.89,42,690లు ఖర్చు చేస్తున్నారు. ఇక సుమారు 160 బస్షెల్టర్లలో 36,557 చదరపు అడుగుల హోర్డింగ్‌ల కోసం రూ. 52,51, 570 ఖర్చు చేస్తున్నారు. ఇలా ప్రచారహోర్డింగ్ల కోసం ఏకంగా కోటి 41 లక్షల 94 వేల 260 చెల్లించాలని ప్రతిపాదించారు. ఈ విధంగా రాష్ర్ట వ్యాప్తంగా 13 జిల్లాల్లో తమ ప్రభుత్వ గొప్పతనం ప్రచారం కోసం సర్కార్ అక్షరాల రూ.20కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఇక బస్సులపై ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల కోసం మరో నాలుగైదు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రచారార్భాటం కోసం గత నెలలో జిల్లాకు మూడు ప్రచార రథాలను కేటాయించారు. ఒక్కొక్క రథం ప్రతీరోజు రెండు గ్రామాలను సందర్శించే విధంగా డిజైన్ చేసిన ఈ కార్యక్రమం కోసం రాష్ర్టంలో రూ.4కోట్ల వరకు ఖర్చు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ హోర్డింగ్‌ల పేరుతో మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక లోటు సాకుతో ట్రెజరీ ద్వారా చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించిన ప్రభుత్వం బొటాబొటీగా జీతభత్యాలు మాత్రమే చెల్లిస్తూ మిగిలిన చెల్లింపులకు సవాలక్ష కొర్రీలు వేస్తోంది. ట్రెజరీల్లో వందల కోట్లకు చెందిన వేలసంఖ్యలో బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ప్రచారం కోసం ఈ వృథా ఖర్చు లెందుకని విపక్షాలు.. మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
రానున్న నెలా అరకొరే..
రూ.100కోట్లే చెల్లింపులు మరో రూ.90 కోట్లకు బ్రేకులు హుద్‌హుద్ సాయంపై ప్రభావం అడ్వాన్స్ జీతభత్యాలకు నో పేరుకుపోయిన వెయ్యికి పైగా బిల్లులు.. ట్రెజరీలో కొనసాగుతున్న ఆంక్షలు ఆర్థికలోటు సాకుగా చూపి ట్రెజరీ ద్వారా చెల్లింపులపై విధించిన నిషేధం అభివృద్ధి పనులతో పాటు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. చెల్లింపులపై ఫ్రీజింగ్ ఉంది ఏం చేయలేం అంటూ ట్రెజరీ అధికారుల చేతులెత్తేస్తుండడంతో వందల్లో బిల్లులు పేరుకు పోతున్నాయి.. వందల కోట్ల చెల్లింపు లకు బ్రేకులు పడుతున్నాయి. విశాఖపట్నం: ట్రెజరీ ద్వారా చెల్లింపులపై గతనెల 26న ప్రభుత్వం నిషేధం విధించింది. ఫిబ్రవరి మొదటి వారంలో జీతభత్యాలు, ఫింఛన్ల చెల్లింపులకు మినహాయింపు ఇచ్చినా.. వచ్చిన ప్రతీ బిల్లుకూ ఏదో ఒక సాకుతో చె ల్లింపులకు బ్రేకులేస్తూనే ఉన్నారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యా యులు 40వేలమంది ఉండగా, 12వేల మంది వరకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. సుమారు 25వేల మంది పింఛన్ దారులున్నారు. జీతభత్యాల రూపంలో ఉద్యోగులకు రూ.115కోట్లు, అవుట్సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందికి రూ.15కోట్లు చెల్లిస్తుండగా, పింఛన్ దారులకు రూ.60కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. అంటే సుమారు రూ.190కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉండగా, నిషేధం సడలించినప్పటికీ జనవరి నెలకు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు కేవలం రూ.100కోట్ల లోపే. మరో 90కోట్ల చెల్లింపులకు బ్రేకులుపడ్డాయి. ఇక హుద్‌హుద్ సాయం కింద రూ.320కోట్ల మేర పరిహారం విడుదల కాగా, ఇప్పటి వరకు 80శాతం వరకు బ్యాంకులకు జమయ్యాయి. రూ.30కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. వీటిలో గృహాల డామేజ్ కింద మంజూరైన సొమ్ములో రూ.17కోట్లు, మత్స్యశాఖ పరిధిలో రూ.3.50కోట్లు, పశుసంవర్ధకశాఖ పరిధిలో మరో రూ.10కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. పంపిణీ సమయంలోనే నిషేధం అమలులోకి రావడంతో ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. 13వ ఆర్థిక సంఘ నిధులతో పాటు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతీనెలా రూ.150కోట్ల మేర చెల్లింపులు జరుగుతుంటాయి. వీటి విషయంలోనూ నిషేధం ఆంక్షలు ప్రతిబంధకంగా మారాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే హుద్‌హుద్ సమయంలో రేయింబవళ్లు శ్రమించిన జిల్లా పరిధిలోని వివిధశాఖల ఉద్యోగులకు అడ్వాన్స్ బేసిక్‌పే ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. ఈమేరకు జీవో కూడా జారీ చేసింది. దీంతో ఉద్యోగుల బేసిక్ ప్రకారం రూ.27కోట్ల మేర చెల్లింపుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి నివేదించగా జీవో జారీ చేసిన ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. డబ్బులున్నప్పుడు చూద్దాంలే అంటూ పక్కన పెట్టేసిందని అధికార వర్గాలే చెబుతున్నాయి. జీతభత్యాలు, పింఛన్లు, పే అలవెన్సెస్, గ్రాట్యుటీ, పింఛన్‌దారుల మెడికల్ రీయింబర్సుమెంట్,ఎ్ఫ్టీఏ కన్వీనియన్స్, కాస్మోటిక్స్, సీక్రెట్ సర్వీసెస్ ఖర్చులు(పోలీస్), ప్యూనరల్ చెల్లింపులకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఏదో ఒక వంకతో చెల్లింపులకు బ్రేకులేస్తూనేఉన్నారు. జిల్లా ట్రెజరీలోనే ఏకంగా 300కుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉండగా, ఇక సబ్ ట్రెజరీకార్యాలయాల్లో పేరుకుపోయిన చెల్లింపులన్నీ కలుపుకుంటే వెయ్యికిపైగానే ఉంటాయని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిశాక చెల్లింపులపై విధించిన నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందా అంటే అదే డౌటేనని అధికారులంటున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కనుగుణంగా జరిపే చెల్లింపులను బట్టీ నిషేధం ఎత్తివేత ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా మార్చిలో కూడా ఇదే రీతిలో నిషేధం కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది కూడా అరకొర గానే జీతాల చెల్లింపులు జరుగుతాయన్న వాదన వ్యక్తమవుతోంది. -
అంచనాలు మించనున్న ద్రవ్యలోటు
⇒ఇప్పటికే బడ్జెట్ లక్ష్యంలో 99% చేరిక ⇒నవంబర్ వరకూ పరిస్థితిపై గణాంకాలు న్యూఢిల్లీ: కేంద్ర ద్రవ్య పరిస్థితి క్లిష్టతను సూచిస్తూ ‘లోటు’ గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఏప్రిల్-నవంబర్ మధ్య ద్రవ్యలోటు రూ.5.25 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యంలో (రూ.5.31 లక్షల కోట్లు) ఈ పరిమాణం ఇప్పటికే దాదాపు 99 శాతానికి చేరినట్లయ్యింది. ఆర్థిక సంవత్సరంలో ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే ద్రవ్యలోటు 99 శాతానికి చేరిపోవడం స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి చర్చనీయాంశం. గత ఏడాది ఇదే నెలకు ద్రవ్యలోటు 93.9 శాతంగా ఉంది. కేంద్రానికి ఒక నిర్దిష్ట ఏడాదిలో వచ్చే మొత్తం ఆదాయం-చేసే వ్యయం మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటాం. రెవెన్యూ భారీగా తగ్గడమే తాజా పరిస్థితికి కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.9.77 లక్షల కోట్ల నికర పన్ను వసూళ్లను బడ్జెట్ అంచనా వేసింది. అయితే నవంబర్ నాటికి ఈ మొత్తం రూ.4.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజాగా ఈ గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటును 4.1 శాతం (రూ.5.31 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికే ఈ పరిమాణం 98.9 శాతానికి చేరడంతో లక్ష్యసాధన కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2013-14లో జీడీపీలో ద్రవ్యలోటు 4.5 శాతం (రూ.5.08 లక్షల కోట్లు). 2012-13లో ఇది 4.9 శాతంగా ఉంది. -
అర్హులకే సబ్సిడీ ప్రయోజనం: జైట్లీ
సబ్సిడీలను హేతుబద్ధం చేసేందుకు త్వరలో కమిషన్ ఏర్పాటు న్యూఢిల్లీ: సబ్సిడీలను హేతుబద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులకే సబ్సిడీ ప్రయోజనాలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకొనబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రైతులకు సబ్సిడీ అంశంపై శుక్రవారం లోక్‌సభలో ఒక అనుబంధ ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.1 శాతానికి ద్రవ్యలోటును నియత్రించడం చాలా కష్టసాధ్యమని, అందుకోసం సబ్సిడీల ఖర్చను తగ్గించుకోవాలన్నారు. సబ్సిడీలను హేతుబద్ధం చేసేందు కు మరికొన్ని రోజుల్లో వ్యయ నిర్వహణా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, సబ్సిడీల భారం పెరగకుండా చూడడమే వ్యయ నిర్వహణా కమిషన్ ప్రధాన బాధ్యతల్లో ఒకటని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి కమిషన్ తన నివేదిక సమర్పించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. భారతీయ ఉత్పత్తులు మార్కెట్లో పోటీ పడాలంటే పన్నుల విధానాన్ని హేతుబద్ధం చేయాలన్నారు. ఖనిజవాయువు ధర పెరిగిన తర్వాత పెరగబోయే యూరియా ధర భారా న్ని వినియోగదారులకు బదిలీ చేయబోతున్నారా? అన్న ప్రశ్న ఊహాజనితమని అన్నా రు. విద్యుత్ రాష్ట్రాలకు సంబంధించిన అంశంకాబట్టి, తగిన స్థోమత ఉన్న రాష్ట్రాలు వ్యవసా యానికి సబ్సిడీ ఇవ్వవచ్చన్నారు. మరోవైపు ఆహార భద్రత కోసం సంవత్సరానికి రూ.1,31,086కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. మరోపక్క వ్యవసాయ రంగానికి సంబంధించి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని లోక్‌సభలో ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పంటలకు కనీస మద్దతుధర నిర్ధారణ ప్రక్రియను సమీక్షించి, మార్పులు చేయాలని ఎంపీలు కోరారు. -
పెనం మీంచి పొయ్యిలోకి...
ద్రవ్యలోటు అదుపే పరమ పవిత్ర లక్ష్యంగా పెట్టుకుని ఉపాధి కల్పన, ప్రజా ప్రయోజనకర ప్రభుత్వ వ్యయాలలో కోతలు విధిస్తూ పోతుంటే ఆర్థిక వృద్ధి ఎలా పుంజుకుంటుంది? ఉపాధి అవకాశాలు ఎలా విస్తరిస్తాయి? ప్రజల కొనుగోలు శక్తి పెరగనిదే వ్యవసాయ, తయారీ వస్తు గిరాకీ ఎలా పెరుగుతుంది? ఎనిమిది శాతం వృద్ధి రేటు ఎలా అందుకుంటారు? పదేళ్ల యూపీఏ పాలనలో చితికి పోయిన ప్రజలకు ‘మంచి రోజులు’ తెస్తామనే వాగ్దానాలతో బీజేపీ ప్రభుత్వం అందలమెక్కింది. అది ప్రవేశపెట్టిన తొలి బడ్టెట్ ఆ ‘మంచి రోజుల’ కోసం కనీసం మరో మూడు నాలుగేళ్లు, కనీసం 2016-2017 బడ్జెట్ వరకు పడిగాపులు పడాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 4.7 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును (జీడీపీ) 7 నుంచి 8 శాతానికి చేర్చడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. వృద్ధి రేటు పుంజుకునే వరకు ఉపాధి కల్పన వృద్ధి నత్తనడకన సాగక తప్పదని ఆయన అనలేదు. కానీ ఆయన బడ్జెట్లోని ప్రాధాన్యాలను జాగ్రత్తగా గమనిస్తే అదే దాని అసలు సారాంశమని వెల్లడవుతుంది. ప్రాధాన్యం కోల్పోయిన ఉపాధి భారత్ ఉపాధి రహిత వృద్ధి సమస్యను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్ధిక మందగమనం వలన 2011లో 3.5 శాతంగా ఉన్న దేశ నిరుద్యోగిత వృద్ధి రేటు 2012లో 3.6 శాతానికి, 2013లో 3.7 శాతానికి పెరిగింది. 2014లో 3.8 శాతానికి పెరుగుతుందని అంచనా. 18-59 వయో బృందంలోని యువత నైపుణ్యతలున్నా నిరుద్యోగానికి ఎక్కువగా గురవుతున్నారని ఐఎల్ఓ ఆందోళన వెలిబుచ్చింది. 15-59 వయస్కులైన ఉద్యోగులలో 21.2 శాతానికి (2011-12) మాత్రమే క్రమబద్ధమైన వేతన ఉపాధిని కలిగినవారని ఆ సంస్థ తెలిపింది. దేశంలోని మొత్తం కార్మిక జనాభాలో 94 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారనేది మరింత ఆందోళనకరమైన వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథ కానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడం సముచితం. కానీ ‘మంచి రోజులు’ తెస్తానన్న కొత్త ప్రభుత్వం తాత్కాలిక ఉపాధితో ఊరట కల్పించే ఆ పథకానికి సైతం గండి కొట్టింది. యూపీఏ ప్రభుత్వం 2012-13, 13-14 బడ్జెట్లలో ఎలాంటి మార్పూ లేకుండా రూ. 33,000 కోట్ల రూపాయలను కేటాయించింది. జైట్లీ అతి ఉదారంగా దాన్ని రూ. 34,000 కోట్లకు పెంచామంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను, జనాభాను దృష్టిలో ఉంచుకుంటే 2012తో పోలిస్తే జైట్లీ వాస్తవంగా ఉపాధి హామీ కేటాయింపులకు భారీ కోత విధించినట్టే అవుతుంది. అరకొర నిధులతో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నామని అనిపించుకోడానికి విఫలయత్నం చేశారు. ద్రవ్యలోటు తగ్గింపే ప్రధాన లక్ష్యం ఇదంతా జైట్లీ ద్రవ్యలోటు తగ్గింపునకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ఫలితం. 2011-12లో జీడీపీలో 5.7 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2013-14 నాటికి 4.5 శాతానికి తగ్గింది. ఈ తగ్గుదలంతా ప్రభుత్వ వ్యయాల్లో విధించిన కోతల వల్ల సాధించినదేననీ, ప్రభుత్వ రాబడి పెరుగుదల వల్ల కాదనీ జైట్లీయే చెప్పారు. సరిగ్గా ఈ 2012-14 మధ్య కాలంలోనే ఆందోళనకరమైన స్థాయిలో మన జీడీపీ వృద్ధి మందగించింది. 2010-11లో 9.3 శాతంగా ఉన్న వృద్ధి 2012-13లో 6.2 శాతానికి, 2013-14లో 4.5 శాతానికి పడిపోయింది. కాబట్టి 2012-14 మధ్య కాలంలోనే ప్రభుత్వ వ్యయాల కోతల వల్ల ద్రవ్యలోటు తగ్గడమే అదే కాలంలో వృద్ధి రేటు ఆందోళనకరంగా పడిపోవడానికి ఒక ప్రధాన కారణమని అనిపించడం పొరపాటు కాదు. 2014-15లో ద్రవ్యలోటును 4.1 శాతానికి, 2015-16లో 3.6 శాతానికి పరిమితం చేస్తామని ఆర్థిక మంత్రి అంటున్నారు. అంటే ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కిస్తామంటూ యూపీఏ లాగే దేశాన్ని మరింత మాంద్యంలోకి నెట్టే మార్గాన్ని ఎంచుకున్నారు. ద్రవ్యలోటు అదుపే పరమ పవిత్ర లక్ష్యంగా పెట్టుకుని ఉపాధి కల్పన, ప్రజా ప్రయోజనకర ప్రభుత్వ వ్యయాలలో కోతలు విధిస్తూ పోతుంటే ఆర్థిక వృద్ధి ఎలా పుంజుకుంటుంది? ఉపాధి అవకాశాలు ఎలా విస్తరిస్తాయి? మోడీ మార్కు ‘హరిత విప్లవం’ పాలకుల నిరాదరణతో, వరుస ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర సంక్షోభంలో పడ్డ వ్యవసాయరంగంపై సబ్సిడీల కోతలు పడనున్నాయి. ఈ బడ్జెట్ ప్రకటించిన నూతన యూరియా విధానం ప్రకారం యూరియా సబ్సిడీలకు చరమ గీతం పాడేయనున్నారు. ఈ వార్త వెలువడటంతోనే ఫెర్టిలైజర్ పరి శ్రమ షేర్ల ధరలు ఎగిరి గంతులేశాయి. ఆ పరిశ్రమాధిపతులు దీన్ని స్వాగతించారు. సాగు బరువై రోజురోజుకూ అప్పులతో కుంగిపోతున్న చిన్న, సన్న, సాధారణ రైతాంగానికి ఇది మరో పెద్ద దెబ్బ. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం మరో హరిత విప్లవాన్ని ప్రకటించింది. ఇది మొత్తంగా రైతాంగాన్ని దివాలా తీయించి, ఆహార ధరలను స్పెక్యులేటర్ల చేతుల్లో పెట్టే కార్పొరేట్ వ్యవసాయమేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత దీనావస్థలో ఉన్నా నేటికీ ప్రధాన ఉపాధి రంగంగా ఉన్నది వ్యవసాయరంగమే. కార్పొరేట్ వ్యవసాయ విస్తరణతో పాటే గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం అనివార్యం. మరో హరిత విప్లం కోసం ‘‘వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాల సృష్టి అంటే... వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, ట్రాక్టర్ల రంగ ప్రవేశమే. దీంతో వ్యవసాయ కార్మికుల అవసరం తగ్గిపోతుంది’’ అని ఢిల్లీకి చెందిన ఒక విధాన విభాగ కేంద్రం డెరైక్టర్ యామినీ అయ్యర్ ‘మింట్’ పత్రికలో రాశారు. అదే విషయాన్ని ఆర్థిక మంత్రి ఇలా సెలవిచ్చారు; ‘‘వ్యవసాయ సాంకేతిక వృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెంచాల్సిన తక్షణ అవసరం ఉంది. వ్యవసాయ వాణిజ్య రంగంలోని మౌలిక వసతులను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.’’ ప్రభుత్వ వ్యయాల్లో కోతలు విధిస్తూ వ్యవసాయ రంగంలోని ప్రభు త్వ పెట్టుబడుల పెంపుదల గురించి మాట్లాడడం విచిత్రం. అసలు సంగతి ప్రైవేటు పెట్టుబడులకు, కార్పొరేట్ వ్యవసాయానికి ప్రో త్సాహమే. వ్యవసాయ సబ్సిడీల ఉపసంహరణ, ఉపాధి హామీకి తూట్లు వంటి చర్యలు చేపడుతూ 4 శాతం వ్యవసాయ వృద్ధి లక్ష్యం గా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే కార్పొరేట్ వ్యవసాయం ద్వారా ఉపాధి రహిత వృద్ధిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయడమే. కార్పొరేట్ కుబేరులకు, స్పెక్యులేటర్లకు పండుగ దశాబ్దాల తరబడి యావత్ భారత ప్రజల శ్రమ, ధనాదులను వెచ్చించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన ప్రభుత్వ రంగ పరిశ్రమల ఆస్తులను కార్పొరేట్ కుబేరులకు కట్టబెట్టే ప్రయత్నం ఈసారి కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా సుమారు రూ. 63,425 కోట్ల రాబడిని ఆశిస్తున్నారు. ఇది గత ఏడాది యూపీఏ అమ్ముకున్న వాటాల విలువ (రూ.25,841 కోట్లు) కంటే 145 శాతం ఎక్కువ! పొదుగు కోసి పాలు తాగే విద్యలో యూపీఏ కంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎన్డీయే బడ్జెట్ చాటి చెప్పింది. జూలై 10న బడ్జెట్ సమర్పిస్తుండగానే షేర్‌మార్కెట్ స్పెక్యులేటర్లు (మాయా జూదర్లు) తొలుత షేర్ల విలువను పడగొట్టి, ఆ తదుపరి ఎగదోసి రెండు చేతులా చేసుకున్న లాభాల పండగే బడ్జెట్ దిశకు సరైన సూచిక కావచ్చు. చివరకు షేర్ల విలువతో గరిష్టంగా లబ్ధిని పొందిన రంగాలను బట్టే ఈ బడ్జెట్ అసలు స్వభావం వెల్లడవుతుంది. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రంగాలు భారీగా లాభపడ్డాయి. షేర్ మార్కెట్ జూదంతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచలేరు. వ్యవసాయ, వస్తుతయారీ రంగాలలోని వస్తు గిరాకిని పెంచలేరు. అది జరగనిదే నిజమైన పారిశ్రామిక వృద్ధి సాధ్యం కాదు. జైట్లీ దేశ ఆర్థిక రంగం పగ్గాలను షేర్ మార్కెట్ జూదర్లుగా మారిన కార్పొరేట్ అధిపతులకు అప్పగించి... మంచి రోజులు తెస్తారని ఆశించి అధికారం కట్టబెట్టినవారి కోసం అట్టహాసంగా 29 పథకాలు ప్రకటించారు. 120 కోట్ల జనాభా గల దేశంలో ఒక్కో పథకానికి ముచ్చటగా రూ. 100 కోట్లు కేటాయించారు. ఆ మెతుకులు ఏరుకుంటూ మరో నాలుగేళ్లు గడిపేస్తే బొందితోనే స్వర్గానికి చేర్చేస్తాం ఎదురు చూడమని తేల్చి చెప్పారు. (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) - డి.పాపారావు -
ఫలితాలతో దిశా నిర్దేశం
న్యూఢిల్లీ: ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితమైనప్పటికీ జనవరి-మార్చి(క్యూ4) ఫలితాలు, మార్చి నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ల దిశను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం(14న) బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లకు సెలవు ప్రకటించ గా, గుడ్‌ఫ్రైడే కారణంగా శుక్రవారం(18న) సైతం మార్కెట్లు పనిచేయవు. కాగా, మంగళవారం(15న) సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలను ప్రకటించనుంది. ఈ బాటలో 16న టీసీఎస్, మైండ్‌ట్రీ, 17న విప్రో, హెచ్‌సీఎల్ టెక్ క్యూ4 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆయిల్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 18న ఫలితాలను ప్రకటించనుంది. ఐటీ సేవల సంస్థ సీఎంసీ మరింత ముందుగా అంటే 14న 2013-14 ఏడాది ఫలితాలను వెల్లడించనుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్ 15న, జీఎస్కే ఫార్మా 17న క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయి. వెరసి సమీప కాలానికి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు మార్కెట్ల నడకపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం ఎఫెక్ట్ మంగళవారం వెల్లడికానున్న ఇన్ఫోసిస్ ఫలితాలతో సీజన్ ఊపందుకోనుండగా, అదే రోజు ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. మార్చి నెలకుగాను ఓవైపు టోకు ధరల(డబ్ల్యూపీఐ), మరోవైపు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ రెండు అంశాల నేపథ్యంలో ట్రేడింగ్ మొదలుకానున్న మంగళవారానికి ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు వివరించారు. వీటికితోడు మార్కెట్లు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టాయని తెలిపారు. మే నెల 12తో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్న సంగతి తెలిసిందే. 6,800 కీలకం ఇన్ఫోసిస్ ఫలితాలకుతోడు, ద్రవ్యోల్బణ గణాంకాలు ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు నిధి సరస్వత్ అభిప్రాయపడ్డారు. విదేశీ సంకేతాలు, ఎన్నికల ఫలితాలు కూడా సమీప కాలానికి మార్కెట్లపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపుతాయని అంచనా వేశారు. రానున్న కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,800 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనుందని చెప్పారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేశారు. రూపాయి కదలికలూ ఎఫ్ఐఐల పెట్టుబడుల ధోరణి, అంతర్జాతీయ అంశాలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు పేర్కొన్నారు. ఈ వారం మొత్తానికి మంగళవారంనాటి ట్రేడింగ్ కీలకంగా నిలవనుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇన్ఫోసిస్ ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ట్రేడర్లు స్పందిస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని సూచించారు. ఇటీవల కొంత పుంజుకున్న పారిశ్రామికోత్పత్తి మళ్లీ నీరసించడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) మైనస్ 1.9%కు చేరిన విషయం విదితమే. అయితే గడిచిన వారం చివర్లో మార్కెట్లు కొంతమేర మందగించినప్పటికీ... ప్రామాణిక సూచీ సెన్సెక్స్ మొత్తంగా 269 పాయింట్లు లాభపడి 22,629 వద్ద ముగియడం విశేషం! ఎఫ్ఐఐల జోష్... న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ (ఏప్రిల్ 11) నికరంగా రూ. 7,764 కోట్ల(130 కోట్ల డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు దోహదపడుతున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 29,960 కోట్లకు(దాదాపు 5 బిలియన్ డాలర్లు) చేరాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. కొత్త ప్రభుత్వం సంస్కరణల అమలును వేగవంతం చేస్తుందన్న అంచనాలకుతోడు, ఆర్థిక వ్యవస్థ మరిం త పుంజుకుంటుందన్న ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయన్నారు. రానున్న కాలంలోనూ విదేశీ పెట్టుబడుల జోష్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. బ్లూచిప్స్ జోరు ముంబై: మార్కెట్ల జోరుకు నిదర్శనంగా టాప్-10 బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ కూడా పెరుగుతోంది. వెరసి సెన్సెక్స్‌లో భాగమైన ఏడు దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) గత వారం లో మొత్తంగా రూ. 28,234 కోట్లమేర ఎగసింది. వీటిలో కోల్ ఇండియా, ఎస్బీఐ ముందువరుసలో ఉన్నాయి. అయితే ఓఎన్జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్ విలువ క్షీణించింది. కోల్ ఇండియా మార్కెట్ విలువ రూ. 6,980 కోట్లు పెరిగి రూ. 1,85,101 కోట్లకు చేరగా, ఎస్బీఐ మార్కెట్ విలువకు రూ. 6,723 కోట్లు జమయ్యి రూ. 1,48,889 కోట్లను తాకింది. ఈ బాటలో టీసీఎస్ విలువ రూ. 4,730 కోట్లు పుంజుకోగా, హెచ్డీఎఫ్సీ రూ. 3,519 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2,890 కోట్లు, ఆర్ఐఎల్ విలువ రూ. 2,795 కోట్లు చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ మార్కెట్ విలువలో రూ. 4,662 కోట్లమేర కోతపడగా, ఇన్ఫోసిస్ విలువ రూ. 4,574 కోట్లు క్షీణించింది. -
పన్ను లక్ష్యాన్ని సాధించాలి
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లపై ఆర్థికమంత్రి పి.చిదంబరం సోమవారం ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల చీఫ్ కమీషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చితే 19% అధికంగా రూ.6.68 లక్షల కోట్ల స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 12.33% వృద్ధితో రూ.4.81 లక్షల కోట్ల స్థూల వసూళ్లు జరిగాయి. ఇక పరోక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్-నవంబర్ మధ్య 5% వృద్ధితో రూ.3.07 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
ద్రవ్యలోటును కట్టడి చేస్తాం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు లోపు కట్టడి చేయగలమని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తాజాగా స్పష్టం చేశారు. 4.8% దాటి తే ఆందోళనకరమని, అయితే దీనిని దాటబోమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ నవంబర్ చివరికి బడ్జెట్ అంచనాల్లో 94%కు ద్రవ్యలోటు చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ చిదంబరం డిసెంబర్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, వెరసి లోటు తగ్గుముఖం పడుతుందని వివరించారు. డిసెంబర్లో ముందస్తు పన్ను చెల్లింపులు వసూలుకావడంతోపాటు, ప్రభుత్వ వ్యయాలు క్షీణిస్తాయని చెప్పారు. దీంతో ద్రవ్యలోటుకు కళ్లెం పడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బాటలో 2016-17కల్లా 3%కు తగ్గించాలని భావిస్తోంది. గడిచిన ఏడాది (2012-13)లో లోటు 4.9%గా నమోదైన సంగతి తెలిసిందే. కష్టమే... ఆదాయాలు క్షీణించడం, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో ద్రవ్యలోటును కట్టడి చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశంగా నిలవనుంది. లోటు కట్టడికి ప్రణాళికా వ్యయాలను రూ. లక్ష కోట్లమేర ప్రభుత్వం తగ్గించుకోవలసి ఉంటుంది. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 40,000 కోట్ల సమీకరణ లక్ష్యం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 3,000 కోట్లను సమకూర్చుకోగలిగింది. ఏప్రిల్-నవంబర్’13 కాలంలో ద్రవ్యలోటు రూ. 5,09,557 కోట్లకు చేరింది. ఇది వార్షిక లక్ష్యంలో దాదాపు 94%కాగా, గతేడాది ఇదే కాలానికి 80% స్థాయిలో లోటు నమోదైంది. ఈ ఏడాదికి ఆదాయాలు, వ్యయాల మధ్య లోటును రూ. 5,42,499 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
5.2 శాతానికి ద్రవ్యలోటు: క్రిసిల్
ముంబై: ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య వ్యత్యాసం(ద్రవ్యలోటు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.2 శాతానికి చేరే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం పేర్కొంది. ద్రవ్యలోటును తగ్గించడానికి భారీ ప్రభుత్వ రంగ కంపెనీలు అధిక డివిడెండ్‌ను చెల్లించాలన్న ప్రతిపాదన సరైనదేనని క్రిసిల్ అభిప్రాయపడింది. ఇది ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా వినియోగపడుతుందని వివరించింది. ప్రభుత్వం ద్రవ్యలోటును 4.8% వద్ద కట్టడి చేయాలని భావిస్తున్నప్పటికీ రెవెన్యూ వృద్ధిలో మందగమనం వల్ల ఈ లోటు 5.1 శాతానికి పెరిగే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ ఇప్పటికే అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) రూ.4.57 లక్షల కోట్లకు చేరినట్లు (బడ్జెట్ లక్ష్యంలో 84%) ఇటీవలి గణాంకాలు వెల్లడించాయి. 2013-14 స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటును రూ.5.42 లక్షల కోట్ల వద్ద (4.8%) కట్టడి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2012-13లో ద్రవ్యలోటు 4.9%గా నమోదయ్యింది. -
క్యూ2 వృద్ధికి వర్షాల ఊతం
న్యూఢిల్లీ: మెరుగైన వర్షపాతం, పారిశ్రామికోత్పత్తి, వినియోగ వ్యయాలు పెరగడం తదితర సానుకూల అంశాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి మెరుగుపడొచ్చని డాయిష్ బ్యాంక్, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) సంస్థలు వేర్వేరు నివేదికల్లో అంచనా వేశాయి. క్యూ2లో వృద్ధి 5.5 శాతంగా ఉండొచ్చని డాయిష్ బ్యాంక్ లెక్కగట్టగా, ఇది 4.5 శాతం మేర ఉండొచ్చని డీఅండ్‌బీ పేర్కొంది. ముందుగా పెద్ద ఆశావహమైన అంచనాలు లేకపోయినప్పటికీ.. పలు సానుకూల అంశాల వల్ల క్యూ2లో ఏడాది కాలంలోనే అత్యుత్తమ వృద్ధి నమోదు కాగలదని భావిస్తున్నట్లు డాయిష్ బ్యాంక్ వివరించింది. పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, సేవా రంగం మందగించడం కారణాలతో.. తొలి త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి కేవలం 4.4 శాతానికే పరిమితం అయింది. గత 17 త్రైమాసికాల్లో ఇది కనిష్టం. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఏకంగా పదేళ్ల కనిష్టమైన 5 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే. మెరుగుపడుతున్నా.. కొంత బలహీనం పారిశ్రామికోత్పత్తి ధోరణిని బట్టి చూస్తే.. సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక రంగం కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. క్యూ2లో పారిశ్రామిక రంగ వృద్ధి 1.8 శాతంగా ఉండొచ్చని తెలిపింది. క్రితం త్రైమాసికంలో ఇది 0.9 శాతంగా ఉంది. ఇక మొత్తం సర్వీసుల రంగం రెండో త్రైమాసికంలో 7 శాతం మేర వృద్ధి చెందవచ్చని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. క్రితం త్రైమాసికంలో ఇది 6.2 శాతంగా నమోదైంది. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ద్రవ్య లోటు తగ్గొచ్చని డాయిష్ బ్యాంక్ వివరించింది. అటు, మిగతా త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి బలహీనంగానే ఉండొచ్చని డీఅండ్‌బీ పేర్కొంది. ఇప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండటం, ద్రవ్యలోటు అధికంగానే ఉండటం, తయారీ రంగం కోలుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తాయని తెలిపింది. భారీ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇవి ఫలితాలిచ్చేందుకు సమయం పడుతుందని డీఅండ్‌బీ ఇండి యా సీనియర్ ఎకానమిస్టు అరుణ్ సింగ్ చెప్పారు. ఇవి ఎంతమేరకు వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపగలవో కూడా చూడాల్సి ఉంటుందన్నారు. 62.60కు రుపీ... ఇక రూపాయి విషయానికొస్తే.. దేశీ కరెన్సీ మారకం విలువ నవంబర్‌లో 62.60-62.80 మధ్య తిరుగాడవచ్చని డీఅండ్‌బీ అంచనా వేసింది. సమీప భవిష్యత్‌లో ఇది 65కి క్షీణించినా మొత్తం మీద ఈఏడాది ఆఖరు నాటికి 63 స్థాయిలో నిలవొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 62.87 వద్ద ఉంది. -
ఆహార ధరలే గుదిబండ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్థికమంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. మిగిలిన స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయన కొంత సానుకూల వాతావరణ పరిస్థితి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ- క్యాడ్), ద్రవ్యలోటు తదితర అంశాలను ప్రస్తావించారు. ప్రజలు వినియోగ సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ధోరణి పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వివిధ అంశాలపై ఆయన వివరణలు క్లుప్తంగా... క్యాడ్‌కు కళ్లెం వేస్తాం... క్యాడ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత అంచనావేశాం. అయితే ఇప్పుడు ఇది 60 బిలియన్ డాలర్ల వరకూ తగ్గుతుందని భావిస్తున్నాం. బంగారం దిగుమతులు భారీగా తగ్గుతుండడం దీనికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. సెప్టెంబర్‌లో ఈ దిగుమతుల పరిమాణం 11.16 టన్నులయితే ఇది అక్టోబర్‌లో 23.5 టన్నులకు చేరింది. అయినా ఈ విషయంలో ఏమీ భయపడ్డం లేదు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గుతాయనే అంచనాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ( క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి -జీడీపీలో ఇది 4.8 శాతం -88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య క్యాడ్ జీడీపీలో 4.9 శాతంగా ఉంది. లక్ష్యం దాటని ద్రవ్యలోటు ద్రవ్య క్రమశిక్షణ, ద్రవ్యలోటు వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే ఆయా అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చొరవలు ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నాం. ఇవి స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదపడతాయి. జీడీపీలో 4.8 శాతానికి ద్రవ్యలోటు కట్టడి జరుగుతుందని భావిస్తున్నాం. అదే విధంగా రూ.40,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధిస్తాం. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్... రూపాయిపై... దేశానికి క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ పరిస్థితి బాగుంది. గడచిన 78 వారాల్లో భారత్ విదేశీ మారకపు నిధులకు 9 బిలియన్ల డాలర్ల అదనపు తోడయ్యాయి. దేశీయ కరెన్సీ డాలర్ల మారకంలో గడచిన కొన్ని వారాలుగా 61 నుంచి 62 వద్ద ట్రేడవుతోంది. మరిన్ని క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ వస్తాయని భావిస్తున్నాం. ఇదే జరిగితే రూపాయి మరింత బలపడుతుంది. ఇది 60-61 శ్రేణికి వస్తుంది. అది మంచి సంకేతం. ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం విస్తరించదు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ఇతర ఎక్స్ఛేంజ్లకు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఎల్) చెల్లింపుల సంక్షోభం విస్తరించదు. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని సెబీ పర్యవేక్షిస్తోంది, అదేవిధంగా ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్(ఎఫ్ఎంసీ) నియంత్రణ కింద మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్) పనిచేస్తోంది. ఆయా అంశాల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎన్ఎస్ఈఎల్ బిజినెస్ సరైన నియంత్రణ సంస్థ పరిధిలో పనిచేయకపోవడం సమస్యకు కారణమయ్యింది. ఫెడ్ నిర్ణయాలను ఎదుర్కొనగలం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రకటించిన సహాయక చర్యలను అమెరికా సెంట్రల్ బ్యాంక్... ఫెడరల్ రిజర్వ్ క్రమంగా ఉపసంహరించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో ఇది జరగవచ్చని మనం భావించాం. మార్చిలో జరగవచ్చని వారు (ఫెడ్) తాజాగా పేర్కొంటున్నారు. అయితే అదే జరిగితే దీనిని ఎదుర్కొనడానికి అటు మార్కెట్లు, ఇటు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. ఈ కోణంలో మనం ఆర్థిక ఫండమెంటల్స్‌ను మరింత పటిష్టం చేసుకోవాలి. క్యాడ్, ద్రవ్యలోటు కట్టడి, ఆదాయాలు మెరుగుపరచుకోవడం, కరెన్సీపై స్పెక్యులేషన్‌కు తావులేని చర్యలు తీసుకోవడం వంటివి ఇక్కడ దోహదపడతాయి. ఫెడ్ ఉపసంహరణల వల్ల ఏదైనా ప్రభావం ఉన్నా.... అది కేవలం నామమాత్రంగానే ఉంటుంది. నేనే సీఎంనైతే.. అధిక ద్రవ్యోల్బణంతో చాలా ఇక్కట్లు ఎదుర్కోవాల్సివస్తోంది. ఆహారోత్పత్తుల ధరల తీవ్రత పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు ఇతరత్రా ఆహార, నిత్యావసర ఉత్పత్తులు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి. ఇక ఉల్లిపాయల ధర వార్షిక ప్రాతిపదికన 300 శాతం పైగా పెరిగింది. కూరగాయలు, పండ్లు ధరలూ ఎగబాకాయి. ట్రేడర్లు అంటే హోల్‌సేలర్లు, రిటైలర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా చేసేదేమీ ఉండబోదు. రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఆయా అంశాలు ఉంటాయి. నేనే గనుక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండిఉంటే, నిత్యావసర వస్తువుల చట్టం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి ఉండేవాడిని. ఉల్లిపాయల అక్రమ నిల్వలకు పాల్పడే వారి భరతం పట్టేవాడ్ని. -
వృద్ధి రేటు కట్
2013-14లో ఆర్థిక వ్యవస్థపై నివేదిక... జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించిన ప్రధాని ఆర్థిక సలహా మండలి 6.4 శాతం నుంచి 5.3 శాతానికి కట్... అధిక ద్రవ్య, కరెంట్ అకౌంట్ లోటులు సవాలే... పెట్రో సబ్సిడీలు తగ్గిస్తేనే వ్యయాల అదుపు సాధ్యం ఎఫ్‌డీఐ నిబంధనల్లో మరింత సరళీకరణ అవసరం వృద్ధికి ఊతమివ్వాలంటే బొగ్గు ఉత్పత్తి పెంపు, స్థిరమైన పన్నుల విధానం కూడా ముఖ్యమే... నివేదికలో ప్రభుత్వానికి సూచించిన పీఎంఈఏసీ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే సంకేతాలు బలపడుతున్నాయి. దీనికి నిదర్శనంగా ఈ ఏడాది(2013-14) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాల్లో ఎడాపెడా కోత ప్రకటనలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) నివేదిక కూడా చేరింది. అధిక ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)లు ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా పరిణమిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పెట్టింది. ఏప్రిల్‌లో సమీక్ష సందర్భంగా 6.4 శాతంగా వృద్ధిని అంచనా వేయగా.. ఇప్పుడు దీన్ని ఏకంగా 5.3 శాతానికి తగ్గించేసింది. శుక్రవారం ఇక్కడ పీఎంఈఏసీ చైర్మన్ సి. రంగరాజన్ విడుదల చేసిన 2013-14 ఆర్థిక ముఖచిత్ర నివేదికలో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీలను భారీగా తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యయాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని రంగరాజన్ స్పష్టం చేశారు. మధ్య, దీర్ఘకాలంలో వృద్ధిరేటుకు చేయూతనందించాలంటే... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకరించడం, బొగ్గు ఉత్పత్తి పెంపు, స్థిరమైన పన్ను విధానాలు వంటివి కూడా ముఖ్యమేనని సూచించారు. గత ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా...ద్వితీయార్ధంలో వృద్ధి కాస్త పుంజుకోవచ్చని రంగరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరెన్సీ ఒడిదుడుకుల ఎఫెక్ట్... దేశంలో ఆర్థిక వ్యవస్థ రికవరీకి గత కొద్ది నెలలుగా నెలకొన్న కరెన్సీ ఒడిదుడుకులు కూడా దెబ్బకొట్టాయని నివేదిక తెలిపింది. అయితే, క్యాడ్ ఈ ఏడాది 3.8 శాతానికి(70 బిలియన్ డాలర్లు) దిగిరావచ్చని పేర్కొంది. క్రితం ఏడాది ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో(4.8%-88.2 బిలియన్ డాలర్లు) క్యాడ్ ఎగబాకిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్యాడ్ అవసరాల కోసం ఫారెక్స్ నిల్వల నుంచి 9 బిలియన్ డాలర్లను ఖర్చుచేయాల్సి రావచ్చనేది పీఎంఈఏసీ అంచనా. మరోపక్క, ద్రవ్యలోటును ఈ ఏడాది 4.8 శాతానికి కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని రంగరాజన్ పేర్కొన్నారు. ఆర్బీఐ కూడా ఈ ఏడాది వృద్ధి అంచనాలను 5.7 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించడం తెలిసిందే. గతేడాది వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టానికి(5%) పడిపోగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో నాలుగేళ్ల కనిష్టానికి(4.4%) పడిపోయింది. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... మార్చి నాటికి టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉండొచ్చు. ఈ ఏడాది జూలైలో టోకు ధరల ద్రవ్యోల్బణం 5.79 శాతంగా నమోదుకాగా, ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 9.52%. వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఏడాది కాస్త తగ్గి 185 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చు. గతేడాది(2012-13)లో ఇది రికార్డు స్థాయిలో(195.7 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. ఈ ఏడాదిలో బంగారం దిగుమతుల విలువ భారీగా తగ్గి 38 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చు. క్రితం ఏడాది ఇది 53.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రభుత్వం చేయూతనివ్వాలి: కార్పొరేట్లు జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో కోత విధిస్తూ పీఎంఈఏసీ విడుదల చేసిన నివేదిక వాస్తవ మందగమన పరిస్థితులను ప్రతిబింభిస్తోందని భారత కార్పొరేట్ వర్గాలు పేర్కొన్నాయి. పెట్టుబడులను ప్రోత్సహించి, వృద్ధికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం, విధానకర్తలు మరిన్ని చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక చాంబర్లు డిమాండ్ చేశాయి. కాగా, ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను చూస్తుంటే ద్వితీయార్ధంలో ఎలాంటి రికవరీ సంకేతాలూ కనబడటడం లేదని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలో రాజీవ్ కుమార్ చెప్పారు. పీఎంఈఏసీ అంచనాలకంటే చాలా తక్కువగా 4.3 శాతానికే ఈ ఏడాది వృద్ధి రేటు పరిమితం కావచ్చన్నారు. పెట్రో ధరలను ఒకేసారి పెంచేయాలి... ప్రభుత్వ వ్యయాల అదుపునకు ముఖ్యంగా డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల రేట్లను అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెంచకతప్పదని రంగరాజన్ స్పష్టం చేశారు. నెలవారీగా పెంపునకు తోడు ఒకేసారి పెట్రో రేట్లను పెంచేయడం ద్వారా తక్షణం ఈ సబ్సిడీలను తగ్గించుకోవాలని సూచించారు. డీజిల్‌పై ప్రభుత్వ నియంత్రణను పాక్షికంగా తొలగించిన నేపథ్యంలో నెలకు అర్ధరూపాయి చొప్పున ధర పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్రోలుపై పూర్తిగా నియంత్రణ ఎత్తివేయడంతో ధర చుక్కలనంటుతోంది. వ్యవ‘సాయం’... మెరుగైన రుతుపవన వర్షపాతం నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయ రంగం సానుకూల వృద్ధిని నమోదుచేయనుందని నివేదిక పేర్కొంది. 4.8 శాతం వృద్ధిరేటు ఉండొచ్చని(గతేడాది 1.9 శాతమే) అంచనావేసింది. అదేవిధంగా పారిశ్రామిక వృద్ధిరేటు కూడా 2.7 శాతం ఉంటుందని అభిప్రాయపడింది. అయితే,సేవల రంగం వృద్ధి మాత్రం 6.6 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. రూపాయి స్థిరపడ్డాకే పాలసీ సడలింపు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగానే క్షీణించిందని, అయితే, త్వరలోనే కరెన్సీకి స్థిరత్వం వచ్చే అవకాశాలున్నాయని రంగరాజన్ పేర్కొన్నారు. ఆర్బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో విదేశీ నిధుల ప్రవాహం పెరగడం, క్యాడ్ తగ్గుదల వంటివి కరెన్సీ విలువ బలపడేందుకు దోహదం చేయొచ్చన్నారు. అయితే, రూపాయి విలువ ఇంకా తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూస్తున్న నేపథ్యంలో ఇది స్థిరపడేదాకా ఆర్బీఐ ప్రస్తుతం అనుసరిస్తున్న పాలసీ విధానాన్నే కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా ఈ నెల 20న చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు తక్కువేనన్న సంకేతాలిచ్చారు. ఏప్రిల్ నుంచి చూస్తే రూపాయి విలువ 20 శాతం పైగానే కుప్పకూలి.. తాజాగా ఆల్‌టైమ్ కనిషాన్ని(68.80)ని తాకడం తెలిసిందే. -
రూపాయి పతనం షాకే, కానీ...
ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై పార్లమెంట్లో ప్రధాని మన్మోహన్ ప్రకటన కరెన్సీ క్షీణత తాత్కాలికమే... మళ్లీ పుంజుకుంటుంది సంస్కరణలపై వెనక్కితగ్గం... పెట్టుబడులపై నియంత్రణల ప్రసక్తే లేదు... కఠినమైన సంస్కరణలకు సమయం ఆసన్నమైంది... న్యూఢిల్లీ: రూపాయి ఘోర పతనంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. దేశీ కరెన్సీ కుప్పకూలడం కచ్చితంగా దిగ్భ్రాంతికరమైన విషయమేనని.. అయితే, సంస్కరణల ప్రక్రియ నుంచి వెనక్కితగ్గకుండానే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారు. విదేశీ పెట్టుబడులు దేశం విడిచివెళ్లకుండా ఎలాంటి నియంత్రణలూ(క్యాపిటల్ కంట్రోల్) విధించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో ఆయన శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నమాట వాస్తవమేనని, ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారని కూడా ఆయన ఒప్పుకున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఇక్కట్లు మాత్రమేనని.. వృద్ధిరేటు గాడిలోపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలూ కారణమే... రూపాయి భారీగా కుప్పకూలడానికి దేశీయ అంశాలతోపాటు పలు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణమని ప్రధాని వివరించారు. సవాళ్లను అధిగమించగలమన్నారు. ఇక కఠిన సంస్కరణలే... గడిచిన రెండు దశాబ్దాలుగా ఆర్థిక సరళీకరణ ప్రయోజానాలు భారత్‌కు చాలా మేలు చేకూర్చాయని ప్రధాని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు ఇప్పటికీ చాలా పటిష్టంగానే ఉన్నాయని.. భారతదేశ అసలుసిసలు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన తరుణం వచ్చిందన్నారు. ఇప్పటిదాకా చేపట్టిన ఆర్థిక సంస్కరణలన్నీ ఒకెత్తయితే.. ఇకపై మరిన్ని కఠిన సంస్కరణలతో ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. దీనికి రాజకీయపక్షాల నుంచి ఏకాభిప్రాయం అవసరమని కూడా చెప్పారు. సంస్కరణలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వృద్ధిరేటుపై... 2013-14లో జీడీపీ వృద్ధిరేటు కాస్త మెరుగ్గానే 5.5 శాతంగా నమోదుకావచ్చని మన్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కీలక సంస్కరణలు అవసరం: కార్పొరేట్లు ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపు, క్యాపిటల్ కంట్రోల్స్ విధించబోమన్న ప్రధాని హామీపై కార్పొరేట్ ఇండియా స్పందించింది. దీనికితోడు జీఎస్టీ, సబ్సిడీలకోత ఇతరత్రా పలు కీలక, కఠిన సంస్కరణలను అమలుచేయాల్సిన అవసరం నెలకొందని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ వ్యాఖ్యానించారు. అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. పసిడిపై మోజు వద్దు... అధిక క్యాడ్(మూల ధన పెట్టుబడులు మినహా దేశంలోకివచ్చే, బయటికిపోయే విదేశీ మారకం నిధుల మధ్య వ్యత్యాసం) దేశానికి ఆందోళనకరంగా పరిణమిస్తోందని ప్రధాని అంగీకరించారు. రూపాయి క్షీణతకు ఇది కూడా ఆజ్యం పోస్తోందన్నారు. పసిడి, ముడిచమురు దిగుమతులు దూసుకెళ్తుండటమే క్యాడ్ పెరుగుదలకు కారణమని చెప్పారు. ప్రజలు బంగారంపై మోజు తగ్గించుకోవాలని, తద్వారా క్యాడ్‌కు కళ్లెం పడుతుందని సూచించారు. అదేవిధంగా పెట్రో ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడం, ఎగుమతులను పెంచే చర్యల ద్వారా క్యాడ్‌కు అడ్డుకట్టవేయొచ్చని పేర్కొన్నారు. క్యాడ్‌ను జీడీపీలో 2.5 శాతానికి తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8 శాతం-90 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. కాగా, విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చేలా సానుకూల ఆర్థిక వాతావరణాన్ని కల్పించడం ద్వారా క్యాడ్‌ను పూడ్చుకునేందుకు వీలవుతుందన్నారు. 1991 నాటి చెల్లింపుల సంక్షోభానికి భారత్ మళ్లీ చేరువవుతోందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. దేశ కరెన్సీ మారకం రేటు మార్కెట్ ఆధారితంగానే కొనసాగుతోందని, దేశంలో 278 బిలియన్ డాలర్ల విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి ఏడు నెలలకు సరిపడా దిగుమతుల బిల్లుకు సమానమని కూడా గుర్తుచేశారు.