న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.14.53 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 82.8 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)ఈ గణాంకాలను విడుదల చేసింది.
2022–23లో మొత్తం ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లుగా అంచనావేయడం జరిగింది. స్థూల దేశీయోత్పత్తి ఇది 6.4 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment