Government revenue and costs
-
జూన్ నాటికి ద్రవ్యలోటు 8.1 శాతానికి అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ముగిసే నాటికి లక్ష్యంలో 8.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.1,35,712 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజా గణాంకాను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే... ఆర్థిక సంవత్సరం (2024–25) జీడీపీలో 4.9 శాతం వద్ద కట్టడి చేయాలన్నది నిర్మలా సీతారామన్ బడ్జెట్ లక్ష్యం. విలువలో ఇది 16.14 లక్షల కోట్లు. అయితే జూన్ ముగిసే నాటికి ఈ విలువ రూ.1,35,712 కోట్లకు చేరిందన్నమాట. అంటే ద్రవ్యలోటు ఇప్పటికి 8.1 శాతమని అర్థం. 2023–24లో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లుగా, వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనావేస్తోంది. వెరసి ద్రవ్యలోటు రూ.16.14 లక్షల కోట్లుగా నమోదుకానుంది. -
లక్ష్యంలో 82.8 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.14.53 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 82.8 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)ఈ గణాంకాలను విడుదల చేసింది. 2022–23లో మొత్తం ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లుగా అంచనావేయడం జరిగింది. స్థూల దేశీయోత్పత్తి ఇది 6.4 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. -
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ.
-
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ
హైదరాబాద్: ప్రభుత్వ ఆదాయవ్యయాల లెక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. బడ్జెట్ లెక్కలపై కేంద్రం అనుసరిస్తున్న పద్ధతినే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడే పారదర్శకత ఉన్న పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే పద్దతి అనుసరిస్తోందని తెలిపారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అనుసరించాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు. ఏఏ పథకాలకు ఎంతెంత ఖర్చుచేస్తున్నారో తెలపాలన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి 23 వరకు జరుగనున్నందున సభలో చర్చకు వివరాలు సమగ్రంగా ఉండాలన్నారు. ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఆదాయవ్యయాలు, పన్నులు, లోటు తదితర ఆర్థిక అంశాలను వెబ్సైట్లో పెట్టాలని వైఎస్ జగన్ కోరారు. **