
డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 9.14 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 9,14,089 కోట్లకు చేరింది. ఇది పూర్తి సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యంలో 56.7 శాతమని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును రూ. 16,13,312 కోట్లకు పరిమితం చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది.
సీజీఏ డేటా ప్రకారం డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయం రూ. 18.43 లక్షల కోట్లు. ఇది 2024–25 బడ్జెట్ అంచనాల్లో (బీఈ) 71.3 శాతం. మరోవైపు బీఈలో మొత్తం వ్యయాలు 67 శాతానికి (రూ. 32.32 లక్షల కోట్లు) చేరుకున్నాయి. 2023–24లో స్థూల దేశీయోత్పత్తిలో 5.6 శాతంగా ఉన్న లోటును ఈసారి 4.9 శాతానికి కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఆదాయానికి మించి ఉన్న ఖర్చుల కోసం ప్రభుత్వం సమీకరించాల్సిన రుణమొత్తాన్ని ఇది సూచిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment