
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
సింగపూర్: భారత్ ద్రవ్యలోటు లక్ష్యం పట్ల ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరిక జారీ చేశారు. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత్ ఇకపై ఎంత మాత్రం ఆకర్షణీయం కాదన్నారు. 2018–19 కేంద్ర బడ్జెట్‌లో దిగుమతుల సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారత్‌లో తయారీకి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 1991లో భారత్ చెల్లింపుల పరంగా ఎదుర్కొన్న సంక్షోభం, 2013లో మరోసారి సంక్షోభం వరకూ వెళ్లడం అన్నవి నియంత్రణ లేని ఆర్థిక దుబారాల వల్లేనన్నారు.
సింగపూర్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో ‘ప్రపంచీకరణలో భారత్’ అనే అంశంపై మాట్లాడుతూ దువ్వూరి ఈ విషయాలు చెప్పారు. పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాల పెంపును దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. భారత్‌లో తయారీకి తగినంత ఆసరా ఇవ్వకుండా ఈ విధంగా రేట్లు పెంచితే అది దేశ తయారీ రంగానికి తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment