రూ. 4 లక్షల కోట్లకుద్రవ్య లోటు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ద్రవ్య లోటు రూ. 4.23 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో (బీఈ) ఇది 79.3 శాతం. గతేడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో 74 శాతమే. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు 2016-17లో సుమారు రూ. 5.33 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3.5 శాతం)గా ఉండొచ్చని బడ్జెట్‌లో అంచనా వేశారు.
పన్నుల రూపంలో ఆదాయం రూ. 5.30 లక్షల కోట్లు వచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో (రూ.10,54,101 కోట్లు) ఇది 50.3 శాతం. ఆదాయం, రుణయేతర పెట్టుబడులపై రాబడులు మొదలైనవన్నీ కలిపి ప్రభుత్వానికి తొలి ఏడు నెలల్లో రూ. 7.27 లక్షల కోట్లు వచ్చారుు. ఇక వ్యయాలు (ప్రణాళిక, ప్రణాళికేతర) మొత్తం రూ.11.50 లక్షల కోట్లుగా నమోదయ్యారుు. పూర్తి ఆర్థిక సంవత్సరం వ్యయాలు రూ. 19.78 లక్షల కోట్ల మేర ఉండొచ్చని ప్రభుత్వం అంచనా.