సాక్షి, న్యూడిల్లీ: అక్టోబర్ చివరి నాటికి ద్రవ్య లోటు 2017-18 నాటికి బడ్జెట్ అంచనాలతో పోలిస్తే..ముఖ్యంగా తక్కువ ఆదాయం, వ్యయాల వృద్ధి కారణంగా ఏప్రిల్-అక్టోబర్లో ద్రవ్యలోటు రూ. 5.25 లక్షల కోట్లుగా నిలిచింది.
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అక్కౌంట్లు (సీజీఏ) వివరాల ప్రకారం, 2017-18ఏప్రిల్-అక్టోబర్ ద్రవ్యలోటు గత ఏడాది రూ. 4.2లక్షల కోట్లతో పోలిస్తే రూ.5.25లక్షల కోట్లుగా నమోదైంది. నిర్వహణ వ్యయం రూ.12.9లక్షల కోట్లు, ఆదాయ ఆర్జన రూ.7.67లక్షలకోట్లు, రెవెన్యూ గ్యాప్ రూ. 4.0.1 లక్షలకోట్లు పన్ను ఆదాయం రూ.9.7లక్షలకోట్లుగా నిలిచింది. ప్రభుత్వం మొత్తం వ్యయం అక్టోబర్ చివరినాటికి రూ .12.92 లక్షల కోట్లు, లేదా బడ్జెట్ అంచనాలో 60.2శాతంగా ఉంది.
మరోవైపు 10శాతం జీడీపీ వృద్ధి సాధించం అతి పెద్ద సవాల్ అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ప్రసంగించిన జైట్లీ గత మూడేళ్లుగా జీడీపీ వృద్ధి 7-9శాతం ఉంటుంది. 10శాతం వృద్ధి సాధించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇది ఒక్క దేశీయ పరిణామాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుందని జైట్లీ తెలిపారు.
కాగా 2017-18 నాటికి జిడిపిలో ద్రవ్యలోటును 3.2 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతం లక్ష్యాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment