నవంబరు చివరకు ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లు | India April November Fiscal Deficit At Rs 9.07 Lakh Crore | Sakshi
Sakshi News home page

నవంబరు చివరకు ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లు

Published Sat, Dec 30 2023 9:02 AM | Last Updated on Sat, Dec 30 2023 9:10 AM

India April November Fiscal Deficit At Rs 9.07 Lakh Crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు నవంబర్‌ ముగిసే నాటికి 2023–24 వార్షిక బడ్జెట్‌ లక్ష్యంలో 50.7 శాతానికి చేరింది. విలువలో రూ.9,06,584 కోట్లకు చేరిందని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్‌ అంచనా వేసింది.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ ఇటీవలే అన్నారు.

గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్‌ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది.  నవంబర్‌ ముగిసే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.17.40 లక్షల కోట్లు (బడ్జెట్‌ లక్ష్యంలో 64.3 శాతం). వ్యయాలు రూ.26.46 లక్షల కోట్లు (బడ్జెట్‌ లక్ష్యంలో 58.9 శాతం). వెరసి ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లకు చేరింది. కాగా, మొత్తం వ్యయాల్లో రూ.20.66 లక్షల కోట్లు రెవెన్యూ అకౌంట్‌కు సంబంధించినదికాగా, మిగిలినది మూలధన వ్యయాలపై జరిగింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement