న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం.. ద్రవ్యలోటు అక్టోబర్‌తో ముగిసిన నెలకు ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 45 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ విలువ ర.8.03 లక్షల కోట్లని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు ర.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది.
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది.
రూ.8.03 లక్షల కోట్లు లోటు ఎలా?
- అక్టోబర్ 2023 వరకు ప్రభుత్వానికి ర. 15.90 లక్షల కోట్ల పన్ను నికర రాబడి (బడ్జెట్ అంచనాల్లో 58.6 శాతం) లభించింది. ఇందులో 13.01 లక్షల కోట్లు పన్ను ఆదాయాలు. ర. 2.65 లక్షల కోట్ల పన్నుయేతర ఆదాయం. ర. 22,990 కోట్లు నాన్–డెట్ క్యాపిటల్ ఆదాయం. రుణాల రికవరీ (ర.14,990 కోట్లు, మూలధన ఆదాయాలు (రూ.8,000 కోట్లు) నాన్–డెట్ క్యాపిటల్ పద్దులో ఉంటాయి.
- ఇక ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో ప్రభుత్వ వ్యయాలు ర.23.94 లక్షల కోట్లు (బడ్జెట్‌లో నిర్దేశించుకున్న మొత్తంలో 53 శాతం). వ్యయాల్లో ర.18,47,488 కోట్లు రెవెన్యూ అకౌంట్‌కాగా, ర. 5,46,924 కోట్లు క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ వ్యయాలు ర.18,47,488 కోట్లలో ర.5,45,086 కోట్లు వడ్డీ చెల్లింపులు. ర.2,31,694 కోట్లు సబ్సిడీ అకౌంట్ వ్యయాలు.
- వెరసి ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ర.8.03 లక్షల కోట్లుగా నవెదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment