![Stock Market Closing Update 11th February 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/stock-market.jpg.webp?itok=as8_3EQ8)
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1031.25 పాయింట్లు లేదా 1.31 పాయింట్ల నష్టంతో 76,296.55 వద్ద, నిఫ్టీ 309.80 పాయింట్లు లేదా 1.32 శాతం నష్టంతో.. 23,071.80 వద్ద నిలిచాయి. ఈ వారంలో రెండూ రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాను.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ట్రెంట్, భారతి ఎయిర్‌టెల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన, ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లలో ఆందోళనలు మొదలయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అంతే కాకుండా అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment