ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో నిఫ్టీ ఏడోరోజూ నష్టాలు చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,339 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 23,454 వద్ద నిలిచింది. ప్రథమార్థంలో సెన్సెక్స్ 615 పాయింట్లు క్షీణించి 76,965 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు కోల్పోయి 23,350 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.
అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్, రియలీ్ట, ఆటో, సరీ్వసెస్, కన్జూమర్ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర భర్తీ అయ్యాయి. రంగాలవారీగా.., ఐటీ ఇండెక్స్ 2.50%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2%, ఫార్మా, మీడియా సూచీలు 1% చొప్పున పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున తక్షణ వడ్డీరేట్ల తగ్గింపు ఇప్పట్లో అవసరం లేదంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
⇒ డిసెంబర్‌లో ఫెడ్ రేట్ల కోత ఉండకపోవచ్చనే సంకేతాలతో టీసీఎస్, ఎంఫసీస్, ఎల్‌టీఐఎం షేర్లు 3% క్షీణించగా.. ఇన్ఫీ 2.50% విప్రో 2% పడ్డాయి.
⇒ డిసెంబర్ నుంచి చైనా కమోడిటీలకు సంబంధించి ఎగుమ తులపై పన్ను రాయి తీలను తగ్గించడం లేదా రద్దు చేయాలనే ప్రతిపాదనలతో మెటల్ షేర్లు మెరిశాయి. నాల్కో 9 శాతం, హిందాల్కో 4%, వేదాంత 3%, టాటా స్టీల్ 2%, ఎన్‌ఎండీసీ 1.50%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒకశాతం లాభపడ్డాయి.
⇒ ప్రభుత్వం నేచరల్ గ్యాస్ సరఫరాను నెలలో రెండోసారి తగ్గించడంతో గ్యాస్ పంపిణీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ 20% క్షీణించి రూ.325 వద్ద, మహానగర్ గ్యాస్ 14% పడి రూ.1,131 వద్ద ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment