![TVS NTorq Crossed 18 Lakh Sales](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/tvs-ntorq-125_0.jpg.webp?itok=3SvRr0kF)
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ 18,88,715 యూనిట్లను విక్రయించింది. దీంతో హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్, సుజుకి యాక్సెస్ తరువాత.. ఎన్‌టార్క్ 125 అత్యధికంగా అమ్ముడైన నాల్గవ స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
టీవీఎస్ మోటార్ 2018 ప్రారంభంలో ఎన్‌టార్క్‌ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భారతదేశంలో 125సీసీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండేది. అప్పటి నుంచి కంపెనీ దీనిని అప్డేట్ చేస్తూ.. కొత్త వేరియంట్‌లను ప్రవేశపెడుతూనే ఉంది. కంపెనీ అమ్మకాలు పెరగడానికి కూడా ఈ స్కూటర్ దోహదపడింది.
ఎన్‌టార్క్ స్కూటర్ బేస్ (డ్రమ్/డిస్క్), రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, రేస్ XP, రేస్ XT అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 84,600 నుంచి రూ. 1,04,600 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. రేస్ XP ఎడిషన్ 10.2 హార్స్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. మిగిలిన వేరియంట్స్ 9.4 హార్స్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి.
ఇదీ చదవండి: సరికొత్త ఫీచర్లతో.. వచ్చేస్తోంది యాక్టివా 7జీ
ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. విదేశాల్లో కూడా 'ఎన్‌టార్క్'కు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ 2024 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య 50640 ఎన్‌టార్క్ స్కూటర్లను ఎగుమతి చేసింది. ఇవి అంతకు ముందు ఏడాది కంటే 16 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment