automobil
-
‘రయ్’న దూసుకుపోయే ట్రెక్కింగ్ బైక్ (ఫొటోలు)
-
2022లో మోస్ట్ పాపులర్ కారు, బైక్.. మీకు తెలుసా?
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ డ్రూమ్ “ఇండియా ఆటోమొబైల్ ఇకామర్స్ రిపోర్ట్ 2022” పేరుతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కార్ల విభాగంలో హ్యుందాయ్ క్రెటా, బైక్స్ విభాగంలో బజాజ్ పల్సర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా గుర్తింపు పొందాయి. మన దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా కీర్తి పొందగలిగింది. దేశంలో ప్రస్తుతం కొరియన్ కంపెనీ కార్ల హవా జోరుగా సాగుతోంది. 2022లో ఎక్కువ అమ్మకాలు పొందిన, ఎక్కువమంది కొనుగోలుదారుల మనసుదోచిన కారుగా క్రెటా నిలిచింది. ఆ తరువాత స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా, ఇన్నోవా క్రిస్టా నిలిచాయి. 2022లో లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఎక్కువ ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందగా, తరువాత స్థానంలో జీప్ కంపాస్, బెంజ్ సీ క్లాస్, బీఎండబ్ల్యూ5 సిరీస్ చేరాయి. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ పల్సర్ ఎక్కువ ప్రజాదరణ పొందిన బైకుగా మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత స్థానాల్లో హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్, హోండా సీబీ షైన్ వంటివి నిలిచాయి. లగ్జరీ బైక్స్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్, హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750, కవాసాకీ నింజా జెడ్ఎక్స్-10ఆర్ వంటివి ఎక్కువ అమ్మకాలు పొందినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
ఔను.. భారత్‌కు వస్తున్నాం..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించనున్న వార్తలను ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. టెస్లా కార్లు చాలా ఖరీదైనవే అయినప్పటికీ.. భారత మార్కెట్లో ఆ కంపెనీకి గల అవకాశాలను విశ్లేషించిన ఒక బ్లాగ్‌పోస్ట్‌పై మస్క్ స్పందించారు. ‘హామీ ఇచ్చినట్లుగానే (వస్తున్నాం)’ అంటూ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో క్లుప్తంగా ఓ ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన టెస్లా.. భారత్‌లో తమ విభాగాన్ని ప్రారంభించేందుకు నమోదు చేసుకున్న నేపథ్యంలో మస్క్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)లో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట, లక్ష రూపాయల పెయిడప్ క్యాపిటల్‌తో అన్‌లిస్టెడ్ సంస్థగా ఓ కంపెనీ నమోదు చేసుకుంది. దీంతో టెస్లా ఎంట్రీ ఖరారు కాగా.. తాజాగా మస్క్ ట్వీట్ దాన్ని ధ్రువీకరించినట్లయింది. తయారీ ప్లాంట్, ఆర్అండ్డీ కేంద్రం ఏర్పాటు కోసం 5 రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లు సమాచారం. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్‌తో టెస్లా జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ.. టాటా మోటార్స్ ఖండించింది. చదవండి: షావోమీకి భారీ షాకిచ్చిన అమెరికా వెనక్కి తగ్గిన వాట్సాప్.. ఆ నిర్ణయం 3 నెలలు వాయిదా -
కొన్నేళ్ల కనిష్టానికి ఆటోమొబైల్ విక్రయాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ పరిశ్రమలలో విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించనున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇటీవల కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ అమలు, పొడగింపుతో విక్రయాలు పడిపోయాయని వెల్లడించింది. మొత్తం అమ్మకాల పరిమాణం కొన్నేళ్ల కనిష్టానికి పడిపోనుంది. ప్రయాణికుల వాహనాలు(పీవీ), వాణిజ్య వాహనాల(సీవీ)విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా క్షీణించి 2010 ఆర్థిక సంవత్సరం కనిష్టానికి చేరవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. వాహనాల సగటు వినియోగం 58 శాతంనుంచి 50 శాతానికి క్షీణిస్తుందని తెలిపింది. పీవీ విభాగంలో సగటు వినియోగం 58 శాతం నుంచి 44 శాతానికి, ద్విచక్రవాహానాల వినియోగం 65శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇక ట్రాక్టర్ల వాడకం అయితే 59 శాతం నుంచి 51 శాతానికి క్షీణిస్తుందని, వాణిజ్య వాహనాల వినియోగం 51 శాతం నుంచి 39 క్షీణించవచ్చని క్రిసిల్ వివరించింది. లాక్‌డౌన్‌తో వేతనాల్లో కోత, ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉండడంతో వినియోగదారులు కొనుగోళ్లపై మొగ్గుచూపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హిటల్ గాంధీ అన్నారు. వివిధ కంపెనీలు వ్యయ భారాలనుతగ్గించుకునేందుకు వేతనాలు, ఉద్యోగాల్లో కోతలు విధించడానికే మొగ్గు చూపుతున్నాయని, దీంతో వినియోగదారుల వద్ద సరిపడా నగదు ఉండదు. ఫలితంగా 60-70 శాతం ప్రజారవాణ వాహనాల కొనుగోళ్లు నిర్ణయాలు వాయిదా పడతాయన్నారు. మరోపక్క కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనల ప్రభావంతో వాణిజ్య వాహనాల విక్రయాలు క్షీణిస్తున్నాయి. డిమాండ్ తక్కువగా ఉన్నంతకాలం రికవరీ కూడా అధికంగా ఉండే అవకాశం లేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహాన విక్రయాలు వేగంగా పుంజుకోవచ్చని క్రిసిల్ తెలిపింది. రుతుపవనాలు సకాలంలో వచ్చి, పంటలు బాగా పండడం వల్ల గ్రామీణ ఆర్థికం మెరుగపడి కొనుగోలు శక్తి పెరగడంతో ఈ వాహన విక్రయాలు జరుగుతాయని క్రిసిల్ పేర్కొంది. మార్కెట్లో 50 శాతం, ఆర్థికంగా 35-45 శాతం వాటా కలిగిన ద్విచక్ర వాహానాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి విక్రయాలు ఊపందుకుంటాయని తెలిపింది.