Deficit
-
లిక్విడిటీ లోటు రూ.3 లక్షల కోట్లు
భారతీయ బ్యాంకింగ్(Banking) వ్యవస్థలో లిక్విడిటీ లోటు గరిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా ఈ లోటు ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అధికమవడం, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు లిక్విడిటీ తగ్గడానికి కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.లిక్విడిటీ లోటుకు కొన్ని కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే భారీగా పడుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తోంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన అవుట్ ఫ్లోలు కూడా లిక్విడిటీ లోటు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద ప్రభుత్వ నగదు నిల్వలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.ఆర్బీఐ స్పందన..లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆర్బీఐ విభిన్న చర్యలు తీసుకుటోంది. ఆర్బీఐ వేరియబుల్ రెపో రేటు (వీఆర్ఆర్-షార్ట్టర్మ్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు ఆర్బీఐ అప్పులు ఇవ్వడం) ఆక్షన్లను పెంచింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పించడానికి రోజువారీ వేలం నిర్వహిస్తుంది. జనవరి 23న ఆర్బీఐ రూ.3.15 లక్షల కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది. బ్యాంకు నిల్వల నిర్వహణలో అంతరాన్ని సర్దుబాటు చేసిన తర్వాత కూడా లోటు రూ.3.3 లక్షల కోట్లకు పైగానే ఉంది.ఇదీ చదవండి: ఫుడ్ కేటరింగ్ పునరుద్ధరణకు భాగస్వామ్యంనగదు నిల్వల నిష్పత్తిని (CRR) నికర డిపాజిట్లలో 4 శాతానికి తగ్గించిన ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ.1.16 లక్షల కోట్ల లిక్విడిటీని ఇటీవల విడుదల చేసింది. ఇది కూడా లిక్విడిటీ లోటు సమస్యకు కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే నెలలో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం కీలకంగా మారనుంది. -
ఎగుమతులు ఢమాల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి భారత్ వస్తు ఎగుమతులపై ప్రభావం చూపింది. ఆగస్టులో ఎగుమతులు గడచిన 13 నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో 9.3 శాతం క్షీణించి (2023 ఆగస్టు నెలతో పోల్చి) 34.71 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. జూలైలో కూడా ఎగుమతుల విలువ పడిపోయినప్పటికీ అది కేవలం 1.5 శాతంగా ఉండడం గమనార్హం. దిగుమతులు రికార్డు... ఇక దిగుమతులుసైతం రికార్డు స్థాయిలో 3.3 శాతం పెరిగి 64.36 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం – వాణిజ్యలోటు 10 నెలల గరిష్ట స్థాయిలో 29.65 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బంగారం, వెండి ప్రభావం.. బంగారం, వెండి దిగుమతులు భారీగా పెరగడం తీవ్ర స్థాయి వాణిజ్యలోటుకు ఒక కారణం. 2023 ఆగస్టులో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లుకాగా, ఈ ఆగస్టులో రెట్టింపై 10.06 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులుసైతం ఇదే సమయంలో 159 మిలియన్ డాలర్ల నుంచి 727 మిలియన్ డాలర్లకు ఎగశాయి. బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాలను (15% నుంచి 6%కి) తగ్గించడం, పండుగ సీజన్ డిమాండ్ దిగుమతులు భారీగా పెరగడానికి కారణం. కాగా, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య వస్తు ఎగుమతుల విలువ 1.14% పెరిగి 178.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
కేంద్రంపై రైతులకు విశ్వాసం లేనట్లుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అపనమ్మక(విశ్వాసంలేని) పరిస్థితులున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. రాజధాని ఢిల్లీ, హర్యానాకు సరిహద్దుగా ఉన్న శంభూ ప్రాంతంలో రైతుల ఆందోళన సమయంలో బారికేడ్లు తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం(జులై 24) ఈ వ్యాఖ్యలు చేసింది.రైతుల సమస్యలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. అసలు రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటారని ప్రశ్నించింది. మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే అంపైర్‌లాంటి వ్యక్తి కావాలని కోర్టు పేర్కొంది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కాగా, రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
లక్ష్యంలో 45 శాతానికి చేరిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం.. ద్రవ్యలోటు అక్టోబర్‌తో ముగిసిన నెలకు ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 45 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ విలువ ర.8.03 లక్షల కోట్లని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు ర.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. రూ.8.03 లక్షల కోట్లు లోటు ఎలా? అక్టోబర్ 2023 వరకు ప్రభుత్వానికి ర. 15.90 లక్షల కోట్ల పన్ను నికర రాబడి (బడ్జెట్ అంచనాల్లో 58.6 శాతం) లభించింది. ఇందులో 13.01 లక్షల కోట్లు పన్ను ఆదాయాలు. ర. 2.65 లక్షల కోట్ల పన్నుయేతర ఆదాయం. ర. 22,990 కోట్లు నాన్–డెట్ క్యాపిటల్ ఆదాయం. రుణాల రికవరీ (ర.14,990 కోట్లు, మూలధన ఆదాయాలు (రూ.8,000 కోట్లు) నాన్–డెట్ క్యాపిటల్ పద్దులో ఉంటాయి. ఇక ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో ప్రభుత్వ వ్యయాలు ర.23.94 లక్షల కోట్లు (బడ్జెట్లో నిర్దేశించుకున్న మొత్తంలో 53 శాతం). వ్యయాల్లో ర.18,47,488 కోట్లు రెవెన్యూ అకౌంట్కాగా, ర. 5,46,924 కోట్లు క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ వ్యయాలు ర.18,47,488 కోట్లలో ర.5,45,086 కోట్లు వడ్డీ చెల్లింపులు. ర.2,31,694 కోట్లు సబ్సిడీ అకౌంట్ వ్యయాలు. వెరసి ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ర.8.03 లక్షల కోట్లుగా నవెదయ్యింది. -
రానున్నది బ్యాలెన్స్డ్ బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమతుల్యంగా ఉంటుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఉపాధి కల్పనతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. పన్నుల పరంగా సౌలభ్యం, ద్రవ్యోలోటును నియంత్రణలో ఉంచి, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతారన్న అభిప్రాయాలు నిపుణులు, ఇన్వెస్టర్ల నుంచి వినిపించాయి. ‘‘ఎన్నికల ముందు బడ్జెట్ నుంచి ఇన్వెస్టర్లు మూడింటిని ఆశిస్తున్నారు. మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఏకీకృత పన్ను నిర్మాణం ఇందులో ఒకటి. దీనివల్ల ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన ద్రవ్య స్థిరీకరణ రెండోది. వృద్ధికి అవరోధాలుగా మారిన సబ్సిడీల స్థిరీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు, పీఎస్‌యూల ప్రైవేటీకరణ లేదా స్థిరీకరణపై చర్య లు ఉంటాయని అంచనా వేస్తున్నారు’’అని ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి తెలిపారు. ఈ నెల ఇప్పటి వరకు మార్కెట్లు ఫ్లాట్‌గా ఒక శ్రేణి పరిధిలోనే ట్రేడ్ అవుతుండడం తెలిసిందే. కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చేంత సానుకూలంగా లేవు. కనుక బడ్జెట్ ప్రతిపాదనలపైనే మర్కెట్ గమనం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటి వరకు రూ.16,500 కోట్ల అమ్మకాలు చేశారు. చౌక వ్యాల్యూషన్లలో ట్రేడ్ అవుతున్న చైనా తదితర వర్ధమాన మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం భయాలు కూడా ఇన్వెస్టర్ల మనుసుల్లో ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. గడిచిన పదేళ్లలో బడ్జెట్‌కు ముందు ఆరు సందర్భాల్లో మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. గత పదేళ్లలో బడ్జెట్ తర్వాత ఆరు సందర్భాల్లో మార్కెట్లు నష్టపోయాయి. బడ్జెట్ రోజు నిఫ్టీ–50 ఏడు సందర్భాల్లో నష్టాలను చవిచూసింది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థకు సానుకూలించే చర్యలు బడ్జెట్లో ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తుంటాయి. ప్రతికూల ప్రతిపాదనలు ఉంటే నష్టపోతుండడం సహజం. కానీ, ఇది తాత్కాలిక పరిణామంగానే ఉంటుంది. మూలధన లాభాల పన్ను పెంచితే ప్రతికూలం ‘‘వచ్చే బడ్జెట్ ప్రభావం అన్నది అందులోని ప్రతిపాదనలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 2023–24 ద్రవ్యలోటును మార్కెట్లు జాగ్రత్తగా గమనిస్తాయి. 6 శాతానికి పైన అంచనాలు ఉంటే అది మార్కెట్లను నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఇది జరగకపోవచ్చు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మూలధన లాభాల పన్నును పెంచితే అది మార్కెట్‌కు ప్రతికూలంగా మారుతుందున్నారు. ఆర్థిక వ్యవస్థ లేదా ఖర్చు చేసే ఆదాయం మిగులుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నా కానీ, అవి మార్కెట్‌పై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తాయని జార్విస్ ఇన్వెస్ట్ సీఈవో సుమీత్ చందా అభిప్రాయపడ్డారు. వేతన జీవుల పన్ను శ్లాబుల్లో మార్పులు లేదా కంపెనీల మూలధన వ్యయాలకు ప్రోత్సాహకాలు లేదా పన్నుల తగ్గింపు చర్యలు ఉంటే మార్కెట్లలో ర్యాలీని చూస్తామన్నారు. పీఎల్ఐ పథకం విస్తరణ, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు, పన్ను శ్లాబుల్లో ఉపశమనం చర్యలు ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని అన్మి ప్రెసిడెంట్ కమలేష్‌షా అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ప్రభావం మార్కెట్లపై చాలా స్వల్పకాలమేనని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాలు తదుపరి మార్కెట్లను నడిపించే అంశాలుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 ఫెడ్ వ్యాఖ్యలు డోవిష్‌గా ఉండి, ద్రవ్యోల్బణం దిగొస్తే మార్కెట్లు ర్యాలీ చేస్తాయని జియోజిత్ విజయ్‌కుమార్ అంచనా వేస్తున్నారు. హెల్త్‌కేర్, ఫెర్టిలైజర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఇన్సూరెన్స్, తయారీ, డిజిటలైజేషన్, కమ్యూనికేషన్, విద్య, ఎస్ఎంఈ రంగాలకు బడ్జెట్లో ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాంటార్ సర్వే అనలైటిక్స్ సంస్థ కాంటార్ బడ్జెట్‌కు ముందు నిర్వహించిన సర్వే అంశాలను పరిశీలించినట్టయితే.. ► ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగాల తొలగింపులపై ఆందోళనతో ఉన్నారు. ► ప్రతి నలుగురిలో ముగ్గురు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళకరమని పేర్కొన్నారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరమని చెప్పారు. ► సగం మంది దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వృద్ధి బాటలో కొనసాగుతుందని భావిస్తుంటే, 31 శాతం నిదానిస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ► మెట్రో జనాభాతో పోలిస్తే నాన్ మెట్రోల్లో 54 శాతం మంది ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ► ఆదాయపన్ను మినహాయింపుగా ఉన్న బేసిక్ పరిమితి రూ.2.5 లక్షలను పెంచొచ్చన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపించింది. అలాగే, గరిష్ట పన్ను 30 శాతం శ్లాబ్‌కు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచొచ్చనే అంచనా వ్యక్తమైంది. ► సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా రాయితీలు పెంచుతారని మూడింట ఒక వంతు మంది చెప్పారు. ► కరోనా మహమ్మారి దాదాపు ముగిసినట్టేనని, అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని 55 శాతం మంది కోరుతున్నారు. ► హైదరాబాద్ సహా 12 పట్టణాల్లో గత డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది జనవరి 15 మధ్య కాంటార్ సర్వే జరిగింది. 21–55 సంవత్సరాల వయసులోని 1,892 మంది వినియోగదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
ఎకానమీకి కరెంట్ అకౌంట్ సవాళ్లు!
ముంబై: భారత్ ఎకానమీకి కరెంట్ అకౌంట్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లో తీవ్ర లోటు (క్యాడ్) నమోదుకావచ్చని, ఇది ఏకంగా 36 నెలల గరిష్ట స్థాయిలో 3.4 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువలో) ఉండే వీలుందని తన తాజా నివేదికలో అంచనావేసింది. విలువలో ఇది 28.4 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో కరెంట్ అకౌంట్లో లోటులేకపోగా 0.9 శాతం మిగులు (6.6 బిలియన్ డాలర్లు) నెలకొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి మార్చి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 1.5 శాతం (13.4 బిలియన్ డాలర్లు). అయితే తదుపరి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఇది ఏకంగా 3.4 శాతానికి చేరుతుందన్న అంచనాలు నెలకొనడం గమనార్హం. ఇప్పటికే ఇక్రా హెచ్చరికలు... భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సీఏడీ– క్యాడ్ సవాళ్లు తప్పవని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే వెలువరించిన నివేదికలో అంచనావేసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా (120 బిలియన్ డాలర్లు) ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశంలోకి భారీ దిగుమతులు జరగ్గా, ఎగుమతులు నామమాత్రపు వృద్ధిని నమోదుచేసుకుంటున్నాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతోంది. ఫారెక్స్ దన్ను... అయితే దేశానికి ప్రస్తుతం ఫారెక్స్ విలువ దన్ను పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. కరెంట్ అకౌంట్... అంటే! ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
యుద్ధం తెచ్చిన చేటు.. ఆర్థిక శాఖ కీలక నిర్ణయాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్య లోటును కట్టడి చేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. నిర్దేశిత లక్ష్యాన్ని దాటకుండా చూసే క్రమంలో పన్ను వసూళ్లు సహా ఆదాయ, వ్యయాల లెక్కలను రోజువారీగా పర్యవేక్షించనుంది. మార్చి 15 నుంచి ఆర్థిక శాఖ దీన్ని అమలు చేయనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో దేశీ మార్కెట్లలో ఒడిదుడుకుల వల్ల ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడనుండటం .. ఉక్రెయిన్‌లో చిక్కుబడిపోయిన విద్యార్థులను రప్పించేందుకు అదనంగా వెచ్చించాల్సి వస్తుండటం తదితర అంశాలు ద్రవ్య లోటుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నులు, పన్నులయేతర వసూళ్లను రోజువారీగా పర్యవేక్షించడం వల్ల ప్రభుత్వం సత్వర దిద్దుబాటు చర్యలను తీసుకునేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ముందు రోజు నాటి వరకూ వచి్చన ఆదాయాన్ని మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల లోగా సమర్పించాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), కేంద్ర పరోక్ష పన్నులు..కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ)కి ఆదేశాలు వచ్చాయని వివరించాయి. పన్నుయేతర వసూళ్లు, డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా వచ్చే నిధులను రోజువారీ ప్రాతిపదికన అందించాల్సి ఉంటుందని అధికారి పేర్కొన్నారు. మార్చి 15 నుంచి 31 వరకూ వివిధ శాఖల ఆదాయ, వ్యయాల గణాంకాలను రోజువారీగా కేంద్ర వ్యయాల విభాగం కార్యదర్శికి అందించాలని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)కి సూచించినట్లు వివరించారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్య లోటు 6.9 శాతంగా ఉండనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 17.65 లక్షల కోట్ల పన్ను వసూళ్లను నిర్దేశించుకోగా కేంద్రం నికరంగా రూ. 15.47 లక్షల కోట్లు సాధించింది. అలాగే పన్నుయేతర వసూళ్ల లక్ష్యం రూ. 3.13 లక్షల కోట్లు కాగా ఇప్పటిదాకా రూ. 2.91 లక్షల కోట్లు (92.9 శాతం) వచి్చంది. అయితే, ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా రూ. 78,000 కోట్లు సమీకరించవచ్చని భావించినప్పటికీ ఇప్పటిదాకా కేవలం రూ. 12,423 కోట్లే వచ్చాయి. దీంతో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 60,000 కోట్లు సమీకరిస్తే దాదాపు లక్ష్యాన్ని చేరినట్లవుతుందని ప్రభుత్వం భావించింది. కానీ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీవోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వ వ్యయాలు రూ. 37.70 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తుండగా .. జనవరి ఆఖరు నాటికి ప్రభుత్వ వ్యయం రూ. 28.09 లక్షల కోట్లుగా నమోదైంది. -
జీఎస్టీ లోటు భర్తీ...
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లోటును భర్తీ చేయడానికి కేంద్రం గురువారం రూ.44,000 కోట్లను రుణంగా రాష్ట్రాలకు విడుదల చేసింది, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా నిధుల విడుదల పరిమాణం మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. నిధులను బ్యాక్–టు–బ్యాక్ లోన్లుగా విడుదల చేయడం... సెస్ వసూళ్ల నుండి ఇచ్చే ద్వైమాసిక జీఎస్టీ పరిహారానికి అదనం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 1.59 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపాలని, ఈ నిధులను (జీఎస్టీ పరిహార నిధిలో లోటు భర్తీకి) వనరుల అంతరాన్ని తీర్చడానికి ఒక బ్యాక్–టు–బ్యాక్ ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని ఈ ఏడాది మే 28వ తేదీన జరిగిన 43వ జీఎస్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ విధంగా ఇదే విధానం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రూ. 1.10 లక్షల కోట్లు విడుదల చేసింది. -
ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కట్టడిలోకి తీసుకోడానికి విశ్వసనీయ చర్యలు అవసరమని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి సవాళ్లు తొలగిన వెంటనే ఈ బాటలో చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ రుణ భారం ఇప్పటికి అటు ఆందోళనకరంగాకానీ లేదా ఇటు తగిన స్థాయిలో కానీ లేదని ఆయన విశ్లేíÙస్తూ, ఆర్థిక ఉద్దీపన చర్యలను కోరడానికి ముందు ఆయా వర్గాలన్నీ దేశ రుణ భారం అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెకించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ.30 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 15 శాతం. ద్రవ్యలోటు పెరుగుదలపై విభిన్న వాదనల నేపథ్యంలో ఎన్కే సింగ్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2019– 20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం (రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోలి్చతే ఇది 21.3 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సూచనలు.. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో సామాజిక ఆర్థిక పురోగతి వ్యవహారాల కేంద్రం (పీఎస్‌ఈపీ)– ప్రపంచబ్యాంక్ నిర్వహించిన సెమినార్లో 15 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన ప్రసంగంలో ద్రవ్యలోటుపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ద్రవ్యలోటు రూ.3.21 లక్షల కోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. 2021–22లో మొత్తం రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ అంచనాల్లో ఇది 6.8 శాతం) ఉంటుందన్నది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా.ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే నాటికి లక్ష్యంలో 21.3 శాతానికి ద్రవ్యలోటు చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తాజా గణాంకాలు ఇలా... - జూలై ముగిసే నాటికి ప్రభుత్వానికి వచ్చిన ఆదా యం రూ.6.83 లక్షల కోట్లు (బడ్జెట్ మొత్తం అంచనాల్లో 34.6%). ఇందులో రూ.5,29,189 కోట్లు పన్ను ఆదాయాలు. రూ.1,39,960 కోట్లు పన్నుయేతర ఆదాయాలు. రూ.14,148 కోట్లు నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్. నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్‌లో రూ.5,777 కోట్ల రుణ రికవరీలు, రూ.8,371 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినవి ఉన్నాయి. - ఇక ఇదే సమయంలో వ్యయాలు రూ.10.04 లక్షల కోట్లు (2021–22 బడ్జెట్లో 28.8 శాతం) వీటిలో రెవెన్యూ అకౌంట్ నుంచి రూ.8,76,012 లక్షల కోట్లు వ్యయమవగా, రూ.1,28,428 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి వ్యయం అయ్యాయి. రెవెన్యూ వ్యయాల్లో రూ.2,25,817 కోట్లు వడ్డీ చెల్లింపులుకాగా, రూ. 1,20,069 కోట్లు సబ్సిడీలకు వ్యయమయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 3.21 లక్షల కోట్లుగా ఉంది. 6.8 శాతం లక్ష్య సాధన కష్టమే! 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని ద్రవ్యలోటు 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్ -
2.74 లక్షల కోట్లకు చేరిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) జూన్ ముగిసే నాటికి రూ.2,74,245 కోట్లకు చేరింది. 2021–22లో మొత్తం రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ అంచనాల్లో ఇది 6.8 శాతం) ఉంటుందన్నది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా.ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసే నాటికి లక్ష్యంలో 18.2 శాతానికి ద్రవ్యలోటు చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తాజా గణాంకాలు ఇలా... ►జూన్ ముగిసే నాటికి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.5.47 లక్షల కోట్లు (బడ్జెట్ మొత్తం అంచనాల్లో 27.7 శాతం). ఇందులో రూ.4.12 లక్షల కోట్లు పన్ను ఆదాయాలు. రూ.1.27 లక్షల కోట్లు పన్నుయేతర ఆదాయాలు. రూ.7,402 కోట్లు నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్. నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్‌లో రూ.3,406 కోట్ల రుణ రికవరీలు, రూ.3,996 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినవి ఉన్నాయి. ►ఇక ఇదే సమయంలో వ్యయాలు రూ.8.21 లక్షల కోట్లు (2021–22 బడ్జెట్లో 23.6 శాతం) వీటిలో రెవెన్యూ అకౌంట్ నుంచి రూ.7.10 లక్షల కోట్లు వ్యయమవగా, రూ.1.11 లక్షల కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి వ్యయం అయ్యాయి. రెవెన్యూ వ్యయాల్లో రూ.1.84 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులుకాగా, రూ. లక్ష కోట్లు సబ్సిడీలకు వ్యయమయ్యాయి. ►వెరసి వాణిజ్యలోటు 2.74 లక్షల కోట్లుగా ఉంది. -
పెరుగుతున్న అప్పులపై ఆందోళన వద్దు, కేంద్రంపై ప్రశంసలు
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటుకు సంబంధించి ధైర్యం ప్రదర్శించాల్సిన సమయం ఇదని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ పేర్కొన్నారు. వృద్ధికి అవసరం అనుకుంటే, బడ్జెట్లో నిర్దేశించుకున్న దానికన్నా ఎక్కువగా ద్రవ్యలోటు లక్ష్యాలను మరింత పెంచాలని ఆయన సూచించారు. భారత్కోసం 25 సంవత్సరాల వృద్ధి రన్‌వే అవకాశం ఎదురుచూస్తోందని కూడా కామత్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి 8 శాతంలోపు వడ్డీరేట్లు, అపారమైన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) అవసరం అని సూచించారు. ద్రవ్యలోటుపై ప్రముఖ బ్యాంకర్‌గా కామత్ తాజా ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కామత్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే.. ద్రవ్యలోటు విషయంలో ఇప్పటికే కేంద్రం ధైర్యాన్ని ప్రదర్శించింది. దేశం నిరంతరాయంగా వృద్ధి బాటలో పయనిస్తుందని భావిస్తే, ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచడానికి సిద్ధమని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం సూచిస్తోంది. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోతోందని ఆందోళన అక్కర్లేదన్నది నా భావన. ఎందుకంటే ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు వివిధ వినూత్న ఫైనాన్షింగ్ అవకాశాలు ఉన్నాయి. నగదు ముద్రణ ఇందులో ఒకటి. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో తగిన స్థాయిలో ఉండడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. వడ్డీరేట్లు దిగువ స్థాయిలోనే కొనసాగుతాయని విశ్వసిస్తున్నాను మౌలిక రంగం పటిష్టతలో ఉన్న క్లిష్టతలను జాగ్రత్తగా ఎదుర్కొనాలి. వినూత్న, ఆధునిక ఫైనాన్షింగ్ విధానాలను ప్రభుత్వం ఇందుకు అనుసరించాల్సి ఉంటుంది.ఈ సమయంలో పన్ను రహిత మౌలిక సదుపాయాల బాండ్లను ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. అవసరమైతే ప్రభుత్వం మాత్రమే ఇటువంటివి జారీ చేయాలి. థర్డ్ పార్టీలను అనుమతించాల్సిన అవసరం లేదు. తయారీ విషయంలో భారత్ కంపెనీలకు గతం తరహాలో ఇప్పుడు పెద్దగా ఇబ్బంలు లేవు. తగిన నిధుల అందుబాటు ఇందుకు కారణం.కొత్త తరం కంపెనీలకు ప్రస్తుతం లభించిన ఒక పెద్ద అవకాశం ‘డిజిటల్ సూపర్‌సైకిల్’. తద్వారా ఉపాధి అవకాశాలను కొత్త తరం కంపెనీలు సృష్టించవచ్చు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడవచ్చు. భారత్‌కు సువిశాల తీరప్రాంతం ఉంది. దీనిని దేశం సద్వినియోగ పరచుకోవాలి. తీరప్రాంత ఆర్థిక మండళ్ల ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించాలి. అలాంటి మండళ్లను స్వయంగా ప్రారంభించాలి. 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. 2020–21లో ద్రవ్యలోటును 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్న కేంద్రం లక్ష్యాలన్ని కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఇది ఏకంగా 9.3 శాతానికి ఎగసింది. విలువలో ఇది రూ.18,21,461 కోట్లు. 2022 మార్చితో ము గిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతానికి కట్టడి చేయాలని 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేర్కొంది. అయితే కరోనా సెకండ్‌వేవ్ సవాళ్ల వల్ల ఈ లక్ష్యం 8 శాతం దాటిపోతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి నెల– ఏప్రిల్ ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 5.2 శాతానికి చేరింది. విలువలో రూ.78,699 కోట్లు. 2021–22లో 6.8 శాతం లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో రూ.15,06,812 కోట్లు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. -
ద్రవ్యలోటు ఆందోళన
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు తీవ్ర ఆందోళనకరమైన స్థాయికి చేరింది. డిసెంబర్ ముగిసే నాటికే రూ.11,58,469 కోట్లకు ఎగసింది. 2020–21 వార్షిక బడ్జెట్ లక్ష్యాలను దాటి ఏకంగా 145.5 శాతానికి చేరింది. రెవెన్యూ భారీగా తగ్గిపోవడం దీనికి నేపథ్యం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. నిజానికి ద్రవ్యలోటును రూ.7.96 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం) పరిమితం చేయాలని 2020 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. అయితే జూలైలోనే ఈ పరిమితిని దాటి ద్రవ్యలోటు పెరిగిపోయింది. గణాంకాలు ఇలా... గణాంకాల ప్రకారం డిసెంబర్ 2020 వరకూ భారత్ ప్రభుత్వం రూ.11.21 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. దీనిలో రూ.9,62,399 కోట్లు పన్ను వసూళ్లు. రూ.1,26,181 కోట్లు పన్ను యేతర వసూళ్లు. రూ.33,098 కోట్లు నాన్–డెట్ క్యాపిటలర్ రిసిట్స్. నాన్–డెట్ క్యాపిటలర్ రిసిట్స్‌లో రుణ రికవరీలు (రూ.14,202 కోట్లు), పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా వచ్చిన నిధులు (రూ.18,896 కోట్లు) ఉన్నాయి. అయితే కేంద్ర వ్యయాలు ఇదే సమయంలో రూ.22.80 లక్షల కోట్లుగా ఉన్నాయి. 7 శాతం పెరిగే అవకాశాలు...: 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతంగా నమోదయ్యింది. ఆదాయ వనరుల తగ్గుదల కారణం. కరోనా మహమ్మారితో రెవెన్యూ వసూళ్లు 2020–21లో మరింత పడిపోయాయి. దీనితో ద్రవ్యలోటు 7 శాతం దాటిపోతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. తొలి 3.5 శాతం (జీడీపీ) అంచనాలు... తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ స్థాయికి చేరతాయన్న అంశాన్ని తెలుసుకోడానికి ఫిబ్రవరి 1వ తేదీ ఆర్థికమంత్రి బడ్జెట్ సమర్పణ వరకూ ఆగాల్సి ఉంటుంది. -
కట్టుతప్పిన ఆదాయ–వ్యయాల వ్యత్యాసం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు అదుపులోనికి రాని పరిస్థితి నెలకొంది. వరుసగా రెండవ నెల ఆగస్టులోనూ బడ్జెట్ లక్ష్యాన్ని దాటిపోయి 109.3 శాతంగా నమోదయ్యింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) బుధవారం వెల్లడించిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21లో ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు ఉండాలని ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇది 2020–21 భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే 3.5 శాతం. ► అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికే ద్రవ్యోలోటు 109.3 శాతానికి అంటే రూ.8,70,347 కోట్లకు ఎగసింది. ► సీజీఏ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్–ఆగస్టు మధ్య ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.3,77,306 కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 16.8 శాతం మాత్రమే. ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.22.45 లక్షల కోట్ల ఆదాయాలు బడ్జెట్ లక్ష్యం. ► ఇక వ్యయాలు రూ.12,47,653 కోట్లుగా ఉంది. 2020–21 బడ్జెట్ అంచనాల్లో ఇది 41 శాతం. ► 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతం. ఏడేళ్ల గరిష్ట స్థాయి ఇది. అయితే కరోనా పరిణామాలు, పేలవ ఆదాయాలు వంటి సవాళ్ల నేపథ్యంలో ద్రవ్యలోటు శాతం జీడీపీలో 2020–21లో భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని అంచనా ఉంది. అక్టోబర్–మార్చి మధ్య రూ.4.34 లక్షల కోట్ల రుణ ప్రణాళిక 2020–21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చి) మధ్య రూ.4.43 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. కరోనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, దీనితో ప్రభుత్వ ఆదాయాల అంచనాలకు గండి పడ్డం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ చేసిన ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.12 లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది. సెప్టెంబర్ వరకూ రూ.7.66 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరిపింది. మిగిలిన రూ.4.34 లక్షల కోట్లను ద్వితీయార్థంలో సమీకరిస్తుంది. తన ద్రవ్యలోటును పూడ్చుకోడానికి కేంద్రం డేటెడ్ సెక్యూరిటీలు (నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన బాండ్లు) ట్రెజరీ బాండ్లపై ఆధారపడుతుంది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.80 లక్షల కోట్ల నికర మార్కెట్ రుణ సమీకరణలు జరపాలని 2020–21 బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించారు. అయితే కరోనా ప్రభావంతో ఈ మొత్తాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం మేలో నిర్ణయించింది. 2019–20లో కేంద్ర రుణ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు. -
ద్రవ్యలోటు లోగుట్టు కీలకం!
పెట్టుబడుల ఉపసంహరణ పట్ల అత్యాశ, పన్నేతర రాబడుల వృద్ధి, రక్షణరంగంతో సహా సబ్సిడీలపై గట్టి నియంత్రణ వంటి అంశాలపై స్వారీ చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆర్థికరంగ పటిషీ్టకరణ పథకాన్ని మళ్లీ పట్టాలమీదికి ఎక్కిస్తానంటూ శనివారం పార్లమెంటులో హామీ ఇచ్చారు. 2020–21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ, స్థూల దేశీయోత్పత్తిలో ప్రస్తుత సంవత్సరం ద్రవ్యలోటు 3.8కి దిగజారిపోయిందని అంగీకరించారు. వచ్చే సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 3.5 శాతానికి తగ్గిస్తానని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. అలాగే ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గించడానికి సవరించిన ద్రవ్యపటిషీ్టకరణ పథకం అమలు చేస్తామని కూడా మంత్రి చెప్పారు. ద్రవ్యలోటు 2021–22లో 3.3 శాతానికి 2022–23లో 3.1కి పడిపోతుందని సెలవిచ్చారు. అయితే ఇవి ద్రవ్యలోటుకు సంబంధించి పైకి కనిపించే లెక్కలు మాత్రమే కానీ ప్రభుత్వం చేస్తున్న అదనపు బడ్జెట్ రుణాల పూర్తి ప్రభావాన్ని ఇది బయటపెట్టడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అదనపు బడ్జెట్ రుణాలు (ప్రభుత్వం బాధ్యతపడే బాండ్ల జారీ ద్వారా కూడగట్టినవి, జాతీయ చిన్నమొత్తాల పొదుపుల నిధి నుంచి తీసుకున్న రుణాలకు కూడా ఆర్థిక మద్దతు లభించినవి) మొత్తం రూ. 1.73 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ తరహా రుణాలు 8 శాతం పెరిగి రూ. 1.86 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా. ఈ బడ్జెట్‌కు అవతల చేసే రుణాలు కేంద్రం మొత్తం రుణాల్లో కలిపేటట్లయితే, జీడీపీలో వాస్తవ ద్రవ్య లోటు 2019–20లో 4.5 శాతానికి, 2020–21లో 4.36 శాతానికి చేరుతుంది. ఆర్థికమంత్రి ఇలాంటి అద్భుతాన్ని సాధిస్తానని ఎలా సూచించారు అనేది ప్రశ్న. అయితే మొదటగా, 2019–20లో ద్రవ్యలోటును 3.3 శాతంకి తగ్గిస్తామని వాగ్దానం చేసిన ఆర్థిక మంత్రి కేవలం 0.5 శాతం తేడాతో దాన్ని 3.8 శాతానికి ఎలా నిర్వహించారు? ఈ క్రమంలో నికర పన్ను రాబడిలో రూ. 1.45 లక్షల కోట్లు తగ్గిందనీ, పెట్టుబడుల ఉపసంహరణ అంచనాలు దాదాపు రూ. 40 వేల కోట్లమేరకు తగ్గిపోయాయన్న విషయాన్ని ఆమె అంగీకరించాల్సి వచ్చింది. దీంతో బడ్జెట్ ముందస్తు అంచనాలో ఆమె ప్రతిపాదించిన మొత్తంలో రూ. 1.85 లక్షల కోట్ల రాబడి తగ్గిపోయింది. అదేక్రమంలో ఆర్థిక మంత్రి ప్రభుత్వ వ్యయాన్ని రూ. 88,000 కోట్ల మేరకు కుదించేశారు. దీంట్లో నాలుగింట ఒకవంతు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కుదించడం ద్వారా వచ్చిందేనని గుర్తుంచుకోవాలి. అలాగే ఆర్బీఐ నుంచి అదనపు మూలధనం బదిలీ కూడా ప్రభుత్వానికి కాస్త దోహదపడింది. ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో రూ. 36,000 కోట్లు వచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వ్యయంలో తగ్గుదల రూ. 61,000కు పరిమితం అయింది. బడ్జెట్ లోటుకు సంబంధించి 2020–21 సంవత్సరంలో అతిపెద్ద అద్భుతం చోటు చేసుకుందనే చెప్పాలి. తాజా బడ్జెట్లో రూ. 1,20,000 కోట్ల మేరకు పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించారు. అయితే గత సంవత్సరం బడ్జెట్లో అంచనా వేసుకున్న రూ.1,05,000 కోట్లనే ప్రభుత్వం సేకరించలేకపోయింది. తాజా బడ్జెట్లో రూ. 1,20,000 కోట్ల విలువైన పెట్టుబడుల ఉపసంహరణ చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించడం అత్యాశే కావచ్చు. ప్రభుత్వ రంగంలోని భారీ సంస్థలలో ప్రైవేటీకరణను పూర్తి చేయడంలో వైఫల్యం కారణంగానే పెట్టుబడుల ఉపసంహరణలో అంచనాలు తప్పాయి. దీనికి మించి ప్రభుత్వరంగ బ్యాంకులు, ద్రవ్య సంస్థలలో కేంద్రప్రభుత్వానికి ఉన్న ఈక్విటీ మొత్తంలో అదనంగా రూ. 90,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరిస్తానంటూ ప్రభుత్వం మరొక అత్యాశతో కూడిన ప్రకటన చేసింది. ఇక వ్యయం విషయానికి వస్తే 2020–21 బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యయాన్ని భారీగా అంటే రూ. 2.28 ట్రిలియన్ల మేరకు తగ్గించనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఈ విభాగాలకింద రూ. 2.27 లక్షల కోట్ల మేరకు సబ్సిడీలను అందిస్తున్నారు. అయితే ఈ సబ్సిడీలను ఎలా ఎంతమేరకు కుదిస్తారన్నది బడ్జెట్ స్పష్టం చేయలేదు. ఎరువులపై సబ్సిడీలు నిజానికి తగ్గుముఖం పట్టాయి. సబ్సిడీల హేతుబద్ధీకరణ పథకం ఏదైనా ఉంటే వచ్చే సంవత్సరం దాన్ని అమలు పర్చవచ్చు. రక్షణరంగ వ్యయంలో రెండు శాతం పెంచడంద్వారా రక్షణ బడ్జెట్ రూ.3.23 లక్షల కోట్లకు చేరుతుంది. ఇది ద్రవ్యలోటును అడ్డుకోవడంలో తోడ్పడుతుంది కానీ పెరుగుతున్న దేశ రక్షణ అవసరాలను ఇది తీర్చలేదు. చాలా సంవత్సరాలుగా రక్షణ రంగ వ్యయాన్ని అతి తక్కువగా మాత్రమే పెంచుతూ వస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 6,000 కోట్లు ఇస్తున్నారు. 2019–20లో ఈ పథకంలో భాగంగా రూ. 57,370 కోట్లు వెచ్చించగా ఈ సంవత్సరం దీన్ని రూ. 75,000లకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. (‘ది వైర్’ సౌజన్యంతో) ఎ.కె. భట్టాచార్య వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ద్రవ్యలోటును అదుపులో ఉంచాలి!
వాషింగ్టన్: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ సూచించారు. అయితే దేశ ఆదాయ అంచనాలు కొంత సానుకూలంగానే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. 2018లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం అయితే, 2019లో 6.1%గానే ఉంటుందని, 2020లో 7 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ మంగళవారం వెలువరించిన తన అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గోపీనాథ్ విలేకరులతో మాట్లాడారు. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగం, వినియోగ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణాల వంటి అంశాల్లో ఒడిదుడుకులు, సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
నేడు ఆర్బీఐ బోర్డు సభ్యులతో సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(నేడు) రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక అంశాలను ఈ సందర్భంగా ఆమె ఆర్బీఐకి వివరించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. ఈ ఏడాది(2019–20) ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తాజా పూర్తిస్థాయి బడ్జెట్లో తగ్గించిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్లో అంచనాలతో పోలిస్తే నికరంగా రూ.6,000 కోట్లు ఖజానాకు అదనంగా సమకూరనుండటంతో ఇది సాధ్యమైంది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020–21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా జీడీపీలో 3 శాతానికి కట్టడి చేయడం, ప్రాథమిక లోటును పూర్తిగా తొలగించడం వంటి అంశాలతో రోడ్‌మ్యాప్‌ను సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. అదేవిధంగా ద్రవ్యలోటు నుంచి కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలను మినహానయిస్తే, మిగిలిన లోటును ప్రాథమిక లోటుగా వ్యవహరిస్తారు. ఇక ఆర్బీఐ మిగులు నిధుల విషయానికొస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.90,000 కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు అంచనా. గతేడాదితో పోలిస్తే(రూ.68,000 కోట్లు) ఇది 32 శాతం అదనం. అంతేకాదు ఇప్పటిదాకా ఆర్బీఐ నుంచి కేంద్రం అందుకున్న అత్యధిక డివిడెండ్‌గా కూడా ఇది నిలవనుంది. -
అదుపుతప్పిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లెక్కలు ఆందోళన సృష్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడం, వ్యయాలు పెరగడం దీనికి కారణం. శుక్రవారం విడుదలయిన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గణాంకాలను పరిశీలిస్తే... ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ – 2019 మార్చి) మధ్య ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ఉండాలని సంబంధిత బడ్జెట్ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 3.3 శాతం. ►అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, 2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలను 6.24 లక్షల కోట్ల నుంచి రూ.6.34 లక్షల కోట్లకు (జీడీపీలో 3.4 శాతం) పెంచారు. చిన్న సన్నకారు రైతుల ఆదాయ పథకానికి ఫండింగ్ వల్ల ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచాల్సి వచ్చిందని తన బడ్జెట్ ప్రసంగంలో గోయల్ తెలిపారు. ►అయితే ఫిబ్రవరి ముగిసే నాటికి (ఆర్థిక సంవత్సరం ఇంకా నెల ఉండగానే) ఈ లోటు రూ. 8.51 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే లక్ష్యం (రూ.6.34 లక్షల కోట్లు)లో 100 శాతం దాటిపోయి మరో 34.2 శాతం (134.2 శాతం) పెరిగిందన్నమాట. ►అయితే కేంద్రం మాత్రం ద్రవ్యలోటును సవరిత అంచనాలను (రూ.6.34 లక్షల కోట్లు) ఎంతమాత్రం దాటనివ్వమని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం మరో నెల (మార్చి) కేంద్ర ఖజానాకు రానున్న ఆదాయం లోటును కట్టడి చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థికశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? ద్రవ్యలోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై సర్వత్రా ఇప్పుడు చర్చ నెలకొంది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం. -
డిసెంబర్‌కే ద్రవ్యలోటు 112.4 శాతానికి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును లక్ష్యానికి పరిమితం చేసే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 6.24 లక్షల కోట్లుగా (జీడీపీలో 3.3 శాతం) కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది. కానీ, తొమ్మిది నెలలకే, ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి జీడీపీలో ద్రవ్యలోటు 112.4 శాతానికి రూ.7.01 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం మధ్య లోటునే ద్రవ్యలోటుగా పేర్కొంటారు. నిజానికి అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోనూ మొదటి తొమ్మిది నెలల్లో ద్రవ్యలోటు 113.6 శాతంగా ఉండడం గమనార్హం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.53 శాతంగా ఉంది. దీన్ని 2018–19లో 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం నిర్ణయించగా, తాజాగా దీన్ని 3.4 శాతానికి (రూ.6.34 లక్షల కోట్లు) సవరిస్తున్నట్టు మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పలు వర్గాలకు ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాల రూపంలో అదనంగా రూ.20,000 కోట్ల మేర భారం పడనుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.17.25 లక్షల కోట్ల ఆదాయాన్ని తొలుత అంచనా వేయగా, దీన్ని రూ.17.29 లక్షల కోట్లకు సవరిస్తున్నట్టు మధ్యంతర బడ్జెట్ పేర్కొంది. అలాగే సవరించిన అంచనాల మేరకు ప్రభుత్వ వ్యయాలు రూ.24.42 లక్షల కోట్ల నుంచి రూ.24.57 లక్షల కోట్లకు పెరిగాయి. -
ద్రవ్యలోటు భయాలు
న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యలోటు భయాలు నెలకొన్నాయి. 2018–19 సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంత ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశించుకుందో, ఆ స్థాయిని ఇప్పటికే దాటిపోవడం దీని నేపథ్యం. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2018–19లో (ఏప్రిల్–మార్చి) ద్రవ్యలోటు రూ.6.24 లక్షల కోట్లుగా ఉండాని కేంద్ర బడ్జెట్ నిర్దేశించింది. అయితే ఇది అక్టోబర్ నాటికే నాటికే 6.48 లక్షల కోట్లకు పెరిగిపోయింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 103.9 శాతం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ లోటు బడ్జెట్ లక్ష్యంకన్నా దిగువగానే 96.1 శాతంగా ఉంది. కేంద్రానికి ఆదాయాలు తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జరగాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్, అక్టోబర్ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, వృద్ధికి సంబంధించి ప్రభుత్వ వ్యయాలు తగిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లక్ష్య సాధనపై కేంద్రం విశ్వాసం... అయితే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించగలమన్న విశ్వాసాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 3.3 శాతానికి మించకూడదన్న లక్ష్యం ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని మించవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. గత ఏడాది జీడీపీలో ద్రవ్యలోటు 3.53 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ రెవెన్యూ లక్ష్యం రూ.17.25 లక్షల కోట్లు. అయితే అక్టోబర్ వరకూ రూ.7.88 లక్షల కోట్ల రెవెన్యూ వసూళ్లు జరిగాయి. బడ్జెట్ లక్ష్యంలో ఇది 45.7 శాతం. వ్యయాలు రూ.14.56 లక్షల కోట్లుగా ఉంది. ఇది బడ్జెట్ లక్ష్యంలో 59.6 శాతం. -
డీసీఐఎల్‌లో వ్యూహాత్మక విక్రయాలకు లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: నాలుగు నౌకాశ్రయాల కన్సార్షియంకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐఎల్)లో ప్రభుత్వ వాటాల వ్యూహాత్మక విక్రయాలకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం డీసీఐఎల్‌లో ప్రభుత్వానికి 73.44 శాతం వాటా ఉంది. ‘‘డీసీఐఎల్‌లో పూర్తి 100 శాతం వాటాలను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, పారాదీప్ పోర్ట్ ట్రస్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కాండ్లా పోర్ట్ ట్రస్ట్‌లకు విక్రయించడానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సూత్రప్రాయ ఆమోదముద్ర వేసింది’’ అని ఆర్థికశాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. రెండువైపులా లాభమే...! పోర్టులతో డ్రెడ్జింగ్ కార్యకలపాలను మరింత అనుసంధానం చేయడానికి తాజా నిర్ణయం దోహదపడుతుందని, కంపెనీ కార్యకలాపాల విస్తరణకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని వివరించింది. డీసీఐఎల్‌లో భారీ పెట్టుబడులకు ఇది అవకాశమని వివరించింది. పోర్టులకూ ఈ నిర్ణయం ఆర్థిక ప్రయోజనాలను సృష్టిస్తుందని విశ్లేషించింది. ద్రవ్యలోటు లక్ష్యాలను ఎదుర్కొనడంలో భాగంగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్‌యూలు) పెట్టుబడుల ఉపసంహరణ (వాటాల విక్రయం) ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం... మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థల మధ్యే విలీనాలు, కొనుగోళ్లు, షేర్ల బైబ్యాక్ మార్గాలను కేంద్ర ఆర్థిక శాఖ తెరపైకి తీసుకొస్తోంది. ఆయా మార్గాల ద్వారా ఇప్పటికి రూ.15,000 కోట్లను సమకూర్చుకుంది. -
మందగమనానికి మందు.. ఈ 10 అంశాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణ రోడ్‌మ్యాప్‌నకు కట్టుబడి ఉండాలని, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం దీన్ని పణంగా పెట్టకూడదని కొత్తగా ఏర్పాటైన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) అభిప్రాయపడింది. గత నెలలో ఏర్పాటైన ఈ మండలి... బుధవారమిక్కడ నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ అధ్యక్షతన తొలిసారి సమావేశమయింది. ఆర్థిక వృద్ధి మందగమనాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ... దీన్ని గాడిలో పెట్టడానికి వచ్చే ఆరు నెలల్లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన 10 ప్రాధాన్యాంశాలను ఈ సమావేశం గుర్తించింది. వీటిలో ఉద్యోగాల కల్పనను పెంచటంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చెయ్యటం, అసంఘటిత రంగాల ఏకీకరణ, ఆర్థిక కార్యాచరణ, ద్రవ్య విధానం, ప్రభుత్వ వ్యయం, ఆర్థిక గవర్నెన్స్ వ్యవస్థలు, వ్యవసాయం, పశు సంవర్ధకం, వినియోగ ధోరణులు, ఉత్పత్తి, సామాజిక రంగం వంటివి ఉన్నాయి. ఆయా అంశాల కోసం తగిన వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా చేపట్టే చర్యలు చిట్టచివరి స్థాయి వరకూ వెళ్లేలా ఓ కన్నేసి ఉంచాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పాల్గొని ఆర్థిక వృద్ధికి పెట్టుబడులు, ఎగుమతులు పెంచడం సహా అందుబాటులో ఉన్న పలు మార్గాల గురించి మండలికి వివరించారు. వృద్ధి మందగమనం నేపథ్యంలో పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాన్ని మీరుతుందా? అన్న ప్రశ్నకు దేబ్రాయ్ స్పందిస్తూ... ద్రవ్య స్థిరీకరణ కసరత్తు నుంచి పక్క దారి పట్టకూడదన్న విషయమై మండలి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉందన్నారు. వచ్చే నెలలో మండలి మరోసారి అధికారికంగా భేటీ అవుతుందని, ఆ తర్వాత ప్రధానికి సిఫారసులు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.2%గా, వచ్చే ఏడాదికి 3%గా ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది. -
ద్రవ్యలోటు లక్ష్యాలను సాధిస్తాం
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ • అధిక పన్ను వసూళ్లు, డిజిన్వెస్ట్‌మెంట్ దన్ను న్యూఢిల్లీ: ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాలను కేంద్రం సాధిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. 2017–18 సంవత్సరానికి 3.2 శాతం, 2018–19 సంవత్సరానికి 3 శాతంగా బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే. పన్ను వసూళ్ల మెరుగుదల, పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా దీన్ని సాధిస్తామన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో అప్పటివరకూ వెల్లడించని ఆదాయంపై పన్నుల రూపంలో వచ్చే మొత్తాలను బడ్జెట్ పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని జైట్లీ తెలిపారు. పారిశ్రామిక మండళ్లు ఇక్కడ నిర్వహించిన బడ్జెట్ అనంతర సమావేశంలో జైట్లీ శుక్రవారం మాట్లాడారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. వ్యయాల మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలకన్నా అధికంగా పన్ను వసూళ్లు ఉంటాయని భావిస్తున్నాం. వచ్చే ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగుతుందన్న ఆశాభావంతో మేము ఉన్నాము. ⇔ పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి అధిక లక్షాలను నిర్దేశించుకున్నాం. ఇందుకు అనుగుణంగా సాధారణ బీమా కంపెనీలు సహా పలు పీఎస్‌యూ కంపెనీలను లిస్ట్ చేస్తాం. అలాగే లిస్టింగ్ అవసరాలకు అనుగుణంగా వాటాల ఉపసంహరణ జరుగుతుంది. ఆయా అంశాలు ప్రభుత్వానికి ఆదాయం పెంచుతాయని భావిస్తున్నాం. ⇔ అనవసర అడ్డంకులు, ఉన్నతాధికారుల అలసత్వం వంటి అంశాల నివారణకే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ (ఎఫ్ఐబీపీ)ని రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఆటోమేటిక్ రూట్ ద్వారానే భారీ పెట్టుబడులు రావాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందుకు తగిన రోడ్‌మ్యాప్ తయారీ ఉంటుంది. ⇔ బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వమే ఒక అసెట్ రీహాబిలిటేషన్ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆర్థిక సర్వే ప్రతిపాదన చర్చల దశలో ఉంది. త్వరలో దీని అమలు దిశగా అడుగులు పడతాయి. బ్యాడ్ బ్యాం క్కు కూడా ఇదే వర్తిస్తుంది. సంపన్నులపై పన్నేస్తే తప్పేమీలేదు సంపన్నులపై పన్నులకు సంబంధించి 10 శాతం సర్‌చార్జ్ విధించడంలో తప్పేమీలేదని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా అన్నారు. అనేకమంది పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. పన్ను చెల్లింపుదారుల సమాచారం ప్రకారం, 56 లక్షల మంది వేతన జీవుల మినహా, ఏడాది రూ.5 లక్షలపైన తమ ఆదాయాన్ని తమకుతాముగా వెల్లడిస్తున్నవారు దేశంలో కేవలం 20 లక్షల మందే ఉన్నారన్నారు. పన్నులు సరిగా సకాలంలో చెల్లించడం ద్వారా దేశాభివృద్ధికి దోహదపడే సమాజాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో నల్లడబ్బును పోగుచేసుకోడానికి అవకాశాలు సైతం సన్నగిల్లుతాయని జైట్లీ అన్నారు. -
పన్నుల హేతుబద్దీకరణ, డిజిటలైజేషన్ కీలకం
• బడ్జెట్‌పై హెచ్ఎస్బీసీ నివేదిక • ద్రవ్యలోటు గాడి తప్పరాదని సూచన న్యూఢిల్లీ: పన్నుల హేతుబద్ధీకరణ, డిజిటలైజేషన్ కోసం చర్యలు వచ్చే బడ్జెట్ కీలక అంశాల్లో కొన్నని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక అంచనావేసింది. వీటితోపాటు గ్రామీణాభివృద్ధికి అధిక కేటాయింపులు, సామాజిక వ్యయాల పటిష్టత కూడా బడ్జెట్లో చోటుచేసుకుంటాయని భావిస్తున్నట్లు నివేదిక వివరించింది. ద్రవ్యలోటు బాట తప్పరాదు... అయితే ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు బాట (వచ్చే ఏడాది లక్ష్యం జీడీపీలో 3 శాతం) తప్పరాదని నివేదిక కేంద్రానికి సూచించింది. అలాగే వస్తుసేవల పన్ను వల్ల జరిగే నష్టాన్ని రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో కేంద్రం భర్తీ చేయాలని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు. కంపెనీలకు మినహాయింపులను తగ్గిస్తూ... పన్నులను ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి క్రమంగా తీసుకువస్తారని విశ్వసిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు, రహదారులు, నీటిపారుదల రంగాలపై కేంద్రం దృష్టి సారించే వీలుందని అన్నారు. డిజిటలైజేషన్‌కు తగిన ప్రోత్సాహకాలను బడ్జెట్ కల్పిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కఠిన ప్రతిపాదనలు ఉండకపోవచ్చు: డీఅండ్‌బీ రాబోయే బడ్జెట్లో కఠిన ప్రతిపాదనలేమీ ఉండకపోవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. ఒకవైపు ఆర్థిక అనిశ్చితి, మరోవైపు డీమోనిటైజేషన్ వల్ల డిమాండ్‌పరమైన షాక్‌లతో దేశం పెనుసవాళ్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణమని వివరించింది. సంపన్న దేశాల్లో మందగమన ప్రభావం మరిన్ని దేశాలకు విస్తరించే రిస్కులు ఎక్కువగా ఉన్నాయని డీఅండ్‌బీ తెలిపింది. నోట్ల రద్దుతో భారత ఎకానమీ సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని వివరించింది. అలాగే, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరగడం.. దేశీయంగా వృద్ధి వేగం మందగించడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయని డీఅండ్‌బీ పేర్కొంది. -
భారత్ లాంటి దేశాలు ద్రవ్యలోటును తగ్గించాల్సిందే!
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సూచన న్యూఢిల్లీ: భారత్ లాంటి అధిక ప్రభుత్వ రుణ భారమున్న దేశాలు రుణంసహా ద్రవ్యలోటును తగ్గించడానికి తమ మధ్య కాలిక ప్రణాళికలను తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జాంగ్ తావో సూచించారు. ప్రభుత్వ–ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. దీనిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.5 శాతానికి (రూ. 5.33 లక్షల కోట్లు)కట్టడి చేయాలని, వచ్చే ఏడాది 3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని రానున్న ఫిబ్రవరి 1 బడ్జెట్ పక్కనబెట్టే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఐఎంఎఫ్ అధికారి తాజా ప్రకటన చేయడం గమనార్హం. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా ఫైనాన్షియల్ ఫోరమ్ సమావేశంలో ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... ⇔ భారత్‌తోపాటు జపాన్, మలేషియాలు కూడా ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉంది. ⇔ ప్రపంచ వృద్ధిలో ఆసియా దేశాలు కీలకపాత్ర పోషిస్తాయి. 2017, 2018 సంవత్సరాలో ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థల వృద్ధి 5 శాతంగా ఉంటుంది. ⇔ 2016లో ఆసియా ఫైనాన్షియల్ మార్కెట్లు సానుకూలంగానే ఉన్నాయి. సవాళ్లను తట్టుకుని నిలబడ్డాయి. ఇదే తీరు కొనసాగుతుందని భావిస్తున్నాం. ⇔ నోట్ల రద్దు వినియోగంపై తాత్కాలిక ప్రభావం చూపుతుందన్న అంచనాలతో ఐఎంఎఫ్ 2016–17 జీడీపీ వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం జరిగింది.