న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు విషయంలో భారత్ సవాళ్లను ఎదుర్కోనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- స్టాండెర్ట్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) పేర్కొంది. ఆదాయాలు బడ్జెట్ లక్ష్యాల మేరకు వసూలు కాకపోవడం, సబ్సిడీ కోతల్లో ఆలస్యం వంటి అంశాలు ద్రవ్యలోటుకు సవాళ్లు విసిరే అంశాలని వివరించింది. ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ, ఇది అంత సులభం కాదన్నది తమ అభిప్రాయమని ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ సర్వీసెస్ భారత్ వ్యవహారాల విశ్లేషకుడు కైరన్ క్యూరీ పేర్కొన్నారు.
ఆహారం, ఇంధనం, ఎరువుల విషయంలో సబ్సిడీలకు సంబంధించిన అంశాలు ద్రవ్యలోటు లక్ష్యానికి సవాళ్లని ఆయన విశ్లేషించారు. అయితే రెవెన్యూ వైపు కొంత మెరుగుదల వల్ల స్వల్పకాలంలో మాత్రం ద్రవ్య క్రమశిక్షణ మెరుగ్గా ఉండే వీలుందన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు, పన్ను పరిధి పెంపునకు ప్రభుత్వ ప్రయత్నాలు కొంత సానుకూల ఫలితాలను ఇచ్చే వీలుందని వివరించారు.
భారత్‌కు ద్రవ్యలోటు సవాళ్లు: ఎస్‌అండ్‌పీ
Published Mon, Feb 1 2016 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM
Advertisement