![Low Investment Business Ideas to Earn Lakh and Crores Rupees in Mahakumbh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/maha-main.jpg.webp?itok=9k2GcrW1)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకూ ఈ పవిత్ర ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఉత్సవం నేపధ్యంలో కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోగా, మరోవైపు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారు.
టూత్ స్టిక్స్ విక్రయిస్తూ..
మహా కుంభమేళా(Kumbh Mela)లో కొందరు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్న ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వీరిలో కొందరు టూత్ స్టిక్స్ విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తుండగా, మరికొందరు టీ విక్రయిస్తూ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇటీవల ఒక కుర్రాడు కుంభమేళాలో టూత్ స్టిక్స్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆ కుర్రాడు ఈ ఐడియా తన గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాడు. టూత్ స్టిక్స్ అమ్ముతూ తాను రోజూ వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆ కుర్రాడు ఆ వీడియోలో తెలిపాడు.
టీ అమ్ముతూ రోజుకు రూ. 15 వేలు
మరోవ్యక్తి మహా కుంభ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని టీ తోపాటు భేల్ పూరి విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ కుర్రాడు తాను భేల్ పూరీలు తయారు చేస్తూ, టీ తయారు చేసే పనికోసం మరో కుర్రాడిని నియమించి, రోజుకు రూ. 15 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి మరో వీడియోలో ఒక కుర్రాడు తన చేతిలో కెటిల్ పట్టుకుని కుంభమేళా ప్రాంతమంతా కలియతిరుగుతూ టీ విక్రయిస్తున్నాడు. తాను టీ విక్రయిస్తూ(Selling tea) రోజుకు ఎనిమిది నుంచి 10 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.
తిలకం దిద్దుతూ రోజుకు రూ. 20 వేలు
మహా కుంభమేళాకు వచ్చిన భక్తులకు తిలకం దిద్దతూ ఒక వ్యాపారి రోజుకు పది వేల నుంచి 20 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడంటే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది నిజం.. ఆ వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం అతను తాను తిలకం దిద్దిన ఒక్కో వ్యక్తి నుంచి రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నాడు. రోజుకు తాను రెండువేల మందికి తిలకం దిద్దుతున్నానని తెలిపాడు. ఈ మహా కుంభమేళా ముగిసేనాటికి తాను ఎనిమిది లక్షల రూపాయల వరకూ సంపాదించగలనని ఆ వ్యాపారి చెబుతున్నాడు.
నాణేలు ఏరుతూ రోజుకు రూ. 4 వేలు
కుంభమేళా వీడియోల్లో మరో వీడియో అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియోలో ఒక కుర్రాడు గంగానదిలో ఐస్కాంతం సాయంతో నాణేలను వెదుకుతున్నాడు. భక్తులు గంగానదిలో విసిరిన నాణేలను సేకరిస్తున్నట్లు ఆ కుర్రాడు చెప్పాడు. ఈ విధంగా తాను రోజుకు నాలుగు వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నట్లు తెలిపి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష
Comments
Please login to add a commentAdd a comment