
కుంభమేళాకు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా తన అందమైన తేనెకళ్ల కారణంగా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఒక్కదెబ్బతో ఈమె ఖాతాలోకి లెక్కలేనంతమంది అభిమానులు చేరిపోయారు. ఇదే నేపధ్యంలో మోనాలిసా ఒక సినిమా అవకాశాన్ని, ఒక ప్రకటనలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నిరక్షరాస్యురాలైన మోనాలిసా ఇప్పుడు అక్షరాలు దిద్దేపనిలో పడింది.
ఇంటర్నెట్ సస్సేషన్‌గా మారిన మోనాలిసా ఏనాడూ పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు. అయితే ఇప్పుడు ఆమెకు చదువు అవసరం ఏర్పడింది. దీనిని గుర్తించిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు చదువు నేర్పించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటీవల ఆయన షేర్ చేసిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మోనాలిసా హిందీలో అక్షరాలు దిద్దుతున్నట్లు కనిపిస్తోంది. స్లేట్ పెన్సిల్ తీసుకుని, మోనాలిసా అక్షరాలు దిద్దటాన్ని మనం ఆ వీడియోలో చూడవచ్చు.
ఎవరూ ఊహించని విధంగా మోనాలిసా జీవితం మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే, మరోవైపు అక్షర జ్ఞానాన్ని కూడా మోనాలిసా పెంపొందించుకుంటోంది. ఆమె నటిస్తున్న చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నదని సమాచారం.
ఇది కూడా చదవండి: రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment