సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించిన తాజా పరిణామాలతో పాటు దేశీయ, అంతర్జాతీయంగా వెల్లడికానున్న ఆర్థిక గణాంకాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశకు అత్యంత కీలకంగా ఉండనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలకు తోడు భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించడంలో కీలకంకానున్నాయని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ ఫండ్ మేనేజర్ – హెడ్– ఈక్విటీ రీసెర్చ్ í కురియన్ అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే మార్కెట్ ప్రతికూలంగా స్పందించనుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా, సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషించారు.
స్థూల ఆర్థికాంశాల ప్రభావం..
మే నెల ద్రవ్య లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి గణాంకాలు, మార్చి త్రైమాసిక కరెంట్ అకౌంట్ మంగళవారం వెలువడనున్నాయి. జూన్ నెల మార్కిట్ తయారీ పీఎంఐ బుధవారం విడుదలకానుండగా.. సేవారంగ పీఎంఐ శుక్రవారం వెల్లడికానుంది. దేశీ ఆటో పరిశ్రమ జూన్ నెల అమ్మకాల డేటా బుధవారం నుంచి వెల్లడికానుంది. మరోవైపు జూన్ 9–10 తేదీల్లో జరిగిన అమెరికా ఫెడ్ సమావేశానికి సంబంధించిన మినిట్స్ బుధవారం వెల్లడికానున్నాయి.1,420 కంపెనీల ఫలితాలు: ఎంఆర్‌ఎఫ్, ఓఎన్‌జీసీ, వొడాఫోన్ ఐడియాసహా దాదాపు 1,420 కంపెనీల ఫలితాలు ఈ వారం వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment