
న్యూఢిల్లీ: ద్రవ్యలోటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలానికి బడ్జెట్ అంచనాల్లో 96.1 శాతానికి చేరుకున్నట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాలు వెల్లడించాయి. ఆదాయం తక్కువగా రావడం, వ్యయం పెరగడం వల్ల ద్రవ్యలోటు పెరిగింది. సీజీఏ గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ వ్యయానికి, ఆదాయానికి మధ్య గల వ్యత్యాసం(ద్రవ్యలోటు) ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో రూ.5.25 లక్షల కోట్లకు చేరింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 96.1 శాతానికి సమానం.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ.4.2 లక్షలు కోట్లుగా ఉంది. ఇది ఆ సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో 79.3 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటును 3.2 శాతానికి పరిమితం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. తాజా గణాంకాలను చూస్తే.. ఈ లక్ష్య సాధన కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment