
పన్ను లక్ష్యాన్ని సాధించాలి
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లపై ఆర్థికమంత్రి పి.చిదంబరం సోమవారం ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల చీఫ్ కమీషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చితే 19% అధికంగా రూ.6.68 లక్షల కోట్ల స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 12.33% వృద్ధితో రూ.4.81 లక్షల కోట్ల స్థూల వసూళ్లు జరిగాయి. ఇక పరోక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్-నవంబర్ మధ్య 5% వృద్ధితో రూ.3.07 లక్షల కోట్లుగా ఉన్నాయి.