పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకే..!
► బ్యాంకుల్లోనే పింఛన్ల చెల్లింపు
►ఖాతా వివరాలు సేకరిస్తున్న ఎంపీడీవోలు
►జనవరి నుంచి అమలు చేసేందుకు కసరత్తు
► ఉమ్మడి జిల్లాలో 3.64లక్షల లబ్ధిదారులు
ఆదిలాబాద్ రిమ్స్ : ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులకు వివిధ రకాల పింఛన్ డబ్బులను నగదు రూపంలో చేతికి అందిస్తుండగా అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. వీటికి చెక్ పెట్టి పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఆసరాతోపాటు బీడీ కార్మికులకు ఇచ్చే జీవన భృతి, ఎరుుడ్‌స బాధితులకు పంపిణీ చేసే పింఛన్ డబ్బులు కూడా బ్యాంక్‌ఖాతాలో జమ చేయనుంది. ఈ ప్రక్రియ అమలులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఎంపీడీవోలు పింఛన్‌దారుల ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించిన ప్రభుత్వం బ్యాంకుల ద్వారానే పింఛన్ డబ్బులు చెల్లించనుంది.
నాలుగు జిల్లాల్లో 3.64లక్షల లబ్ధిదారులకు..
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల,కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని కేటగిరీలకు సంబంధించి పింఛన్ లబ్ధిదారులున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 64,841, నిర్మల్‌లో 1,36,345, మంచిర్యాలలో 86,360, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 46,611 మంది ఉన్నారు. వీరందరికీ ప్రతీ నెల రూ.50కోట్లపైనే నగదు రూపంలో పింఛన్ డబ్బులు చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా వేలిముద్రలు తీసుకుని ప్రతినెలా పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారుల చేతికి అందిస్తున్నారు. అరుుతే వచ్చే ఏడాది జనవరి నుంచి వీరికి బ్యాంకుల ద్వారానే చెల్లింపులు చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు ఉన్న పెన్షనర్‌ల సంఖ్య.. బ్యాంకులు లేని గ్రామాల సంఖ్య.. తదితర వివరాలను ఇప్పటికే ఎంపీడీవోలు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి ఈ అంశాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో..
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ చెల్లింపులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పింఛన్ చెల్లింపుల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే బ్యాంకుల ద్వారానే సాధ్యమవుతుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు లబ్ధిదారులకు సరైన న్యాయం జరుగుతుంది. పింఛన్‌దారులకు ఎంతమందికి ఖాతాలున్నారుు.. ఎంతమందికి లేవు.. అనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి ఖాతాలు కలిగిన వారి వివరాలను ఎంపీడీవో లాగిన్‌లో నమోదు చేస్తారు. లబ్ధిదారుల నుంచి అకౌంట్ నంబర్, ఐఎఫ్‌టీ కోడ్ తీసుకుంటారు. పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో లాగిన్‌లో ఈ డాటా మొత్తాన్ని నమోదు చేస్తారు. బ్యాంకు ఖాతాలు లేని వారు ఖాతాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు.