న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల సంఖ్య డిసెంబర్‌లో 1,673 కోట్లు నమోదయ్యాయి. నవంబర్‌తో పోలిస్తే ఇవి 8 శాతం పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. నవంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,548 కోట్లుగా ఉంది. ఇక లావాదేవీల విలువ గత నెలలో రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది రూ.21.55 లక్షల కోట్లు నమోదైంది. లావాదేవీల సంఖ్య డిసెంబర్‌లో సగటున రోజుకు 53.96 కోట్లు, నవంబర్‌లో 51.6 కోట్లుగా ఉంది. లావాదేవీల విలువ డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.74,990 కోట్లు, నవంబర్‌లో రూ.71,840 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: భారత్ తయారీ రంగం డీలా
దక్షిణాఫ్రికాలో వరుణ్ బెవరేజెస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పానీయాల దిగ్గజం పెప్సీకో(Pepsico)కు ప్రధాన విభాగం వరుణ్ బెవరేజెస్ విదేశాల్లో పెట్టుబడులకు తెరతీసింది. దక్షిణాఫ్రికాలోని అనుబంధ సంస్థ బెవ్‌కోలో రూ.412 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అక్కడ పెప్సీకో నుంచి లైసెన్స్ పొందిన ప్రొడక్టుల తయారీ, పంపిణీ చేపట్టే బెవ్‌కో సొంత బ్రాండ్ల నాన్‌ఆల్కహాలిక్ పానీయాలను సైతం విక్రయిస్తోంది. తాజా పెట్టుబడుల్లో భాగంగా బెవ్‌కో నుంచి 19.84 లక్షల సాధారణ షేర్లను వరుణ్ బెవరేజెస్ అందుకుంది. తద్వారా బెవ్‌కో మూలధనంలో 2.42 శాతం వాటాను పొందింది. దీంతో బెవ్‌కో ప్రస్తుత రుణ చెల్లింపులతోపాటు, బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు వరుణ్ బెవరేజెస్ సహకరించింది.
Comments
Please login to add a commentAdd a comment