Payments Bank Operations
-
1,673 కోట్ల యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల సంఖ్య డిసెంబర్లో 1,673 కోట్లు నమోదయ్యాయి. నవంబర్‌తో పోలిస్తే ఇవి 8 శాతం పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. నవంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,548 కోట్లుగా ఉంది. ఇక లావాదేవీల విలువ గత నెలలో రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది రూ.21.55 లక్షల కోట్లు నమోదైంది. లావాదేవీల సంఖ్య డిసెంబర్లో సగటున రోజుకు 53.96 కోట్లు, నవంబర్‌లో 51.6 కోట్లుగా ఉంది. లావాదేవీల విలువ డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.74,990 కోట్లు, నవంబర్‌లో రూ.71,840 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: భారత్ తయారీ రంగం డీలాదక్షిణాఫ్రికాలో వరుణ్ బెవరేజెస్ పెట్టుబడులున్యూఢిల్లీ: పానీయాల దిగ్గజం పెప్సీకో(Pepsico)కు ప్రధాన విభాగం వరుణ్ బెవరేజెస్ విదేశాల్లో పెట్టుబడులకు తెరతీసింది. దక్షిణాఫ్రికాలోని అనుబంధ సంస్థ బెవ్కోలో రూ.412 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అక్కడ పెప్సీకో నుంచి లైసెన్స్ పొందిన ప్రొడక్టుల తయారీ, పంపిణీ చేపట్టే బెవ్కో సొంత బ్రాండ్ల నాన్ఆల్కహాలిక్ పానీయాలను సైతం విక్రయిస్తోంది. తాజా పెట్టుబడుల్లో భాగంగా బెవ్కో నుంచి 19.84 లక్షల సాధారణ షేర్లను వరుణ్ బెవరేజెస్ అందుకుంది. తద్వారా బెవ్కో మూలధనంలో 2.42 శాతం వాటాను పొందింది. దీంతో బెవ్కో ప్రస్తుత రుణ చెల్లింపులతోపాటు, బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు వరుణ్ బెవరేజెస్ సహకరించింది. -
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్స్ షురూ
-
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్స్ షురూ
న్యూఢిల్లీ : ఎన్నో నెలలు జాప్యం అనంతరం ఈ-వాలెట్ దిగ్గజం పేటీఎం, పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్లను ప్రారంభించేందుకు సిద్దమైంది. మే 23 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ కార్యకలాపాలు సాగించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తుది అనుమతులు లభించినట్టు పేటీఎం తెలిపింది. ''పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్(పీపీబీఎల్) కోసం ఆర్బీఐ నుంచి తుది లైసెన్సులు పొందాం. 2017 మే 23 నుంచి కార్యకాలాపాలు ప్రారంభిస్తాం'' అని పబ్లిక్ నోటీసులో పేర్కొంది. తమ వాలెట్ బిజినెస్ లను కూడా ఈ కంపెనీలోకే బదిలీ చేస్తామని, దీనికి ఇప్పటికే 21.8 కోట్ల మంది యూజర్లున్నారని పేటీఎం చెప్పింది. పేటీఎం సొంతమైన వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేరు మీదనే ఈ లైసెన్సులను పీపీబీఎల్ పొందింది. పీపీబీఎల్ లో పేటీఎం వాలెట్ కలుపడం ఇష్టంలేని వినియోగదారులు మే 23 కంటే ముందు పేటీఎంకు ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేటీఎం వెల్లడించింది.దీంతో వాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాలను వినియోగదారుల అకౌంట్లోకి బదిలీ చేస్తామని చెప్పింది. మే 23 లోపలే వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని పేటీఎం సూచించింది. ఆరునెలల నుంచి వినియోగించని ఈ వాలెట్లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్‌లోకి మారుస్తారు. దీంతోపాటు పేటీఎం బ్యాంక్ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది. Coming Soon @PaytmBank ! #23May pic.twitter.com/YHpHk7A93h — Vijay Shekhar (@vijayshekhar) May 17, 2017