అలంపూర్ : ప్రభుత్వం రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) సమస్య ప రిష్కారం దిశగా తుమ్మిళ్ల ఎత్తిపోతల ప థకం నిర్మాణానికి సన్నహాలు చేస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ.. పోరాటాల ఫలితంగా ఆర్డీఎస్ సమస్య పరిష్కారంలో ఒక కదలిక వచ్చింది. అయితే ఆర్డీఎస్ కాలువల నిర్వహణ విషయంలో కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆర్డీఎస్ రైతుల నుంచి పన్నులు వసూలు చేసి కాలువల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం భా విస్తోంది. కాలువల్లో ముళ్ల పొదలు, సి ల్టు తొలగింపు పనులకై ప్రతిపాదనలు చేసినా నిధులు మంజూరు కావడం లే దు. దీంతో కాలువల నిర్వహణపై అ యోమయం నెలకొంది.
ఆర్డీఎస్ పరిస్థితి ఇది....!
అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, అ యిజ మండలాల్లో 87,500ఎకరాలు, క ర్ణాటక రాష్ట్ర పరిధిలోని 5879 ఎకరాల ఆయకట్టుకు ఆర్డీఎస్ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఆనకట్ట వ ద్ద సిల్టు పేరుకుపోవడం, ఆనకట్ట ఎత్తు పెంచే పనులు అసంపూర్తిగా ఉండడం, కర్ణాటక పరిధిలో ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడం, కర్ణాటకలో నాన్‌ఆయకట్టు పెరగడం వంటి సమస్య ల కారణంగా ఆర్డీఎస్ ద్వారా కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వాడుకోలేని పరిస్థితి నెలకొంది. 17.1 టీఎం సీల్లో కేవలం 3 నుంచి 4 టీఎంసీల నీరు మాత్రమే వస్తున్నది. ఈ నీటితో 20వేల నుంచి 30 వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది.
నీళ్లే రావు.. పన్నుల వసూళ్లు ఎలా...?
ఆర్డీఎస్ ద్వారా అందాల్సిన సాగు నీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సుమారు 35 ఏ ళ్లుగా సాగు నీరందడం లేదు. ఆర్డీఎస్ ప రిధిలోని 29వ డిస్ట్రిబ్యూటరీ వరకు నీళ్లు రావడమే గగనంగా మారింది. ఈ ప రిస్థితితో ఆర్డీఎస్ కాలువల్లో ముళ్లపొద లు పెరిగాయి. వర్షపు నీరు, ముళ్ల కంప, చెత్తా చెదారంతో కాలువలు అధ్వాన స్థితి చేరాయి. అనేకచోట్ల కాలువలు శిథిలమయ్యాయి. కాలువల ద్వారా సాగునీరు పుష్కలంగా అందిస్తే రైతుల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో ముళ్ల పొదలు తొలగించడం, డిస్ట్రిబ్యూటరీల వద్ద సిల్టు తొలగించడం వంటి పనులు చేసే అవకాశం ఉండేది.
ప్రస్తుతం నీళ్లు అందని పరిస్థితి ఉండటంతో రైతుల నుంచి పన్నులు వసూళ్లు చేసే పరిస్థితి ఇక్కడ లేదు. కానీ ఈ విషయం మరిచిన ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతో కాలువల నిర్వహణ చేపట్టాలని చెబుతుంది. కాలువల్లో సిల్టు పనులు, ముళ్ల పొదలు తొలగించడానికి పంపుతున్న ప్రతిపాదనలకు నిధులు మంజూరు కావడం లేదని ఆర్డీఎస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాలువలు నిర్వహణ లేక అవి చాలావరకు కూలిపోతున్నా యి. ఇదే పరిస్థితి కొనసాగితే డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు మరింత శిథిల మయ్యే ప్రమాదం ఉండడంతో రైతులు అందోళన చెందుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
ఆర్డీఎస్ ప్రధాన కాలువల్లో సిల్టు తొలగించే పనుల కోసం రూ.1.30 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో సిల్టు తొలగించే పనులు, ముళ్ల పొదల తొలగింపు కోసం ప్రతిపాదనలు చేసినా నిధులు మాత్రం ఇంకా మంజూరు కాలేదు.
- రాజేంద్రం, ఆర్డీఎస్ ఈఈ
పన్నులు చెల్లిస్తేనే.. పనులట
Published Fri, Aug 7 2015 4:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement