పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి | Taxes should be collected Accelerate | Sakshi
Sakshi News home page

పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి

Published Sat, May 2 2015 2:32 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Taxes should be collected Accelerate

- జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి
వికారాబాద్ రూరల్:
గ్రామ పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లను జూన్ 30లోపు పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి సూచించారు. శుక్రవారం స్థానిక రవీంద్ర మండపంలో ఈఓపీఆర్డీలు, డివిజన్‌స్థాయి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్నుల వినియోగంలో అవకతవకలు జరిగితే సస్పెండ్ చేయడంతోపాటు కార్యదర్శుల నుంచి డబ్బులు రికవరీ చేస్తామన్నారు. వసూలైన పన్నులను గ్రామాల్లో మంచినీటి సమస్యలు తీర్చేందుకు ఉపయోగించాలన్నారు. దోమ మండలంలో అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.

రెండు లక్షలు రికవరీ చేశామని, ఒకసారి అక్రమాల్లో దొరికితే ఇంక్రిమెంట్లు ఉండవని, సస్పెండ్ అవుతారని అన్నారు. మే 15 తేదీలోపు జీపీ రికార్డులను కంప్యూటర్లలో అప్‌లోడ్ చేయాలన్నారు. వికారాబాద్, నవాబుపేట మండలాలకు సంబంధించిన పంచాయతీ రికార్డులను కంప్యూటరీకరణ వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన యాలాల ఈఓఆర్డీపై డీపీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ స్థాయి పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఈఓపీఆర్‌డీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement