బీసీసీఐ పన్ను ఎంత కట్టిందో తెలుసా?
బీసీసీఐ పన్ను ఎంత కట్టిందో తెలుసా?
Published Sat, Sep 9 2017 4:50 PM | Last Updated on Tue, Sep 19 2017 1:36 PM
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానం జీఎస్టీలోకి తీసుకొచ్చిన తర్వాత తొలి నెలల్లో భారీగా పన్ను వసూలయ్యాయి. అంచనాల కంటే జీఎస్టీ వసూలు బాగానే వచ్చాయి. దేశంలోనే అత్యంత ధనికవంతమైన క్రీడా సంస్థ బీసీసీఐ, జీఎస్టీ అమలు తర్వాత రూ.44 లక్షల పన్నులు చెల్లించింది. బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. జూలై నెల కింద 44 లక్షల 29,516 రూపాయల పన్నులు చెల్లించినట్టు బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
భారత జాతీయ జట్టు ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్‌కు కూడా ఐదు నెలల కాలానికి రూ.58 లక్షల 87,139ను బీసీసీఐ చెల్లించింది. అంతేకాక 2015-16 సీజన్‌ల్లో అంతర్జాతీయ మ్యాచుల నుంచి ఆర్జించిన గ్రాస్ రెవెన్యూలను కొంతమంది ప్లేయర్లకు బీసీసీఐ పంచింది. వీరిలో ఎక్కువగా స్టువర్ట్ బిన్నీకి రూ.92 లక్షలు, హర్బజన్ సింగ్‌కు రూ.62 లక్షలు, స్పిన్నర్ అక్సర్ పటేల్‌కు రూ.37.51 లక్షలు, ఉమేశ్ యాదవ్‌కు రూ.34.79 లక్షలు చెల్లించినట్టు తెలిసింది.
Advertisement
Advertisement