న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని ఆర్‌ఎస్‌ఎస్ ట్యాక్స్‌గా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అభివర్ణించారు. దీని కారణంగా ప్రజలపై విపరీతంగా పన్ను భారం పెరిగిందనీ, అందుకే ఇది ‘చెడుమాట’గా మారిందన్నారు. ‘అది ఒక విచిత్రమైన జంతువు లాంటిది. సగటు జీవిపై జీఎస్టీతో విపరీత భారం మోపారు. ఒకే పన్ను రేటు ఉంటే జీఎస్టీ అనొచ్చు. అనేకమార్లు పన్నులు వసూలు చేస్తుంటే మాత్రం ఆర్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ అని పిలవాల్సి ఉంటుంది’ అన్నారు. అధికారులు మాత్రమే జీఎస్టీ వల్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. పరోక్ష పన్నుల విధానంలోకి పెట్రోలియం ఉత్పత్తులను కూడా తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment