న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో కోత విధించే అవకాశం లేదని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పటికే తగ్గాయని, ఈ నేపథ్యంలో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితి లేదని చెప్పారు. భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతానికి దిగుమతులపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
ధరలు ఇప్పటికే తగ్గినప్పుడు, ఇక పన్ను తగ్గింపు ప్రశ్న ఉత్పన్నం కాదు. మీరు పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు కోసం అడగవచ్చు, కానీ పన్నుల తగ్గింపు గురించి ఇప్పుడు ప్రశ్నించడం సరికాదు’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని చివరిసారిగా మే 2022లో తగ్గించారు. ఈ నిర్ణయం మేరకు పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్‌కు రూ.8 తగ్గింది. డీజిల్‌పై రూ.6 తగ్గించడం జరిగింది.
రూ.33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్లే లక్ష్యం!
బడ్జెట్ సవరిత అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రూ. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment