పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై పన్ను తగ్గించాలి  | Tax On Petrol Diesel And Gas Should Be Reduce: TPCC Senior VP Niranjan | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై పన్ను తగ్గించాలి 

Published Tue, Apr 12 2022 4:19 AM | Last Updated on Tue, Apr 12 2022 3:07 PM

Tax On Petrol Diesel And Gas Should Be Reduce: TPCC Senior VP Niranjan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై రాష్ట్రప్రభుత్వం వ్యాట్‌ రూపంలో వసూలు చేస్తున్న పన్నును తగ్గించి ప్రజలకు వెసులుబాటు కల్పించాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. పెట్రో ల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధించిన కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి పెరిగిన పెట్రో ల్, డీజిల్‌ ధరలతో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.4, డీజిల్‌పై రూ.3 చొప్పున రాష్ట్రానికి ఆదాయం వస్తోందని సోమవారం నిరంజన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ భారాన్ని తగ్గించాలని, అలాగే పెంచిన కరెంటు, బస్సు చార్జీలను తగ్గిస్తేనే ప్రజ లు కేసీఆర్‌ను విశ్వసిస్తారని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement