న్యూఢిల్లీ: పన్నులు కట్టే విషయంలో వేతన జీవుల కన్నా కార్పొరేట్లు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర సూచించారు. వివిధ మినహాయింపులు పోనూ భారత్‌లో బడా కంపెనీలపై విధిస్తున్న పన్ను భారం చాలా తక్కువే ఉంటోందన్నారు.
ఈ నేపథ్యంలో పన్నులు ఎగవేసే ఉద్దేశంతో.. ఐటీ చట్టాలను దుర్వినియోగం చేయొద్దని సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్ర ఈ విషయాలు తెలిపారు. ‘చట్టాలు చాలా మటుకు సరళం చేశాం. సాధారణంగా మీరు అడిగేట్లుగానే రేటు కూడా సముచిత స్థాయిలోనే ఉండేలా చూస్తున్నాం.
ఇక, పరిశ్రమవర్గాలు నిఖార్సుగా పన్నులు కడుతున్న పక్షంలో పన్ను రేటు ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. వేతన జీవులకన్నా కంపెనీలు ఈ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment