ప్రస్తుత కుంభమేళా కనీసం రూ.2–4 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుందన్నది ఓ అంచనా. మరి అప్పట్లో అంటే 1870లో అలహాబాద్‌లోనే బ్రిటిష్ ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించిన కుంభమేళాలో ఎంత వచ్చి ఉంటుంది? కరెక్టుగా చెప్పాలంటే.. రూ.41,824! ఇందులో పావు వంతు క్షురకుల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చినదే.
అప్పటి కుంభమేళాలో భక్తజనం కోసం 2,500–3,000 మంది క్షురకులను పెట్టారు. ఇక్కడ వ్యాపారం చేసుకున్నందుకు గానూ వీరి నుంచి రూ.4 చొప్పున పన్ను వసూలు చేశారు. ఈ కుంభమేళాతో వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు.. అలాగే అల్ఫ్రెడ్ పార్క్, అలహాబాద్ మ్యూజియం, వైద్య సదుపాయాల కోసం వెచ్చించింది. తర్వాత 1882లో జరిగిన కుంభమేళాలో రూ.49,840 మేర ఆదాయం వచ్చిందట.
Comments
Please login to add a commentAdd a comment