
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో ఎస్పీ చౌదరి, బిజేంద్రకుమార్, ఉదయభాస్కర్, రాంచంద్ర ఎన్.గల్లా తదితరులు
సాక్షి, హైదరాబాద్: వయోజనులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారిని దృష్టిలో పెట్టుకుని ఆదాయ పన్ను రిటర్నుల దాఖలను సరళీకృతం చేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. ఆన్‌లైన్ ద్వారానే ఈ–రిటర్నులను స్వీకరి స్తుండటంతో వృద్ధులు, కంప్యూటర్ పరిజ్ఞానం తెలియని వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా దరఖాస్తు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. మంగళవా రం ఇక్కడ జరిగిన 158వ ఆదాయ పన్ను దినో త్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆదాయ పన్నుల చెల్లింపులకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న కొందరు పారిశ్రామికవేత్తలతో ఓ కన్సార్టి యాన్ని రూపొందించి, వారు చెల్లించిన పన్నుల నుంచి కొంతభాగాన్ని విద్య, వైద్య రంగాల్లో సామాజిక కార్యక్రమాల నిర్వహణ కోసం తిరిగి వారికే చెల్లించాలనిగవర్నర్ ప్రతిపాదించారు.
కార్యక్రమంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సీఎండీ వి.ఉదయభాస్కర్, ఏపీ, టీఎస్ హైదరాబాద్ రీజియన్ ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్యామ్‌ప్రసాద్ చౌదరి, ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్.బిజేంద్రకుమార్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లిమిటెడ్ చైర్మన్ సతీష్ కె.రెడ్డి, అమర్‌రాజా బ్యాటరీస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ రాంచంద్ర ఎన్.గల్లా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment