
నగదు ర'హితమే'!
నగదు తగ్గడం వలన ఎన్నో లాభాలు
- నల్లధనం, అవినీతిపై నియంత్రణ
- పన్నుల ఎగవేతకూ చెక్.. లావాదేవీల్లో పారదర్శకత
- నకిలీ నోట్ల వంటి సమస్యలూ ఉండవు
- సైబర్ నేరాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం
మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువశాతం నగదు ఆధారంగానే నడుస్తోంది. అయితే వ్యవస్థ నుంచి నగదు పూర్తిగా తొలగిపోయినా.. లేదా గణనీయంగా తగ్గినా చాలా రకాల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్లధనం, అవినీతికి చెక్ పడుతుంది. పన్నుల ఆదాయం పెరుగుతుంది. అయితే నగదు రహిత వ్యవస్థలో ప్రధానమైన ప్లాస్టిక్ మనీ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల వంటి వాటి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ అంశాలపై ఈ రోజు ఫోకస్..
- సాక్షి నాలెడ్‌జ సెంటర్
నల్లధనానికి, అవినీతికి చెక్
దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం విలువలో నల్లధనం వాటా 25 శాతం వరకూ ఉంటుందని అంచనా. అన్ని లావాదేవీలు నగదు రహితంగా జరిగితే ఈ నల్లధనం వాటా గణనీయంగా తగ్గిపోతుంది. రూపారుు డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ప్రభుత్వానికి లెక్క తెలుస్తుంది. అమ్మకాలను, ఆదాయాన్ని తక్కువగా చూపడానికి కుదరదు. ప్రతి పైసా లెక్కలోకి వస్తుంది కాబట్టి విధిగా సంబంధిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నగదు రహిత లావాదేవీలతో పాటు.. ప్రభుత్వ అనుమతుల జారీ, పథకాల అమలు తదితరాలను డిజిటలైజ్ చేయడం వల్ల అధికార యంత్రాంగంలో అవినీతి గణనీయంగా తగ్గిపోతుంది.
పన్ను ఆదాయం పెరుగుతుంది
దేశ జనాభా 125 కోట్ల వరకూ ఉంటే ఇందులో ఆదాయ పన్ను కట్టే వారు నాలుగు కోట్ల మంది కూడా లేరు. మిగిలిన వారి దగ్గర పన్ను కట్టేంత ఆదాయం లేదని కాదు. లెక్కల్లోకి రాని ఆదాయం ఎక్కువగా ఉందని దీనర్థం. క్రెడిట్, డెబిట్ కార్డులు, వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా జరిగితే వ్యాపారులు ఆ లెక్కలను ప్రభుత్వానికి చూపాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి పన్నులు కచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది. మన దేశంలో స్థూల జాతీయోత్పత్తిలో పన్నుల వాటా పది నుంచి 17 శాతం వరకూ ఉంటుందని అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతమున్న పన్ను రేట్లు (కార్పొరేట్, ఆదాయ) ఇదే స్థారుులో కొనసాగిస్తే మాత్రం చాలామంది నగదు రహిత లావాదేవీలకు ఇష్టపడే అవకాశం తక్కువ.
‘నగదు’ ఖర్చులు ఆదా
నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా ఉంటే నోట్ల ముద్రణ, రవాణా ఖర్చులు చాలా తగ్గుతాయి. ఒక్కో రూ.500 నోటును ముద్రించేందుకు దాదాపు 3.08 రూపాయలు, రూ.1,000 నోటును ముద్రించేందుకు నాలుగు రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇది కూడా నాలుగేళ్ల క్రితం అంచనా. ఇక దేశంలోని నాలుగు ముద్రణ కేంద్రాల నుంచి నోట్లను దేశవ్యాప్తంగా తరలించేందుకు, ఆయా క్యాష్ సెంటర్లలో నిల్వ ఉంచేందుకు, నిర్వహణకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకులు (క్యాష్ మేనేజ్‌మెంట్‌కు) ఏటా దాదాపు రూ. 21 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారుు. కరెన్సీ తక్కువగా ప్రింట్ చేస్తే అంత మేరకు ఈ ఖర్చులు తగ్గుతారుు.
మాంద్యంలోనూ ఆదుకుంటుంది
అమెరికాను కుదిపేసిన ఆర్థిక మాంద్యం గుర్తుంది కదా? లావాదేవీలన్నీ నగదు రహితంగా మారితే ఈ రకమైన మాంద్యాలను అధిగమించడం కొంచెం సులువు అవుతుంది. ప్రజల సొమ్ములో అధిక భాగం బ్యాంకుల్లోనే ఉంటుంది కాబట్టి.. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో బ్యాంకులు డిపాజిట్లపై నెగటివ్ పన్నులు విధించడం ద్వారా ప్రజలు ఆ మొత్తాలను ఖర్చు పెట్టేలా చేయవచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థ చైతన్యవంతమవుతుంది.
నకిలీ నోట్లకు చెల్లుచీటీ
డిమాండ్ ఉన్నప్పుడే ఏ వస్తువుకై నా విలువ పెరుగుతుంది. సరఫరాదారులూ ఎక్కువవుతారు. నగదు కూడా దీనికి అతీతం కాదు. లావాదేవీలు ఎక్కువ శాతం నగదు రూపంలో జరిగితే నకిలీల బెడదను తప్పించడం కష్టం. అదే లావాదేవీలన్నీ బ్యాంకులు, డిజిటల్ రూపంలో జరిగితే నగదు అవసరం బాగా తగ్గిపోతుంది కాబట్టి నకిలీలను చలామణీలోకి తీసుకురావడం దాదాపు అసాధ్యమవుతుంది.
నేరాలు తగ్గుతాయి
నగదు రహిత ఆర్థిక లావాదేవీల వల్ల సమాజంలో నేరాలు తగ్గుతాయని ఒక అంచనా. స్వీడన్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడ నగదు రహిత ఆర్థిక లావాదేవీలు పుంజుకున్న తరువాత బ్యాంకు దోపిడీలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నారుు. 2008లో దాదాపు 116 దోపిడీలు జరిగితే 2012 నాటికి 5కు తగ్గారుు. అంతెందుకు నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత ముంబైలో నేరాల సంఖ్య సగానికిపైగా తగ్గినట్లు కథనాలు వచ్చారుు. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి అని అంచనా.
ఆర్థిక లావాదేవీలు వేగవంతం
నగదు రహితంగా డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీలు వేగవంతమవుతారుు. బ్యాంకు నుంచి వినియోగదారుడికి, వినియోగదారుడి నుంచి బ్యాంకుకు, ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి మరొక వ్యక్తి బ్యాంకు ఖాతాకు నగదును క్షణాల్లో బదిలీ చేయవచ్చు. నగదును జమ చేయడానికి బ్యాంకులకు వెళ్లడం, క్యూలలో నిల్చోవడం వంటి ప్రయాసలు తగ్గిపోతారుు.
ఉగ్రవాదానికి గొడ్డలిపెట్టు
ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చే వారికి నగదు వ్యవహారాలే ప్రధానం కాబట్టి నగదు రహిత లావాదేవీలు ఈ చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సాయపడతాయ నడంలో సందేహం లేదు. నల్లధనం తక్కువవుతున్న కొద్దీ ఉగ్రవాద చర్యలకు నిధులందించే వారికి ఇబ్బందే. అరుుతే నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగే పది దేశాల్లో ఇటీవల జరిగిన అధ్యయనం మాత్రం.. నగదు రహిత లావాదేవీలు ఉగ్రవాద నిధుల ప్రవాహానికి అడ్డంకి కాదని పేర్కొనడం గమనార్హం.