
ఎలక్షణాకర్ష...
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2015- 16 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్‌ను విధానసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12.30గంటలకు బడె ్జట్ ప్రసంగాన్ని ప్రారంభించి సాయంత్రం 3.30గంటలకు ముగించారు. విధానసభలో సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది పదోసారి కాగా, ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మూడోసారి. ఇక బడ్జెట్ రూపకల్పన స్వరూపాన్ని ఓ సారి పరిశీలిస్తే....త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బృహత్ బెంగళూరు మ హానగర పాలికెకు జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొం దించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ఎక్కువగా ఆకర్షించడంతో పాటు బీబీఎంపీ పరి దిలో పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా చిట్టా పద్దులను పొందుపరిచారు.
ఆదాయ పెంపు మార్గాల్లో భాగంగా మందుబాబులు, పొగరాయుళ్లపై పన్నులు వేశారు. ఇక పెట్రోలు, డీజల్‌పై ఏకంగా ఒక శాతం పన్నును పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.1,42,534 కోట్ల పరిమాణంతో బడ్జెట్‌ను రూపొం దిచారు. గత ఆర్థిక ఏడాది బడ్జెట్ (రూ.1,38,008 కోట్లు) తో పోలిస్తే ఇది 3.28 శాతం ఎక్కువ. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించక పోవడంతో ఈ ఏడాది బడ్జెట్‌కు అన్ని రంగాల నిపుణులు వందకు 50 మార్కులను వేస్తున్నారు.
బడ్జెట్‌లో కొన్ని ప్రముఖమైన విషయాలు.....
షూ భాగ్య- ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏడాదికి ఒక జత షూ, రెండు జతల సాక్సులు ఉచితంగా వితరణ
పశుభాగ్య - ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం సబ్సిడీ, అదే మిగిలిన చిన్న,సన్నకారు రైతులైతే 25 శాతం సబ్సిడీ
నీరా భాగ్య - కొబ్బరి రైతులకు నీరా తయారీకి అనుమతించేలా ఎక్సైజ్‌చట్టంలో సవరణలు
సులభ నొందిని - జిల్లాలోని ఏ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలోనైనా ఆస్తులను ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం
రూ.15,000 కంటే తక్కువ జీతం వస్తున్న వారికి వృత్తి పన్ను నుంచి మినహాయింపు. ప్రస్తుతం అది రూ.10 వేలుగా ఉంది.
మందుబాబుల జేబుకు చిల్లు - మద్యం పై ప్రస్తుతం ఉన్న 6 శాతం ఎక్సైజ్ డ్యూటీని 20 శాతానికి (17 స్లాబులకూ వర్తిస్తుంది) పెంచుతూ నిర్ణయం.
పొగరాయుళ్లకు షాక్ - పొగాగు ఉత్పత్తులైన సిగరెట్, గుట్కా పై ప్రస్తుతం ఉన్న వ్యాట్‌ను 17 నుంచి 20 శాతానికి పెంచుతూ నిర్ణయం.
అంకెల్లో బడ్జెట్ (రూ.కోట్లలో)
బడ్జెట్ పరిమాణం - 1,42,534
ప్రణాళికేతర వ్యయం - 75,840
ప్రణాళిక వ్యయం - 72,597
రుణాల చెల్లింపులకు - 5,788
కేంద్ర పన్నుల వాట - 24,789.78
గ్రాంట్ ఇన్ ఎయిడ్ - 9,918.97
రాష్ట్ర పన్నేతర ఆదాయం - 5,206.17
రాష్ట్ర పన్నుల ద్వారా ఆదాయం - 76,445.40
రెవెన్యూ మిగులు - 911
ద్రవ్యలోటు - 20,220
రెవెన్యూ వ్యయం - 1,15,450
మొత్తం రాబడి - 1,39,476