చెన్నై : సినీ రంగంలో అనుభవంతో పాటు రాజకీయాల్లో సినీనటి కుష్బు రాటుదేలారు. అయితే ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ డేరింగ్ లేడీ ఏ విషయమైనా తనకు తప్పు అనిపిస్తే వెంటనే నిర్భయంగా చెప్పేస్తారు. ఇటీవల వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలు జన జీవనానికి ప్రమాదకరంగా మారాయి. దాంతో అధికారులు రోడ్లపై తాత్కాలిక మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వ్యవహారంపై కుష్బు ఘాటుగా స్పందించారు.
ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ''వర్షాల అనంతరం నగరాల్లోని రోడ్లను చూస్తుంటే మనం ఎందుకు పన్నులు చెల్లిస్తున్నామని... ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా గుంతలు, కోతలు, చేతికందే ఎత్తులో కరెంటు తీగలు ప్రమాదకరంగా మారాయి. ప్రజలందరూ పన్నుకడుతున్నారు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి'' అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఘాటుగా స్పందించిన కుష్బు
Published Tue, Nov 4 2014 9:16 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
Advertisement
Advertisement