
3.4 బిలియన్ డాలర్లు పన్నులు చెల్లించిన అలీబాబా
3 కోట్ల మందికి ఉపాధి కల్పన
బీజింగ్: చైనా ఈ–కామర్స్ దిగ్గజం ‘అలీబాబా గ్రూప్’ గతేడాది మొత్తంగా దాదాపు 3.41 బిలియన్ డాలర్లు పన్నుల రూపంలో చెల్లించింది. అలాగే 3 కోట్ల మందికి ఉపాధిని కల్పించింది. ఇక అలీబాబా ప్లాట్‌ఫామ్‌లోని వ్యాపారులు, తయారీదారులు, లాజిస్టిక్స్ కంపెనీలు 2016లో 200 బిలియన్ యువాన్లను పన్నులు రూపంలో చెల్లించాయి. ‘మేము, మా అనుబంధ సంస్థ ఏఎన్‌టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ గతేడాది మొత్తంగా 23.8 బిలియన్ యువాన్లను (3.41 బిలియన్ డాలర్లు= దాదాపు రూ.23,188 కోట్లు) పన్నుల రూపంలో చెల్లించాం. ఇది గతేడాది పోలిస్తే 33 శాతం అధికం’ అని అలీబాబా పేర్కొంది. కాగా అలీబాబా షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 45,000కు పైగా సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. వీరి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 142 శాతం మేర వృద్ధి చెందింది.