పన్నులు లేకుండా పనులు కావు: వెంకయ్య
పన్నులు లేకుండా పనులు జరగవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తే, వాళ్లు పన్నులను సక్రమంగా చెల్లిస్తారని, అదే సరైన ఆలోచనలు చేయకపోతే మాత్రం దేశాభివృద్ధి సాధ్యం కాదని ఆయన చెప్పారు.
అలాగే బ్యాంకు ఖాతాలు లేనివారిని ఆర్థిక అంటరానివారని నేరుగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగే చెప్పారని గుర్తుచేశారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మాట్లాడుతూ వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.