పావలా వాటా కూడా వసూలు కాని పన్నులు
Published Sun, Sep 29 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్:జిల్లాలోని మున్సిపాలిటీలలో పన్నుల వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు తదితర మున్సిపాలిటీలలో ఈ అర్ధ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్)లో ఇప్పటి వరకు కనీసం పావలా వాటా కూడా వసూలు కాలేదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు మున్సిపాలిటీలలో పన్నులు వసూలు కాకపోడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే అధికారులు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించేవారు. దీంతో నెల నెలా కనీసం జీతభత్యాలకు కావలసిన మొత్తానికైనా ఆయా సిబ్బంది పరుగులెత్తి పన్నులు వసూలు చేసేవారు.
అయితే 2011 నుంచి పన్నుల వసూళ్లతో సంబంధం లేకుండా ప్రభుత్వమే మున్సిపల్ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తుండడంతో పన్నుల వసూళ్లపై శ్రద్ధ కనబరచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలు.. నివాస, వ్యాపా ర సముదాయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆస్తి పన్నులు, అలాగే రావడం లేదు. ఢిల్లీ, హైదరాబాద్‌ల మధ్యనే తిరుగుతూ అక్కడ్నుంచే పార్టీ కార్యకర్తలకు సూచనలు, సలహాలు అందిస్తూ వస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడైన సత్తిబాబు రెండునెలలుగా సొంత జిల్లాలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. పార్టీ క్యాడర్ అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు ఆయన రా జీడ్రామాకు తెరలేపినట్లు తెలుస్తోంది.అప్పుడుఉద్యమకారులు నిలదీసినా ‘నానూ రాజీనామా సేసినాను కదేటి’ అని చెప్పుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పండక్కీ రాకపోతే పనైపోయినట్లే..!!
విజయనగరం జిల్లా వాసులకు దసరా తరువాత వచ్చే పైడితల్లమ్మ పండగ చాలా ముఖ్యమైనది. ఈ సందర్భంగా అక్టోబర్ 20, 21, 22 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పండగ సందడి నెలకొంటుంది. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలుగా పూసపాటి ఆనందగజపతిరాజు, ఆయన సోదరుడు అశోక్ గజపతిరాజులకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఇదే తరుణంలో జిల్లాకు చెందిన మంత్రి ఎవరైనా ఉంటే వారికీ ప్రాముఖ్యతను ఇస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సత్తిబాబు ఈ ఉత్సవాలకు వస్తే జనంతో పాటు ఉద్యమ సంఘాలు ఆయన్ను నిలదీసే అవకాశం ఉంది. అలాగని వారికి భయపడి ఉత్సవాలకు రాకుండా దాక్కుంటే అంతకు మించిన పరువు తక్కువ పని ఇంకొకటి ఉండదు.
ఈ నేపథ్యంలో పండక్కి రావాలన్నా జనానికి ఏదో ఒక మాట చెప్పి ఒప్పించాలి. దీంతో దానికి ముందస్తుగా అక్టోబర్ 6, 8 తేదీల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించాలని పార్టీ జిల్లా నేతలు నిర్ణయించారు. దానికి సత్తిబాబును సైతం ఆహ్వానించారు. అయితే నేరుగా వచ్చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి ఈ లోగా రాజీడ్రామా నడిపి, ఈ కార్యక్రమానికి హాజరై ఆ తరువాత పైడితల్లమ్మ ఉత్సవాలకు మార్గం సుగమం చేసుకోవాలన్నది బొత్స పథకం. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన్ను అడ్డుకుని తీరుతామని ఉద్యమ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. విభజనకు మూలకారకుడైన సత్తిబాబును జిల్లాలో తిరగనిచ్చేది లేదని, ప్రజలకు వివరణ ఇచ్చిన తరువాతనే ఆయన జిల్లాకు రావాలని, లేదంటే తగిన విధంగా ప్రజల నుంచి ఛీత్కారాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Advertisement
Advertisement