సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి | Make the most of the welfare schemes | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Published Wed, Jul 13 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

Make the most of the welfare schemes

విజయనగరం  మున్సిపాలిటీ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి పి.ఉషాకుమారి తెలిపారు. బుధవారం జిల్లాకు వచ్చిన ఆమె స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మైనార్టీలకు మంజూరు చేసిన రుణాల సబ్సీడీ విడుదల చేయటం జరిగిందన్నారు.
 
  2011 జనాభా లెక్కల ప్రకారం మైనార్టీల జనాభా లెక్కల్లో తేడాలు ఉన్నాయని, కచ్ఛిత సమాచారం అందించాలని కోరారు. క్రైస్తవ మైనార్టీల కులధ్రువపత్రాల మంజూరులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ కె.నారాయణ, మైనార్టీ సంక్షేమ అధికారి భవాని, ఎస్‌ఎంకే బాషా, ఎండిషుబూర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement