వంద రోజుల ప్రణాళిక
విజయనగరం మున్సిపాలిటీ:విద్యుత్ సరఫరాలో లోపాలను అధిగమించి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్ర త్యేకంగా కార్యచరణ రూపొందిస్తోంది. ప్రధానంగా సరఫరాలో అవంతరాలకు క్షేత్రస్థాయి సమస్యలే కారణం కావడంతో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈ సమస్యలను పరిష్కరించి వినియోగదారులకు మెరుగైన సరఫరా అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా విద్యుత్ శాఖాధికారులు పేర్కొంటున్నారు.
ఇందులో భాగంగా విజయనగరం సబ్ డివిజన్ పరిధికి సంబంధిం చి వంద రోజుల ప్రణాళికను రూపొందించి ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ సి. శ్రీనివాసమూర్తికి నివేదికలు అందజేసినట్టు తెలి సింది. మిగిలిన సబ్ డివిజన్‌లకు సంబంధించి సోమవారం నాటికి పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని ఆయా అధికారులకు ఎస్‌ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గృహ విద్యుత్ కనెక్షన్లకు 24 గంటల పాటు, వ్యవసాయ విద్యుత్ కనె క్షన్లకు రోజులో ఏడు గంటల పాటు నిరంతరాయంగా సరఫరా అందించాలన్నదే ప్రభుత్వం ప్రధాన ఉద్ధేశం.
ఈ మేరకు వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేసి అక్టోబర్ 2 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోం ది. ఈ మేరకు ఇందుకు అ వసరమైన విద్యుత్ పరికరాలను ఏపీఈపీడీసీఎల్ సరఫరా చేయనుంది. ఇందులో భాగంగా విజయనగరం సబ్ డివి జన్‌కు సంబంధించి రూపొందించిన ప్రణాళికల్లో లోఓల్టేజీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాం తాల్లో 48 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మరమ్మతుకు గురైన ఏబీ స్విచ్‌లను 200 వరకు సరి చేయను న్నారు. పూర్తిగా పని చేయని కండక్టర్‌లను మార్చడంతో పాటు కొద్దిపాటి లోఓల్టేజీ సమస్యలున్న ప్రాం తాల్లో ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ పెంచనున్నారు. అలాగే సబ్ డివిజన్ పరిధిలో ఒరిగి ఉన్న, తుప్పుపట్టిన 81 విద్యుత్ స్తంభాలతో పాటు, వదులుగా ఉన్న విద్యుత్ లైన్స్‌ను సరి చే యనున్నారు.
15 నుంచి పనులు ప్రారంభం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ నుం చి విద్యుత్ శాఖలో రూపొందించిన వంద ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులు ప్రారంభం కా నున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రారంభించిన పనులను వంద రోజుల్లో పూర్తి చేయాల్సి ఉం టుంది. అయితే అధికారులు వంద రోజుల్లో సమస్యలను పరిష్కరించాలంటే ప్రకృతి సహకరించాలి. కానీ అది ఎంతవరకు సాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తలెత్తిన విద్యుత్ సంక్షోభం వల్ల నాలుగు నెలలుగా గృహావసర విద్యుత్ కనెక్షన్‌లతో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు ఎప్పుడు సరఫరా ఉంటుందో...ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరి స్థితి ఉంది. తాజాగా అధికారులు వంద రోజుల ప్రణాళిక పేరుతో చేపడుతున్నట్టు అభివృద్ధి పనులు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయో... వేచి చూడాల్సిందే.