నెల్లిమర్ల: విజయనగరం మున్సిపాలిటీకి చెందిన ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు నెల్లిమర్లలోని చంపావతి నదిలో రామతీర్ధం మంచినీటి పథకాన్ని సుమారు రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు. దీని కోసం నదిలో ఊటబావులను స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలోను న్న మాస్టర్ పంప్‌హౌస్ నుంచి స్థానిక ఆర్వోబీ కింద నుంచి మిమ్స్ మీదుగా పట్టణానికి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ పంప్‌హౌస్ ద్వారా విజయనగరం పట్టణంలో సుమారు లక్ష మందికి ప్రతిరోజూ 15 మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. పైపులైను వెళ్లే స్థలమంతా ప్రభుత్వానిదే. అయితే నెల్లిమర్ల రెవెన్యూ అధికారులు అనాలోచితంగా వ్య వహరించారు. పైపులైను వెళుతున్న ప్రభుత్వ స్థలాన్ని...
ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేశారు. ఇక్కడి ఆర్వోబీకి సమీపంలోనున్న ఈ స్థలంలో కొంతభాగాన్ని రెండేళ్ల క్రితం కొం డవెలగాడకు చెందిన వెయిట్‌లిఫ్టర్లకు కేటాయించారు. మిగి లిన స్థలాన్ని కూడా ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్నారు. ఇటీవల పలు గ్రామాలకు చెందిన వారికి ఇదే స్థలంలో పది పట్టాలు పంపిణీ చేశారు. ఆ స్థలంలో ఇప్పటికే కొంతమంది ఇళ్లు నిర్మించుకోగా..మరికొంతమంది పునాదులు వేస్తున్నారు. అలాగే ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న మరికొంత స్థలాన్ని ఇస్కాన్ అనే ఆధ్యాత్మిక సంస్థకు అధికారులు మూడేళ్ల క్రితం అప్పగించారు. ఇక్కడ కూడా ప్రస్తుతం భవనాల నిర్మాణం జరుగుతోంది. రెండింటికీ మధ్యనున్న స్థలంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఎస్‌ఈ కార్యాలయ భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఎనిమిదడుగుల లోతులో అప్పట్లో పైపులైన్లు ఏర్పాటు చేశారు.
సాధారణ భవనాలకు ఐదడుగుల వర కూ పునాదులు తవ్వుతారు, పెద్ద భవ ంతులకు ఆరు నుంచి ఎనిమిది అడుగుల వరకూ తవ్వే అవకాశం ఉంది. పునాదులు తవ్వే సమయంలో కూడా పైపులైన్ పగిలిపోయే అవకాశం ఉం ది. నిర్మాణాలన్నీ పూర్తయితే తాగునీ టి పైపులైనుకు ఇబ్బంది తప్పదు. ఎప్పుడైనా పైపులైను పాడైతే ..ఇదే స్థలంలో తవ్వి రిపేరు చేయాలి. పైపులైను వెళ్లే స్థలమంతా ఇళ్ల నిర్మాణాలతో నిండిపోతే మరమ్మతులు చేపట్టేందుకు అవకాశమే ఉండదు. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరా ప్రశ్నార్ధకంగా మారుతుంది. పూర్తయిన ఇళ్ల మాట అటుంచితే, ఇప్పటికైనా అధికారులు కళ్లుతెరిచి పైపులైను స్థలంలో చేపడుతున్న భవనాలు, ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయనగరం మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగరపంచాయతీ అధికారులు ఇప్పుడైనా స్పంది స్తారో లేదో వేచి చూడాల్సిందే.
విజయనగరానికి పొంచి ఉన్న నీటి గండం!
Published Fri, Aug 29 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement