సాక్షి ప్రతినిధి, విజయనగరం : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పూర్వపు ఈఈ, ప్రస్తుత డీఈఈ శ్రీనివాస్‌కుమార్ లక్ష్యంగా చేసుకుని జెడ్పీ చైర్‌పర్సన్ ఎత్తులు వేస్తుంటే, అందుకు ఆయన మద్దతు ఎమ్మెల్యేలు పైఎత్తులు వేస్తున్నారు. గత పాలకులకు అనుకూలంగా వ్యవహరించిన ఇన్‌చార్జి ఈఈ శ్రీనివాస్‌కుమార్ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఎమ్మెల్యేల అండతో పంచాయతీరాజ్‌లో ఇంకా పెత్తనం చెలాయిస్తున్నారని, తమకు తెలి యకుండా వ్యవహారాలు నడుపుతున్నారన్న అనుమానంతో ఆయన్ని ఎలాగైనా సాగనంపాలని జెడ్పీ పెద్దలు పథక రచన చేశారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కున్న ఇన్‌చార్జి ఈఈ బాధ్యతలను తొలగించి, డీఈఈగా వెనక్కి పంపించేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. ఈఈ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినతరువాత ఎమ్మెల్యేలు సూచించిన వారిని పాత తేదీతో అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్లగా నియమించినట్టు అభియోగాలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి మృణాళిని తీవ్రంగా స్పందించారు. టెక్నికల్ అసిస్టెంట్ల నియామకాలను నిలిపేసి, డీఈఈ శ్రీనివాస్‌ను సరెండర్ చేయాలని పంచాయతీరాజ్ ఎస్‌ఈకి మంత్రి తరఫున ఓఎస్‌డీ నుంచి ఒక లేఖ వచ్చింది. రహస్యంగా పంపించిన మంత్రి ఓఎస్‌డీ లేఖను వ్యూహాత్మకంగా చైర్‌పర్సన్ వర్గీయులు లీక్ చేశారని, జెడ్పీలో అంతా పథకం ప్రకారం జరుగుతోందని రాష్ట్ర మంత్రి వర్గీయులు అనుమానానికొచ్చినట్టు తెలిసింది. ఇదే అదనుగా శ్రీనివాస్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు కూడా మంత్రితో మాట్లాడినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే లంతా కలిసికట్టుగా, వ్యూహాత్మకంగా పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడ్ని కలిసి తమను నమ్ముకున్న డీఈఈ శ్రీనివాస్‌కు మార్‌కు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడమే కాకుండా, పీఏ టూ ఎస్‌ఈగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించినట్టు తెలిసింది. దీంతో చైర్‌పర్సన్ వర్గీయులు కంగుతిన్నారు. ఆ ఉత్తర్వులు బయటపెట్టొద్దని, పంచాయతీరాజ్ మంత్రి, సీఈతో మా ట్లాడుతానని జిల్లా ఎస్‌ఈకి చైర్‌పర్సన్ వర్గీయులు లోపాయికారీగా చెప్పినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అ టు చైర్‌పర్సన్, ఇటు డీఈఈ వర్గీయులు ప్రతిష్టకు పోయి, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్తున్నారు. డీఈఈ శ్రీనివాస్ మాత్రం ఎక్కడ పోగుట్టుకున్నానో అక్కడే వెదుక్కోవాలన్న ఆలోచనతో పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందో, ఎంతవర కు వెళ్తుందో చూడాలి.
ఎత్తుకు పైఎత్తులు
Published Sun, Aug 31 2014 1:52 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement